Olympics 2016
-
తప్పుచేస్తే నన్ను ఉరితీయండి!
'గత 24 గంటలుగా నేను బెడ్ మీదే ఉన్నాను. నాలో శక్తి అంతా సన్నగిల్లింది. ఏమీ చేయలేకపోతున్నాను. మెదడు అంతా శూన్యంగా మారిపోయింది'.. ఇది భారత్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన. అతను వాస్తవానికి ఈ సమయంలో రియో ఒలింపిక్స్ బౌట్ లో ఉండాలి. అందుకు పూర్తిగా సిద్ధమయ్యాడు కూడా. తన ప్రత్యర్థి ఎవరో ఖరారైంది. వెయిట్ చెకింగ్ కూడా అయిపోయింది. ఇక బౌట్ లోకి దిగి అమీతుమీ తేల్చుకోవాల్సిన తరుణంలో క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) నర్సింగ్ కు షాకిచ్చింది. అతడిపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్టు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఒలింపిక్స్ క్రీడా గ్రామం నుంచి అతన్ని పంపించేశారు. ఈ పరిణామాలతో కుమిలిపోతున్న నర్సింగ్ యాదవ్ తాజాగా 'ఎన్డీటీవీ'తో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 'నేను తప్పు చేసి ఉంటే నన్ను ఉరితీయండి. కానీ నా జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. అది సత్యం. ఈరోజు నేను వెయిట్ కూడా చెక్ చేసుకున్నాను. నన్ను అనుమతించిఉంటే తప్పకుండా దేశానికి పతకాన్ని తెచ్చేవాణ్ణి. ఈరోజు నర్సింగ్ కాదు దేశం పతకాన్ని కోల్పోయింది' అని పేర్కొన్నాడు. తన ప్రత్యర్థులు తన ఆహారం, డ్రింక్స్ లో డ్రగ్స్ కలుపడం వల్ల డోపింగ్ టెస్టు తనకు వ్యతిరేకంగా ఫలితం వచ్చిందని 74 కిలోల విభాగం రెజ్లర్ అయిన నర్సింగ్ పేర్కొన్నాడు. -
ఫైనల్లో బింద్రా ఓటమి..
రియో ఒలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. భారత హాకీ పురుషుల జట్టుతో పాటు షూటర్ అభినవ్ బింద్రా తీవ్రంగా నిరాశపరిచాడు. 2-1 తేడాతో భారత్‌పై జర్మనీ హాకీ జట్టు విజయం సాధించింది. పురుషుల పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్లో బింద్రా ఓటమి పాలయ్యాడు. దీంతో భారత్ షూటింగ్ విభాగంలో ఏ పతకాన్ని సాధించలేకపోయింది. బింద్రా 163.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇటలీ ఆటగాడు కెంప్రైనీ 206.1 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, రెండో స్థానంలో ఉక్రెయిన్ ప్లేయర్ కూలిష్, మూడో స్థానంలో రష్యా ఆటగాడు మస్లిన్నికోవ్ నిలిచారు. అంతకు ముందు బింద్రా ప్రాథమిక రౌండ్లో చక్కని ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత షూటర్ గగన్ నారంగ్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ప్రాథమిక రౌండ్లోనే అతని గురితప్పడంతో నారంగ్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
గురితప్పని బింద్రా.. నిరాశపర్చిన నారంగ్
రియో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టి.. పతకాల పట్టికలో స్థానం సాధించాలన్న భారత క్రీడాభిమానుల ఆశలు ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం కూడా భారత్‌కు విశ్వక్రీడల వేదికలో మిశ్రమ ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. పురుషుల పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ షూటర్ అభినవ్ బింద్రా సత్తా చాటాడు. ప్రాథమిక రౌండ్లో చక్కని ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత షూటర్ గగన్ నారంగ్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ప్రాథమిక రౌండ్లోనే అతని గురితప్పడంతో నారంగ్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణపతకాన్ని అందించిన అభినవ్ బింద్రానే ఈసారి కూడా భారతీయుల ఆశలను మోస్తున్నారు. 10.3, 10.4, 10.3, 10.8, 10.8, 10.3, 10.8, 10.4. పాయింట్లతో బింద్రా ఏడోస్థానంలో నిలిచి.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ ఈరోజు రాత్రి 8.30 గంటలకు జరగనుంది. మరోవైపు భారత హాకీ పురుషుల జట్టు ఈరోజు ఒలింపిక్స్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది.