బీసీసీఐని చూసి నేర్చుకోవాలి: బింద్రా
న్యూఢిల్లీ: తమ క్రీడను ఎలా అభివృద్ధి చేసుకోవాలో బీసీసీఐని చూసి నేర్చుకోవాలని ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా సూచించాడు. ‘క్రీడా ప్రపంచంలో బీసీసీఐ చక్కటి ప్రొఫెషనలిజాన్ని సృష్టించింది. ఇతర క్రీడా సమాఖ్యలు కూడా ఇలాంటి ధోరణిలోనే ముందుకు సాగాల్సి ఉంది. వీటికి ఇది చాలా ముఖ్యమైన తొలి అడుగు’ అని క్రీడలు, మౌళిక సదుపాయాలపై జరిగిన జాతీయ సెమినార్‌లో పాల్గొన్న బింద్రా తెలిపాడు. అలాగే దేశంలో క్రీడల అభివృద్ధికి క్రికెట్ బోర్డు క్రీడా శాఖకు రూ.50 కోట్లు ఇచ్చిం దని ఐఓఏ నూతన ఉపాధ్యక్షుడు, బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అయిన అనురాగ్ ఠాకూర్ గుర్తుచేశారు. పెద్ద పెద్ద స్టేడియాలు నిర్మించి నంత మాత్రాన దేశంలో క్రీడా వాతావరణం ఏర్పడదని క్రీడా శాఖ కార ్యదర్శి అజిత్ మోహన్ శరణ్ అభిప్రాయపడ్డారు.