
ఒలింపిక్స్‌లో వ్యక్తిగత క్రీడల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయుడైన షూటర్ అభినవ్ బింద్రా అరుదైన గౌరవం పొందాడు. షూటింగ్ క్రీడకు చేసిన సేవలకు గాను అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) అతడికి ‘బ్లూ క్రాస్’ పురస్కారం అందజేసింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ అవార్డుల్లో ఇది అత్యున్నతమైనది కాగా, భారత్ నుంచి ఈ ఘనత పొందిన తొలి షూటర్ బింద్రానే కావడం విశేషం. 36 ఏళ్ల బింద్రా... 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అంశంలో స్వర్ణం నెగ్గాడు.