
ఆసియా క్రీడల్లో అభినవ్ కు తొలి మెడల్
ఇంచియాన్: భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఆసియా క్రీడల్లో తొలి పతకం గెల్చుకున్నాడు. పురుషుల 10మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. 31 ఏళ్ల బింద్రా 187.1 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన యాంగ్(209.6) స్వర్ణం, ఇఫాయ్ కావో(208.9) వెండి పతకాలు గెల్చుకున్నారు.
అంతకుముందు జరిగిన పురుషుల 10 మీటర్ల టీమ్ ఈవెంట్ లోనూ సంజీవ్ రాజ్పుత్, రవి కుమార్ తో కలిసి బింద్రా కాంస్యం దక్కించుకున్నాడు. ప్రొఫెషనల్ షూటర్‌గా ఇదే తన చివరి రోజు అని బింద్రా సోమవారం ప్రకటించాడు.