Narayana murty
-
రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి.. ఎందుకంటే.. : ఇన్ఫోసిస్ మూర్తి
భారత యువత వారానికి 78 గంటలు పనిచేయాలనే వ్యాఖ్యలు చేసి ఇటీవల ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వార్తాల్లో నిలిచారు. దీనిపై పలువులు ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులకు ఏటా రూ.లక్ష అమెరికా డాలర్లు(రూ.83లక్షలు) చెల్లించాలని మూర్తి అన్నారు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దేశంలోని ఉపాధ్యాయులు, పరిశోధకులను గౌరవించాలి. వారికి మెరుగైన జీతాలు చెల్లించాలి. అన్ని సౌకర్యాలు అందించాలి. ఐటీ ఎక్స్పర్ట్, ఉపాధ్యాయులు, పరిశోధకుల సహాయంతో దేశం వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రతిదేశం పురోగతికి నాలుగు దశలుంటాయి. మొదటి దశలో దేశంలోని పౌరులు ఎలాంటి ఆవిష్కరణలు చేయరు. కొత్తగా ఏమీ ఆలోచించరు. రెండో దశలో, ఇతర దేశాల ఆవిష్కరణల సహాయంతో ఉత్పత్తులు, సేవలను ప్రారంభిస్తారు. మూడో దశలో, ఒక దేశం ఇతర అభివృద్ధి చెందిన దేశాలవలె ఉన్నత విద్య, పరిశోధనలతో మెరుగైన నాణ్యత, ఉత్పాదకత కోసం ఖర్చు చేస్తారు. దాని ఫలితాలు పొందుతారు. ఇక నాలుగో దశలో ఏ దేశంపై ఆధారపడకుండా స్వతంత్రంగా తమ అవసరాలకు తగ్గట్టు ఆవిష్కరణలు చేస్తారు. ఇతర దేశాల అవసరాలు సైతం తీరుస్తారు. దాంతో దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకోసం విద్య, పరిశోధనలు ఎంతో అవసరం. దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కాలుష్య నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, స్వచ్ఛమైన నీటిని అందించడంలో మొదటి దశలోనే ఉన్నాయి. పేదప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రతి మారుమూల ప్రాంతం నాలుగో దశకు చేరాలని కోరుకుంటున్నాను’అని ఆయన తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను జాతీయ విద్యా విధానంలో భాగం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మూర్తి అభిప్రాయపడ్డారు. ‘దేశంలో, ప్రపంచవ్యాప్తంగా STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్)రంగంలో నిష్ణాతులైన 10వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులను నియమించాలి. వారితో సుమారు 2500 "ట్రైన్ ది టీచర్" కాలేజీలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలి. అందుకోసం వారికి ఏటా లక్ష అమెరికా డాలర్లు(రూ.83లక్షలు) చెల్లించాలి. ఏటా వీరికి రూ.8300కోట్లు, ఇరవై సంవత్సరాలకు రూ.1.66లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. త్వరలో దేశం రూ.415లక్షల కోట్ల జీడీపీ లక్ష్యంగా ఎదుగుతుంది. ఉపాధ్యాయులకు చెల్లించేది దేశానికి పెద్ద ఆర్థిక భారం కావపోవచ్చు’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: చిన్నతనంలో అక్కడే మేం విడిపోయాం: ఆనంద్ మహీంద్రా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఇండియా 2020 విధానాన్ని 29 జులై 2020న ప్రవేశపెట్టారు. 2030 వరకు దేశం సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. -
మన దేశంలో స్వేచ్ఛ వాణిజ్యం సాధ్యం కాదు : నారాయణ మూర్తి
-
‘మా కంపెనీలో అటెండర్ షేర్ల విలువ రూ.15 కోట్లు’
30 Years Of Economic Reforms.. సాక్షి, వెబ్‌డెస్క్: అనుమతులు, ఆంక్షలు, రెడ్ టేపిజంల మధ్య కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చి జులై 24తో 30 ఏళ్లు పూర్తవుతున్నాయి. పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల ద్వయం అమల్లోకి తెచ్చిన ఈ సంస్కరణల ఫలితాలు అందిపుచ్చుకుని ఎదిగిన సంస్థల్లో మేటీగా నిలిచిన వాటిలో ఇన్ఫోసిస్ కూడా ఉంది. ఆర్థిక సంస్కరణలకు ముందు, ఆ తర్వాత దేశంలో పరిస్థితి ఎలా ఉండేది, ఇన్ఫోసిస్ ఎదుగుదల గురించిన వివరాలను ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి జాతీయ మీడియాకు తెలిపారు. ఆ విశేషాలు మీ కోసం... కలలు నిజమయ్యాయి 1991 జులై 21న పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాతే మేము కన్న కలలన్నీ నిజం అయ్యాయి. నా దృష్టిలో ఎంటర్ప్రెన్యూర్ అంటే తనకు వచ్చిన ఐడియా ఎండ్ యూజర్‌కి ఉపయోగకరంగా ఉండాలి, కొత్త ఉద్యోగాలు సృష్టించగలగాలి, ఇన్వెస్టర్లకు లాభాలను అందివ్వాలి, పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచాలి. అయితే ఆర్థిక సంస్కరణలకు ముందు ఇవన్నీ జరిగేందుకు ప్రతీ చోట అనుమతులు అనే అడ్డంకులు ఉండేవి. కానీ ఆర్థిక సంస్కరణలు ఈ పరిస్థితిని మార్చేశాయి. ఎంటర్ప్రెన్యూర్లు తాము కన్న కలలను నిజం చేసుకోవడానికి సులువైన దోవ దొరికింది. అంతకు ముందు కంప్యూటర్లు కొనడమనేది ఎంతో కష్టమైన వ్యవహారంగా ఉండేది. కంప్యూటర్లు కొనాలంటే 1981 జులైలో ఇన్ఫోసిస్ కంపెనీ స్థాపించిన కొత్తలో ఐబీఎం 4342 కంప్యూటర్లు కొనేందుకు మూడేళ్లలో 50 సార్లు ఢిల్లీకి వెళ్లి అధికారులతో మాట్లాడాల్సి వచ్చింది. ఎంతో కష్టపడితే కానీ కంప్యూటర్లు వచ్చేవి కాదు. ఇలా మేము ఎదురు చూపుల్లో ఉంటుండగా.. మరోవైపు టెక్నాలజీకి సంబంధించి ప్రతీ ఆరు నెలలకు అమెరికాలో మార్పులు వచ్చేవి. ప్రతీ ఆరు నెలలకు కొత్త కంప్యూటర్లు అక్కడ మార్కెట్లోకి వచ్చేవి. పైగా పాత కంప్యూటర్‌తో పోల్చితే యాభై శాతం మెరుగైన పనితీరు, 30 శాతం తక్కువ ధరతో కొత్త కంప్యూటర్లు వచ్చేవి. దీంతో మళ్లీ ఆర్డర్లలో మార్పులు చేయాల్సి వచ్చేది. వాటికి త్వరగా అనుమతులు సాధించడం మరో ప్రహసనంగా ఉండేది. ఒక్క కంప్యూటరనే కాదు ఆఖరికి టెలిఫోన్ పొందాలన్నా కష్టమే. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు, లేదా రిటైర్డ్ అధికారుల ఇళ్లకే కనెక్షన్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. నిధుల సమస్య ఆరోజుల్లో టెలిఫోన్ కనెక్షన్, కంప్యూటర్లు కొనేందుకే ఇబ్బంది పడే మాకు నిధుల సేకరణ పెద్ద సమస్యగా ఉండేది. ఇక బ్యాంకులకు సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఎక్స్‌పోర్ట్స్ గురించి ఎంత చెప్పినా అర్థం అయ్యేది కాదు, పెట్టుబడిదారులు మా వైపు చూసేవారు కాదు. ఇలా కంపెనీ స్థాపించిన తర్వాత పదేళ్ల పాటు బాలారిష్టాలనే ఎదుర్కొన్నాం. ఆ సమయంలోనే మా కంపెనినీ రూ. 2 కోట్లకు కొంటామంటూ ఆఫర్ వచ్చింది. ఫౌండర్లలో కొందరు అమ్మేద్దామనుకున్నారు కూడా. కానీ ఈ రోజు కంపెనీ విలువ 6.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఎదుగుదలకు ఆర్థిక సంస్కరణలు ఎంతగానో తోడయ్యాయి. ఐపీవోకి 1991లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వేగం పెరిగింది. అనుమతుల కోసం వేచి చూసే సమయం తగ్గింది. విదేశాల నుంచి ఎదైనా తెప్పించుకోవడం తేలికైంది. ఈ సంస్కరణలు ఇచ్చిన ధైర్యంతో 1992 డిసెంబరులో ఇన్ఫోసిస్ స్థాపించిన పదేళ్లకు స్టాక్ మార్కెట్‌కి వచ్చాం. నందన్ నీలేకని, బీ బాలకృష్ణన్, వీఆర్ నాయక్‌లు కంపెనీ టార్గెట్, రిస్క్‌లను వివరిస్తూ మంచి ప్రొజెక్షన్ ఇచ్చారు. అదే సమయంలో ఇనామ్ వ్యవస్థాపకులు వల్లభ్ బన్సాలీ, నేమీష్ షాలు సహకారం అందించారు. స్టాక్ మార్కెట్‌కి రక్షణగా 1992లోనే సెబీ కూడా ఏర్పాటైంది. దీంతో ఇన్ఫోసిస్‌కు నిధుల సమస్య క్రమంగా దూరమైంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగాం. షేర్ వాల్యూ అత్యంత కింది స్థాయి ఉద్యోగి సంక్షేమం, అభివృద్ధి లక్క్ష్యంగా కంపెనీ పనితీరు ఉండాలని మహ్మాత్మా గాంధీ చెప్పిన మాటల స్ఫూర్తితో 1994, 1998లో ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ)ని అమలు చేశాం. మంచి ప్రతిభ కనబరిచిన ప్రతీ ఉద్యోగికి అటెండర్, ప్యూన్ నుంచి డైరెక్టర్ల వరకు షేర్లు కేటాయించాం. ఈ షేర్టు అట్టి పెట్టుకున్న చాలా మంది అటెండర్లు, ఫ్యూన్లు కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందారు. 1994, 1998 ప్లాన్‌లో లేని ఎంప్లాయిస్ కోసం కనీసం పది షేర్ల వంతున 2008లో కేటాయించాం. ఇప్పుడు ఆ షేర్ల విలువల 1.30 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడా ఉద్యోగులు ఆదాయపు పన్ను కడుతున్నారు, చూడచక్కని ఇళ్లు కట్టకున్నారు, మంచి కార్లలలో తిరుగుతున్నారు. సెలవుల్లో కుటుంబాలతో కలిసి విదేశీ ప్రయాణాలకు వెళ్తున్నారు. ఈ మార్పు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఆర్థిక సంస్కరణలు అమలు జరిగి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. విలువలతో.. దేశ బంగారు భవిష్యత్తు కొత్తతరం ఎంట్రప్యూనర్లపైనే ఆధారపడి ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పోటీ తత్వంతో పాటు విలువలు పాటించే లక్షణం కూడా ఉండాలి. పవర్ బై ఇంటెలెక్ట్ డ్రైవెన్ బై వాల్యూస్ అనేది ముఖ్యం. అదే విధంగా మన దగ్గర జనాభా ఎక్కువ. కానీ ఇందులో నైపుణ్యం కలిగిన వారు చాలా తక్కువ. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ ప్రపంచ అనుసంధాన భాష, ఇంకా మాట్లాడితే ఇంగ్లీష్ ఇప్పుడు ఇండియా భాష. ఆ భాషపై పట్టు పెంచుకోవాలి. అదే విధంగా నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చెప్పే విధంగా మన దగ్గర బోధన జరగడం లేదు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేలా విద్యావిధానంలో మార్పు రావాలి. ఉద్యోగాలు సృష్టించే స్టేట్స్, ఎగుమతులు పెంచే స్టేట్స్‌కి ప్రత్యేక ప్రోత్సహాకాలు అందివ్వాలి అప్పుడు మన సమాజం మరింతగా ముందుకు వెళ్తుంది. -
‘ఏఐ’తో ఐటీ ఉద్యోగాలకు ముప్పేమీ లేదు...
ముంబై: ఐటీ రంగంలో జీతాల తేటెతుట్టెను ఇన్ఫీ నారాయయణ మూర్తి మరోసారి కదిపారు. సాఫ్ట్వేర్ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్న ఇలాంటి సమయంలో మేనేజ్మెంట్ స్థాయిలోని సీనియర్ ఉద్యోగులు తమ వేతనాలను భారీగా పెంచుకోవడం ఆమోదయోగ్యం కాదని మూర్తి పేర్కొన్నారు. ఐఐటీ–బాంబేలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థపై(క్యాపిటలిజం) సామాన్యులకు నమ్మకాన్ని పెంపొందించాలంటే... సీనియర్లు తమ జీతాల విషయంలో త్యాగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), యాంత్రీకరణ(ఆటోమేషన్) కారణంగా పరిశ్రమలో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలను తోసిపుచ్చారు. ఐటీనే తీసుకుంటే... వాస్తవాలను పక్కనబెట్టి వీటిని మరీ అతిగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ‘జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచకపోవడం ఆందోళనకలిగిస్తోంది. మరోపక్క, సీనియర్ల జీతాలు భారీగా పెరుగుతుండటం శ్రేయస్కరం కాదు. ఇలాంటి ధోరణులతో పెట్టుబడిదారీ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించలేం. దేశంలో కోట్లాదిమంది ప్రజలు పేదరికంలో ఉన్నారని మరవొద్దు’ అని మూర్తి పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్సిక్కా, ఇతరత్రా కొందరు సీనియర్లకు భారీ వేతన ప్యాకేజీల విషయంలో మూర్తి గతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం.. సిక్కా వైదొలగడం తెలిసిందే. ఐటీలో సమస్యలు తాత్కాలికమే...: ప్రస్తుతం ఐటీ రంగం కష్టకాలంలో ఉందని మూర్తి అంగీకరించారు. అయితే, కొన్నేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు నెలకొనడం(సైక్లికల్) సాధారణమేనని.. పరిశ్రమ మళ్లీ గాడిలోపడుతుందని అభిప్రాయపడ్డారు. ‘అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన కంపెనీలు మన ఐటీ రంగానికి ప్రధానమైన క్లయింట్లుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు మళ్లీ కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందు ఇప్పటివరకూ వెచ్చించినదానిపై ప్రయోజనాల కోసం వేచిచూస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఐటీ పరిశ్రమ మందగమనాన్ని చవిచూడాల్సి వస్తోంది’ అని పేర్కొన్నారు. -
అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది.
వారి లోకం ఆకలిరాజ్యం. చిరునామా అభ్యుదయుం. చరిత్ర పుటల్లో విప్లవశంఖాల్లా విరుచుకుపడిన శ్రామికులు.. ఇప్పుడు చతికిల పడుతున్నారు. పిడికిళ్లు బిగించడం మాత్రమే తెలిసిన కామ్రేడ్లు.. కష్టం ఇదని ఎలుగెత్తి నినదించలేకపోతున్నారు. గుండెలు మండించే బాధలు ఎన్నున్నా.. కండలు కరిగించడంలో వీరిది ముందడుగే. ఆర్థికంగా గరీబులైనా.. ఆత్మాభిమానంలో కుబేరులే. అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది. హక్కులు పొందలేక దిక్కులు చూస్తోంది. పదండి ముందుకు పదండి తోసుకు అని మహాకవులు ఘోషించి దశాబ్దాలు దాటినా.. ఈ శ్రామికుల వేదన తీరడం లేదు. జగన్నాథ రథ చక్రాలు ఎన్ని వెళ్లినా.. వీరి బతుకులు బాగుపడిందీ లేదు. పచ్చడి మెతుకుల కోసం.. తలకు మించిన భారాన్ని భుజానికెత్తుకుంటూ బతుకుపోరు సాగిస్తున్న హమాలీ కార్మికులను స్టార్ రిపోర్టర్ రూపంలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పలకరించారు. హక్కుల కోసం పోరుతప్పదంటూ.. వారి అంతరంగాన్ని మన ముందుంచారు. రైతు అన్నం పెడతాడు. కార్మికుడు కష్టపడతాడు. వీరిద్దరి ఉసురు తగిలితే దేశానికి భవిష్యత్తు ఉండదు. కార్మికుడ్ని, కర్షకుడ్ని ఏ జాతి అరుుతే పూజిస్తుందో.. ఆ దేశం బాగుపడుతుంది. కార్మికుడు వీధిన పడితే పోయేది ప్రభుత్వం పరువే. నా విజ్ఞప్తి ఒక్కటే.. దేశంలో కార్మికుల ఆకలి కేకలు ఉండకూడదు. ఆర్. నారాయణమూర్తి: పట్టుర.. పట్టు హైలెస్సా..ఉడుంపట్టు హైలెస్సా.. పట్టుర పట్టు ఉడుంపట్టు హైలెస్సా.. పట్టకపోతే పొట్టే గడవదు హైలెస్సా.... వెంకన్న: మేం పనిచేసేటప్పుడు గీ పాట చెవిల పడినా.. మా నోట పలికినా మస్తు హుషారొస్తది సార్. ఆర్. నారాయణమూర్తి: అంతే కదా మరి.. హమాలీ కార్మికులు.. బరువులు భుజానికి ఎత్తకపోతే పొట్టకు ఉండదు కదా బ్రదర్. కె.రాములు: ఎత్తాలే సార్.. ఎంత బరువైనా ఎత్తాలి. అవసరమైతే ఇరవై గంటలైనా కూసోకుండ పని చేయాలి. పని లేకపోతే పస్తులే కదా. ఆర్. నారాయణమూర్తి: అసంఘటిత కార్మికుడి పరిస్థితి ఇలా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ప్రతి శ్రామికుడూ.. కార్మికుడే. సంఘటిత, అసంఘటిత పేరుతో మీపై సవతి ప్రేవు చూపకూడదు. దేశంలో పనిచేసే ఏ కార్మికుడికైనా తిండి, బట్ట, విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నా వంతు పోరాటం చేస్తున్నా.. మీరు ఇంకా పోరాడాలి. బి. రాములు: మా కష్టాలు, మా బతుకులను మీరు తీసిన సినిమాలలో చూపించి చాలా మందిని చైతన్య పరిచిండ్రు సార్. దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంత పోరాటం చేస్తే ఏంది సార్. మా బతుకు మాత్రం ఎక్కడ ఏసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఎమ్. నర్సింహ: ఒకటి రెండు కాదు.. హైదరాబాద్ సిటీల మా హమాలీ కార్మికులు లక్షా పది వేల మంది ఉన్నరు సార్. ఏ ఒక్కరికి కష్టమొచ్చినా మేం మేమే తలో చెయ్యి వేసుకుంటం కానీ, ప్రభుత్వం నుంచి గానీ, కంపెనీ యజమానుల నుంచి చిల్లి గవ్వ రాదు. ఆర్. నారాయణమూర్తి: అంటే మీరు పని చేస్తుండగా ఏదైనా ప్రమాదం జరిగితే.. యజమాని బాధ్యత తీసుకోడు.. ప్రభుత్వవుూ పట్టించుకోదు...మరి ఎలా కామ్రేడ్? కె. కిష్టయ్య: ఏం చేస్తం సార్. మొన్నామధ్య ఒకాయన రేకులు ఎత్తుతుంటే.. అతని చేతిమీద బరువైన రేకు పడి చెయ్యి కట్ అయ్యింది. మేమే ఆస్పత్రికి తోల్కవోయి.. తలా ఇన్ని పైసలేస్కొని వైద్యం చేరుుంచినం. లక్ష రూపాయులైంది. షాపాయున ను అడిగితే నాకేం సంబంధం అన్నడు. లారీ ఓనర్దీ అదే వూట. ఆర్. నారాయణమూర్తి: కూరగాయులు, బట్టలు, ఇనుప వస్తువులు, స్టీలు సామాన్లు, మోటార్లు, బస్తాలు ఒకటేమిటి.. ఏది వూర్కెట్లోకి రావాలన్నా.. మీరు భుజానికెత్తాల్సిందే. మీ పని చాలా గొప్పది, వుుఖ్యమైనది. వురి మీకు గుర్తింపు కార్డులున్నాయూ ? సంగయ్య: నేను 20 ఏళ్ల నుంచి ఒకటే కంపెనీల పని చేస్తున్న సార్. ఇప్పటికీ గుర్తింపు కార్డు లేదు. ఏందంటే...హమాలోళ్లకి ఐడెంటిటీ ఎవరిస్తర్రా అంటరు. ఆఫీస్ బాయ్‌లకు కూడా కార్డులుంటరుు. వూకు వూత్రం ఇవ్వరు. ఆర్. నారాయణమూర్తి: మీరంతా ఎక్కడ పని చేస్తున్నారు? ఉండేదెక్కడ? మధు: రాణిగంజ్ దగ్గర పని చేస్తం. అక్కడ మోటార్లు, పెద్ద పెద్ద మిషన్లను లారీలకు ఎక్కిస్తం. మా ప్రాంతంలో 400 మంది హమాలీ కార్మికులు ఉన్నారు. ఇక మేము ఉండేదంటారా.. ఒకరు ఉప్పల్‌లో, ఒకరు నాచారంలో, ఒకరు బోయిన్‌పల్లిలో.. నగరంలో నాలుగు దిక్కుల నుంచి వస్తుంటం. ఆర్. నారాయణమూర్తి: పెట్రోలు, ఇతర ఖర్చులు బాగా పెరిగిపోయాయి.. ఖర్చులెట్లా తట్టుకుంటున్నారు బ్రదర్. కె. కొమరయ్య: పెట్రోలుకు మాకు సంబంధమేంది సార్. నూటికి తొంభై మంది సైకిళ్ల మీదనే వస్తరు. అవి తొక్కే సరికే పెయ్యి మొత్తం పుండవుతుంది. వెంకయ్య: ఇప్పుడు రేట్లు వింటుంటే గుండె బరువెక్కిపోతోంది. యూభై రూపాయూల్లేనిది బియ్యుం వస్తలేవు. ఇంటి కిరారుుకే సగం జీతం పోతుంది. పిల్లల చదువులు, వైద్యం అంటే పేదోళ్ల ఒంటి మీద కొరడా దెబ్బలే. మధు: వూ జవూనాల పదేళ్లు రాంగనె పనికి పంపేటోళ్లు. మేవుట్ల చెయ్యులేం సార్. ఎంత కష్టమైనా పిల్లల్ని చదివించాలనుకుంటున్నం. ఆర్. నారాయణమూర్తి: నిజం బ్రదర్. నేటి బాలలే...రేపటి పౌరులు. పిల్లలకు అక్షరం నేర్పించాలి. ఈ స్వతంత్ర దేశంలో అన్నీ తానై నడించాల్సిన ప్రభుత్వం సర్వం ప్రైవేటీకరణ చేసి.. ప్రజలను రోడ్డు మీద నిలబెడుతోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, చివరికి బస్సు, రైలు అన్నింటినీ ప్రైవే ట్ పరం చేసి చోద్యం చూడాలనుకుంటోంది. ఫలితం.. పేదవాడి ఆకలి కేకలు. బి. రాములు: అంతే కదా సార్. ఎన్నికల ముందు మాత్రం మా దగ్గరకొచ్చి మీకు గుర్తింపు కార్డులిస్తం, మీకు ఈఎస్ఐ కార్డులిస్తమంటూ ఓట్లడుగుతరు. ఆర్. నారాయణమూర్తి: మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయుకుల దగ్గరికి వెళ్లి మీ సమస్యల గురించి చెప్పారా? శ్రీశైలం: ఏడ సార్.. పోలేదు. ఆర్. నారాయణమూర్తి: వెళ్లి అడగాలి కదా. అవసరమైతే పోరాడాలి. మీ హక్కుల కోసం మీరు పోరాడకపోతే ఇంకెవరు ముందుకొస్తారు. సంఘటిత కార్మికుడికి మీరేం తీసిపోరు. మీరు చేసే కష్టం ప్రజల కోసమే.. వాళ్లు చేసేది ప్రజల కోసమే. ఎన్. భాస్కర్‌రెడ్డి: మేం ఎక్కువ కోరికలు ఏమీ కోరడం లేదు సార్. మాకు గుర్తింపు కార్డులివ్వాలి. కనీసం వైద్య సదుపాయం కల్పించాలి. సొంతిల్లు ఇవ్వకపోయినా కనీసం అద్దె కట్టుకునే స్తోమత కల్పించాలి. ఆర్. నారాయణమూర్తి: పని లేని రోజున మీ పరిస్థితి ఏంటి? బి. రాములు: వూలో కొందరి ఇంటోళ్లు పూలు, కూరగాయులు అవుు్మతరు. నాలుగు ఇళ్లలో పని చేసి ఇంత సంపాదిస్తున్నరు. అందుకే పని లేని రోజు.. నాలుగు పచ్చడి మెతుకులైనా పుడుతున్నరుు. ఎమ్. నర్సింహ: సిటీల మా సంపాదనతో ఇల్లు నడపడం కష్టమనుకున్నోళ్లు భార్యాబిడ్డల్ని ఊళ్లనే ఉంచి ఇక్కడ ఒక్కరే పని చేసుకుంటున్నారు. మధు: సార్.. మీరు తీసే సినిమాలు మమ్మల్ని చానా ఆలోచింపజేసినయి. అప్పుడు మాత్రం మా పని మీద వూకు గౌరవం కలుగుతుంది. హక్కుల కోసం పోరుసాగిస్తాం సార్.. ఆర్. నారాయణమూర్తి: ఒకే.. లాల్‌సలాం!