![Israel-Hamas war: Israeli airstrikes on Rafah kill at least 22 people](/styles/webp/s3/filefield_paths/rafah.jpg.webp?itok=6kjTORsB)
రఫా: గాజా ప్రాంతంలోని హమాస్ మిలిటెంట్లకు పట్టున్న రఫాలోకి తమ సైన్యం త్వరలో ప్రవేశించనుందంటూ హెచ్చరికలు చేస్తున్న ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులకు దిగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు. హమాస్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆరు నెలలకు పైగా భీకర దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఉండగా, కాల్పుల విరమణకు ఒప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌లో సంభాషించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment