బింద్రాకు రెండో స్వర్ణం | Abhinav Bindra wins two gold medals in Inter Shoot Tri series Shooting | Sakshi
Sakshi News home page

బింద్రాకు రెండో స్వర్ణం

Published Sat, Feb 8 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

ఇంటర్ షూట్ ట్రై సిరీస్ షూటింగ్‌లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా హవా కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో వరుసగా రెండోరోజు స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు.

న్యూఢిల్లీ : ఇంటర్ షూట్ ట్రై సిరీస్ షూటింగ్‌లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా హవా కొనసాగుతోంది. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో వరుసగా రెండోరోజు స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బింద్రా, క్వాలిఫికేషన్ రౌండ్‌లో 627.7 పాయింట్లు సాధించాడు. ఫైనల్స్‌లో 209 పాయింట్లు సాధించి స్వర్ణం గెల్చుకున్నాడు.
 
 షూటర్లకు సాయ్ ఆర్థికసాయం
 భారత షూటర్లు రంజన్ సోధీ, షాగున్ చౌదరి, హీనా సిద్ధు, మానవ్‌జిత్‌సింగ్ సంధూలకు సాయ్ రూ. 2 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement