రేపే చివరి రోజు: అభినవ్ బింద్రా | Tomorrow will mark the end of my professional shooting life | Sakshi
Sakshi News home page

రేపే చివరి రోజు: అభినవ్ బింద్రా

Published Mon, Sep 22 2014 5:04 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

రేపే చివరి రోజు: అభినవ్ బింద్రా

రేపే చివరి రోజు: అభినవ్ బింద్రా

ఇంచియాన్: భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా తన క్రీడా జీవితానికి వీడ్కోలు పలకనున్నట్టు ప్రకటించి సంచలనం రేపాడు. ఆసియా క్రీడల తర్వాత ప్రొఫెనల్ గన్ పట్టబోనని ఆయన ట్విటర్ లో ప్రకటించారు. ప్రొఫెనల్ షూటింగ్ లో రేపే తనకు చివరి రోజని వెల్లడించాడు. ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో బింద్రా పోటీపడనున్నాడు.

'రేపటితో తన క్రీడా జీవితం ముగియనుంది. ఆసియా క్రీడల తర్వాత ప్రొఫెషనల్ షూటింగ్ నుంచి తప్పుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో బింద్రా బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిదే. 2010 ఆసియా క్రీడల్లో వెండి పతకం సాధించిన బింద్రా ఈసారి స్వర్ణ పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement