గురితప్పని బింద్రా.. నిరాశపర్చిన నారంగ్
రియో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టి.. పతకాల పట్టికలో స్థానం సాధించాలన్న భారత క్రీడాభిమానుల ఆశలు ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం కూడా భారత్‌కు విశ్వక్రీడల వేదికలో మిశ్రమ ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.
పురుషుల పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ షూటర్ అభినవ్ బింద్రా సత్తా చాటాడు. ప్రాథమిక రౌండ్‌లో చక్కని ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత షూటర్ గగన్ నారంగ్ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. ప్రాథమిక రౌండ్‌లోనే అతని గురితప్పడంతో నారంగ్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణపతకాన్ని అందించిన అభినవ్ బింద్రానే ఈసారి కూడా భారతీయుల ఆశలను మోస్తున్నారు. 10.3, 10.4, 10.3, 10.8, 10.8, 10.3, 10.8, 10.4. పాయింట్లతో బింద్రా ఏడోస్థానంలో నిలిచి.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ ఈరోజు రాత్రి 8.30 గంటలకు జరగనుంది. మరోవైపు భారత హాకీ పురుషుల జట్టు ఈరోజు ఒలింపిక్స్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది.