Star Reporter
-
స్టార్ రిపోర్టర్ - అనంతశ్రీరామ్
-
స్టార్ రిపోర్టర్ అనంత శ్రీరాం
టీవీలో ఇంట్రెస్టింగ్ సీరియల్ వస్తున్నసమయంలో కరెంట్ పోతే.. ‘ఈ కరెంటోళ్ల కడుపుకాలా...’ అని తిట్టుకుంటాం. మెగా క్రికెట్ సీజన్ మొదలైంది. ఆట మధ్యలో టీవీ ఆఫ్ అయ్యిందా.. కరెంటు వారిని నోటికొచ్చినట్టు తిట్టుకుంటాం. మన తిట్లు విద్యుత్‌శాఖ అధికారులకు తగులుతున్నాయో లేదో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలూ కరెంట్ స్తంభాలపై పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపాలిట శాపాలుగా మారుతున్నాయి. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని విద్యుత్ తీగలను పట్టుకునే ఈ కార్మికులను సాక్షి సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా పలకరిస్తున్నందుకు హ్యాపీగా ఉందంటూ సినీగేయ రచయిత అనంతశ్రీరాం తన ఇంటర్వ్యూ మొదలుపెట్టారు.. అనంతశ్రీరాం: భయ్యా నీ పేరేంటి? నీ చేయి ఒకటి లేదు.. ఏం జరిగింది..? నా పేరు బాలస్వామి సార్. 13 ఏళ్ల కిందట ఈ పనిలోకి వచ్చాను. 2009లో కరెంట్ షాక్ తగిలి ఇదిగో ఇలా వికలాంగుడిని అయ్యాను. అనంతశ్రీరాం: ప్రమాదం ఎలా జరిగింది..? బాలస్వామి: నర్సాపల్లిలో జరిగింది. ఓ రోజు రాత్రి 11 గంటలకు కరెంట్ పోయిందని కంప్లైంట్ వచ్చింది. సింగిల్ ఫేజ్ లైనది. జంపర్ మారిస్తే సరిపోతుంది. ఆ పనిలో ఉండగా, ఒక్కసారిగా షాక్ కొట్టింది. చేయి పూర్తిగా మాడిపోయింది. కిందపడిపోయి స్పృహ కోల్పోయాను. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కడుపు మీద కూడా గాయమైంది. షాక్ తీవ్రతకు పొట్టలోపలి పేగులు కూడా పాడైపోయాయి. కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. అనంతశ్రీరాం: మీకు ఇన్సూరెన్స్, ఉచిత వైద్యం వంటివి ఏమీ ఉండవా..? బాలస్వామి: ఏమీ ఉండవు సార్. నెల నెల ఇన్సూరెన్స్ కోసమని జీతంలో కొంత కట్ చేస్తారు. కౌష్: మా జీతాలు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకూ ఉంటాయి. అందులో పీఎఫ్, ఇన్సూరెన్స్ పేరుతో వెయ్యో, పదిహేను వందలో కట్ చేస్తారు. కానీ ఆపద వచ్చినప్పుడు మాత్రం ఏ సాయమూ అందదు. రాములు: కొందరు కాంట్రాక్టర్లు మా జీతాల్లో డబ్బులు కట్ చేస్తున్నారు. కానీ, మా పేరిట ఎలాంటి ఇన్సూరెన్స్ కట్టడం లేదు. అదేంటని గట్టిగా అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. అనంతశ్రీరాం: ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారా..? బాలస్వామి: కొందరు అధికారులదీ ఇదే తంతు సార్. వాళ్లు కూడా కాంట్రాక్టర్లకే వత్తాసు పలుకుతారు. అనంతశ్రీరాం: మీక్కూడా గాయాలయినట్టున్నాయి. పొట్టంతా కాలిపోయింది. కౌష్: ఓ రోజు భారీ వర్షం. ఇరవై, ముప్పై కంప్లయింట్స్ వ చ్చాయి. కరెంట్ సప్లయ్ ఆపేసి స్తంభం ఎక్కాను. రిపేర్ చేస్తుంటే ఏం జరిగిందో తెలియదు.. రెండు రోజుల తర్వాత కళ్లు తెరిచి చూసే సరికి కేర్ ఆస్పత్రిలో బెడ్ మీద పడున్నాను. వైరు నేరుగా పొట్టకు తగలడంతో బాగా కాలిపోయింది. ఆ గాయాల నొప్పి భరించలేక ఆస్పత్రిలో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నన్ను బెడ్‌కు కట్టేసి వైద్యం అందించారు. ఆ దెబ్బతో ఉద్యోగం పోయింది. మళ్లీ ఇప్పుడు ఇదే పని చేస్తున్నాను. అనంతశ్రీరాం: ఇలాంటి వృత్తినే ఎందుకు ఎంచుకున్నారు? రవి: ఎందుకంటే మేమేమన్నా డిగ్రీలు చే శామా సార్ ? ఏదో ఈ పని నేర్చుకున్నం. పేదోడికి దొరికిందే పని అనుకున్నం. అనంతశ్రీరాం: అసలు మీ పని గంటలు ఎలా ఉంటాయి? ఖాదర్: 24 గంటలూ ఆన్ డ్యూటీయే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరుగెత్తాలి. రాత్రి పూట కరెంట్ పోతే మీరు క్యాండిల్ వెలిగించుకుంటారు. మేం మాత్రం ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఎదురు చూస్తం. ఫోన్‌రాగానే ఆ ఏరియాకు వె ళ్లిపోతాం. మల్లేష్: మేం అక్కడికి చేరుకునే లోపే.. ఫోన్ల మీద ఫోన్లు చేస్తరు. ఇంత లేటేందని తిడుతుంటరు. ఒక్కోసారి కొట్టడానికి మీదికి వస్తరు. అనంతశ్రీరాం: అది చాలా తప్పు. చేసే పని ఆగిపోయిందనో, చూసే సినిమా మిస్ అయిందనో మనమంతా కరెంట్ వాళ్లను తిట్టుకుంటాం. వారి పరిస్థితి ఇలా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మీరు త్వరగా స్పందిస్తారని మెచ్చుకుంటారు. ఇంకొన్ని ఏరియాల్లో ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించరని అంటుంటారు. వెంకటేష్: ఏముంది సార్. వీఐపీ ఏరియాల్లో కంప్లయింట్ వచ్చిన పది నిమిషాల్లో పనైపోతుంది. మామూలు ఏరియాల్లో కాస్త టైం పడుతుంది. అనంతశ్రీరాం: అన్ని ప్రాంతాల్లో ఒకేలా పని చేయాలి కదా..! వెంకటేష్: కార్మికుల సంఖ్య పెంచాలి సార్. కాంట్రాక్టర్లు డబ్బుల కోసం ఒక్కరితో నలుగురి పని చేయించుకుంటున్నారు. అనంతశ్రీరాం: మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? వీరస్వామి: మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్. అనంతశ్రీరాం: ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? బాలస్వామి: దీనిపై ఏళ్లుగా పోరాడుతున్నాం. అధికారులను కలవని రోజు లేదు. నాగరాజు: సార్ నేను తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్ల అధ్యక్షుణ్ని. అన్ని రకాల వృత్తుల వారూ సమ్మెలకు దిగుతారు. మేం అలా చేస్తే ఎవరింట్లో లైట్ వెలగదు. అందుకే ధర్నాల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తుంటాం. అనంతశ్రీరాం: అమ్మా మీ గురించి చెప్పండి? సుగుణ: నా భర్త పేరు గోపాల్‌రెడ్డి. కాంట్రాక్ట కార్మికునిగా పని చేసేవాడు. కరెంట్ వైర్లే మా వారి పాలిట చితిగా మారాయి. షాక్ తగిలి పోల్ మీదే ప్రాణాలు విడిచాడు. షాక్ తీవ్రతకు మా ఆయన శరీరం మాడిపోయింది సార్. ఆయన్ని స్తంభం నుంచి దించడానికి ఐదుగంటలు పట్టింది (కళ్ల నీళ్లతో...). అనంతశ్రీరాం: పిల్లలుఉన్నారామ్మా? సుగుణ: ఇద్దరు సార్. నేను పదో తరగతి తర్వాత ఐటీఐ ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను. ఈ శాఖలోనే ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వమని అడిగితే ఎవరూ కనికరించలేదు. స్వీపర్‌గా పని చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటున్నాను. ఆయన పోయి పదేళ్లవుతుంది. అనంతశ్రీరాం: అయ్యో ! చెప్పండి మీరంతా ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి ఆశిస్తున్నది ఏంటి? రాములు: మా కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్. మమ్మల్ని కూడా ఉద్యోగులుగా గుర్తించాలి. కౌష్: పొద్దున ఇంటి నుంచి బయల్దేరేటప్పుడు భార్యపిల్లల్ని క ళ్లారా చూసుకుంటాం. మళ్లీ సాయంత్రం వారిని చూస్తామో లేదో తెలియని బతుకులు సార్ మావి. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. అనంతశ్రీరాం: మా ఇంట్లో వెలుగులు నింపే మీ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ లైఫ్. లైన్మెన్ లైన్స్ విద్యుత్‌ని అడిగావు - విజ్ఞతను మరిచావు వెలుగుల్ని అడిగావు - మా వ్యథలను విస్మరించావు నువ్వు ప్రజవైతేనేమీ నువ్వు ప్రభుతవైతేనేమీ ఎవరివైతే నాకేమీ.. నాకూ ప్రాణముందని గుర్తించు నన్ను కూడా ప్రాణప్రదంగా భావించు - అనంతశ్రీరాం ప్రజెంటేషన్: భువనేశ్వరి -
స్టార్ రిపోర్టర్ -శివారెడ్డి
-
స్టార్ రిపోర్టర్ - దర్శకుడు మారుతి
-
స్టార్ రిపోర్టర్ - సుమన్
-
స్టార్ రిపోర్టర్ - పరుచూరి గోపాలకృష్ణ
-
స్టార్ రిపోర్టర్ : సాయిరామ్ శంకర్
-
స్టార్ రిపోర్టర్ : జోగీ బ్రదర్స్
-
తాపీ లేని మేస్త్రీ
-
తాపీ లేని మేస్త్రీ
స్టార్ రిపోర్టర్ - చంద్రబోస్ పిడికిళ్లు బిగించి పలుగు, పార పట్టుకున్నా.. వారి చేతి గీత మారింది లేదు. చెమట నీరు చిందించి చలువరాతి మేడను కట్టినా.. వారి నుదుటి రాత బాగుపడ్డదీ లేదు. యజమానికి నచ్చినట్టుగా.. పది మందీ మెచ్చేటట్టుగా ఇళ్లు కట్టే భవన నిర్మాణ కూలీలు భారంగా బతుకీడుస్తున్నారు. పనులన్న రోజుల్లో మస్తుగా ఉండటం.. లేకుంటే పస్తులుండటం వాళ్లకు మామూలే. సిమెంట్, ఇసుక, నీళ్లు సమపాళ్లలో కలిపి ఇంటికి దృఢత్వం తీసుకువచ్చే వీరికి మాత్రం కష్టాల పాళ్లే ఎక్కువ. తాపీతో మెరిసిపోయే ఫినిషింగ్ ఇచ్చే ఈ మేస్త్రీల జీవితాలు మాత్రం తాపీగా సాగడం లేదు.ఈ కష్టజీవులను సాక్షి సిటీప్లస్ తరఫున సినీగీత రచయిత చంద్రబోస్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. చంద్రబోస్: ‘ఈ పేటకు నేనే మేస్త్రీ.. నిరుపేదల పాలిట పెన్నిధి..’ పాట మీరు వినే ఉంటారు. మేస్త్రీ అనే పదం చాలా బలమైనది. ఎంతో బాధ్యత కలది. మీకు గూడు లేకపోయినా మాకు ఇల్లు నిర్మించి ఇస్తారు. మిమ్మల్ని పలకరించడం ఆనందంగా ఉంది. వెంకటేష్: మాక్కూడ చాలా ఆనందంగా ఉంది సార్. చంద్రబోస్: చెప్పు వెంకటేష్ ఎన్నాళ్లయింది ఈ వృత్తిలోకి వచ్చి ? వెంకటేష్: 30 ఏళ్లవుతుంది సార్. చంద్రబోస్: అమ్మో..! ఎంత సంపాదించావ్..? వెంకటేష్: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ప్రస్తుతం దారుణంగా ఉంది సార్. ఆర్నెళ్ల నుంచి రియల్ఎస్టేట్ పడిపోయింది. కట్టే బిల్డింగులు కూడా ఆపేశారు. చేతికి పనిలేదు.. నోటికి బువ్వ లేదు. చంద్రబోస్: అవును కన్స్‌స్ట్రక్షన్ ఫీల్డ్ కొంత డల్ అయినట్టు నేనూ గమనించాను. రాజు: అందుకే.. మీరు ఇంటర్వ్యూ చేస్తారనంగనే.. ఐదుగురిని పిలిస్తే యాభైమంది వచ్చిండ్రు. అందరూ ఖాళీగా రోడ్లెంట తిరుగుతుండ్రు. చంద్రబోస్: ఓకే భయ్యా.. అప్పటికీ, ఇప్పటికీ మేస్త్రిల్లో వచ్చిన తేడా ఏంటి? రాజు: తేడా మాలో రాలేదు సార్. యజమానుల్లో వచ్చింది. ఒకప్పుడు మేస్త్రీ్తక్రి బోలెడంత విలువ ఉండేది. నిర్మాణాలకు తరతరాలుగా ఒకే మేస్త్రి కుటుంబాన్ని పిలిచేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మమ్మల్ని కూడా మిషన్లను చూసినట్టు చూస్తున్నారు. చంద్రబోస్: ఈ వృత్తిలోనే కాదు.. అన్ని రంగాల్లో అనుబంధాలు తగ్గాయి. సరే.. మీ సంపాదన ఎలా ఉంటుంది? మన్నెంకొండ: మగవారికి రోజుకు రూ.450, ఆడవాళ్లకు రూ.250 ఇస్తారు. వారంలో నాలుగైదు రోజులకంటే ఎక్కువ పని చేయలేం. నెలలో అన్ని రోజులు పని ఉంటుందని గ్యారెంటీ లేదు. అప్పుల తిప్పలు తప్పవు సార్. చంద్రబోస్: మీ పనికి శరీరం బాగా అలసిపోతుంది. ఆ బడలిక తీర్చుకోవడానికి మీరు మందు, గుట్కాలను ఆశ్రయిస్తారని విన్నాను. నిజమేనా..? శ్రీనివాస్: అందరూ అలా ఉండరు. కానీ బాగా కష్టమైనపుడు ఒక చుక్క వేయక తప్పదు సార్. చంద్రబోస్: అందరూ పిల్లల్ని చదివిస్తున్నారా? వెంకటేష్: ఎక్కడ చదువులు సార్. పనులు బాగున్నప్పుడు మంచి స్కూళ్లల్లో చేర్పించాం. ఇప్పుడు పనుల్లేవు, డబ్బు లేదు. అలాగే స్కూల్లో ఫీజులడగడం మానరు కదా! ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. మావోళ్లు చాలామంది పిల్లల్ని స్కూల్‌కు పంపడం ఆపేశారు. చంద్రబోస్: అయ్యో...అంత పని చేయకండి. మీరు ఇంత పని చేసేది మీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా! రమేష్: ఏం చేస్తాం. ఊళ్లకు తిరిగి పోదామంటే అక్కడ పంటలూ లేవు.. పనులూ లేవు. చంద్రబోస్: మీది ఏ జిల్లా? రమేష్: మహబూబ్‌నగర్. మాలో చాలామంది ఆ జిల్లా నుంచి వచ్చిన వారే ఉన్నరు. చంద్రబోస్: అవును మన రాష్ట్రంలో వలసల జిల్లా అదే. నేను చాలాసార్లు చూశాను, అడ్డంగా కట్టిన ఓ కర్రపై నిలబడి తాపి పని చేస్తుంటారు. పదుల అంతస్తుల పైన మీ పనులు చూస్తుంటే మాకే కళ్లు తిరుగుతుంటాయి. మీ పరిస్థితి ఏంటి..? వెంకటేష్: ఏం చేస్తాం. మా పనే అట్లాంటిది. చంద్రబోస్: భయం వేయాదా? మన్నెంకొండ: ఎందుకు వేయదు సార్. కాకపోతే ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి. మనసు కాస్త అటుఇటూ అయిందా.. ప్రమాదం తప్పదు. చంద్రబోస్: అంటే ధ్యానం చేస్తున్నట్టు అన్నమాట. లేకపోతే క్షణం చాలు కదా కాలు జారడానికి, పట్టు తప్పడానికి. రాజు: ఎంత జాగ్రత్తగా చేసినా ఒకోసారి ప్రమాదాలు తప్పవు సార్. దెబ్బలతో ఆగవు ప్రాణాలే పోతుంటాయి. చంద్రబోస్: మరి అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? రాజు: ఈ మధ్యనే ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో కూలీలు పని చేస్తున్నారు. ఓ 35 ఏళ్ల కుర్రాడు ఇసుక బస్తా మోస్తూ వెనక్కిపడిపోయాడు. ఆ బస్తా గుండెపై పడటంతో గుండె ఆగి చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్నపిల్లలు. మేమే తలో ఐదువందలు, వెయ్యి వేసుకుని లక్ష న్నర రూపాయలు జమ చేసి అతని కుటుంబానికి సాయం చేశాం. చంద్రబోస్: శభాష్ భయ్యా.. పనికి పోతేగానీ పొట్ట నిండని మీరు ఇంత పెద్ద మనసు చేసుకోవడం గొప్ప విషయం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండదా ? శ్రీనివాస్: ఒక్క పైసా రాదు సార్. అసలు మమ్మల్ని ప్రభుత్వం అసలు గుర్తించట్లేదు. అన్ని వృత్తుల వారికీ హెల్త్ కార్డులు, ఇళ్లు కట్టిస్తున్నారు. మాకు మాత్రం ఏం లేదు. చంద్రబోస్: అవును నేను కూడా ఎక్కడో విన్నాను. సర్కస్‌లో పని చేసేవారు, భవన నిర్మాణ కూలీలు ఇన్సూరెన్స్ చేయించుకునే అవకాశం కూడా లేదట. వెంకటేష్: మా కష్టాలకు అంతెక్కడుంది సార్. కొందరు అందంగా ఇల్లు కట్టించుకుంటరా..! పని అయిపోయాక పైసలు మాత్రం సరిగా ఇవ్వరు. మా తరఫున అడిగేటోళ్లు ఎవరుంటరు సార్. అందుకే మేమే సొంతంగా ఓ యూనియన్ పెట్టుకున్నం. చంద్రబోస్: గుడ్.. యూనియన్ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. కష్టం వస్తే ఆదుకోవడం ఒక్కటే కాదు.. మీ మధ్య అనుబంధాలు కూడా పెరుగుతాయి. అమ్మా.. మీరు మౌనంగా వింటున్నారు. భవన నిర్మాణంలో మీ పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మీరు మాల్ అందిస్తేనే మేస్త్రీ ఇటుక పేర్చగలడు. ఏమంటారు? లక్ష్మమ్మ: ఔ సార్. చంద్రబోస్: లక్ష్మమ్మ.. ఇటుకలు, ఇసుక, మాలు అన్నీ బరువైనవే. అలాంటివి నెత్తిపై పెట్టుకుని మెట్లెక్కుతారు. ఆరోగ్య సమస్యలు రావా? లక్ష్మమ్మ: ఎందుకు రావు సార్. ఊకె తలనొస్తది, నడుంల నొస్తది, కాళ్లు గుంజుతయి. అట్లాని.. పనికి రాకుంటే రోజెట్ల ఎల్తది సార్. చంద్రబోస్: మా ఇంటి పక్కన బిల్డింగ్ కడుతుంటే చూశాను.. గర్భవతులు కూడా వచ్చి ఈ బరువైన పనులు చేస్తుంటారు. చాలా ప్రమాదం కదమ్మా? లక్ష్మమ్మ: పేదోళ్లకు ప్రమాదం ఏముంటది సార్. బిడ్డను కనే చివరి క్షణం వరకూ కష్టపడి బతికితేనే పుట్టే బిడ్డను పోషించగలదు. గవన్నీ మాకు మామూలే చంద్రబోస్: మీరు ఇన్ని కష్టాలు పడితే గానీ ఇంటికి ఓ రూపం రాదు. మిమ్మల్ని కూడా ఓ విభాగంగా గుర్తించి, ముఖ్యంగా ఆరోగ్య బీమా, హెల్త్‌కార్డ్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నాను... ఉంటాను... ..:: భువనేశ్వరి ఫొటోలు: ఎన్.రాజేశ్‌రెడ్డి -
స్టార్ రిపోర్టర్ - మంచు లక్ష్మి
-
డ్రైనేజీ బతుకులు
-
డ్రైనేజీ బతుకులు
స్టార్ రిపోర్టర్ - ఉత్తేజ్ నగరంలో అద్దాల్లా మెరిసే రోడ్ల పొడవునా.. భూగర్భంలో పరుచుకున్న అంధకూపాలకు పాలకులు వాళ్లు. తెల్లవారడంతోనే వీరి బతుకులు మురుగులో కూరుకుపోతాయి. పొద్దెక్కే వరకూ అందులోనే మురిగిపోతాయి. ఊపిరి సలపనివ్వని దుర్గంధంలో గంటల తరబడి పని చేస్తే గానీ వారి బతుకులు ముందుకు సాగవు. సాటి మనుషులు ఇదేం పనని మలినంలా చూస్తున్నా.. పొట్టకూటి కోసం మలినంలోనే మసలుతుంటారు. అదే మనుషుల వ్యర్థాలతో పేరుకుపోయిన మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసి.. అందరికీ స్వస్థత చేకూరుస్తారు. మురికిలో మగ్గుతున్న ఆ కార్మికులను ‘సాక్షి’ సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా నటుడు ఉత్తేజ్ పలకరించారు. హలో అంటూ వారితో చేయి కలిపి ఆ మనసులోని మాటలు మన ముందుంచారు. ఉత్తేజ్: స్వచ్ఛ భారత్.. దేశం మొత్తం వినిపిస్తున్న మాట. నిజానికి మనం స్వచ్ఛ బారత్ నినాదాలం మాత్రమే. మీరు స్వచ్ఛ భారత్‌కు పునాదులు. డ్రైనేజ్ క్లీనర్స్.. ఈ మాట పలుకుతుంటేనే ముఖం చిట్లిస్తారు. కానీ, మీరే లేకుంటే మేం రోడ్డుపై ఒక్క నిమిషం నిలబడలేం. మీరు మురికిలో ఉంటూ మమ్మల్ని శుభ్రంగా ఉంచుతున్నారు. చెప్పండి భయ్యా ఎలా ఉన్నారు? యాదయ్య: చూస్తున్నరు కదా సార్! మురికిగుంటల పని చేసుకుంటున్నం. ఉత్తేజ్: మీరు ఈ పనిచేయవట్టే కదా! మేమింత హాయిగా ఉన్నాం. లేదంటే మ్యాన్‌హోల్స్‌లో పడి కాదు.. రోడ్డుపై పారే బురదలో కొట్టుకుపోయే వాళ్లం. వెంకటేష్: మమ్మల్ని పలకరించడానికి వచ్చినందుకు సంతోషం సార్. రాములు: అవ్ సార్.. మమ్మల్ని చూసి మా చుట్టాలే దూరం జరుగుతరు. యాదయ్య: పనైపోయినాంక స్నానం చేసే ఇంటికి వోతం. అయినా వాసనొస్తుందంటరు. ఉత్తేజ్: తప్పు భయ్యా.. చిన్న పిల్లల మలమూత్రాలు ఎత్తిపోసే అమ్మ ఎంత గొప్పదో.. వీధుల్లో డ్రైనేజీ క్లీన్ చేసే మీరు అంతేనయ్యా. అంజయ్య: గట్ల అర్థం చేసుకునేటోళ్లు ఎవరు సార్ ! ఉత్తేజ్: బతకడానికి ఎన్నో వృత్తులుండగా మీరు ఇదే ఎందుకు ఎంచుకున్నారు? రాములు: బతకడానికే సార్. గీ పనీ దొరకక బాధలు పడేటోళ్లు చానామందున్నరు. యాదయ్య: సార్ మేం ఉండేది జనగాం దగ్గర. పని చేసేది ఖైరతాబాద్‌లో. ఉత్తేజ్: ఎక్కడ జనగాం.. ఎక్కడ ఖైరతాబాద్ ! పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరుతావు ? యాదయ్య: మూడు గంటలకు సైకిల్ మీద రైలు స్టేషన్‌కు పోత. ఆడ రెలైక్కి సిటీల దిగుత. మళ్లీ బస్సెక్కి ఖైరతాబాద్ చేరుకుంట. ఉత్తేజ్: ఓ మైగాడ్.. ఈ పని చేయడానికా? రాములు: అంతేగా సార్. పొట్టకూటి కోసం.. ఏదో ఒకటి చేసుకోవాలే. ఉత్తేజ్: మీ పని వేళల గురించి చెప్పండి? మహ్మద్ చాద్మియ: పొద్దుగాళ్ల ఏడు గంటలకే షురువైతది. అంతేనా.. ఎప్పుడు ఫోనొస్తే అప్పుడు ఉరకాలే. మేం బండి మీద పని చేసేటోళ్లం. ఏడ కంప్లైంటొస్తే ఆడికి పోతం. ఉత్తేజ్: మురిగునీటిపై వాలిన దోమలు, ఈగలు ఇంట్లోకి వస్తేనే రకరకాల జబ్బులొస్తాయంటారు కదా! అలాంటిది మీరు పొద్దంతా మ్యాన్హోల్స్లోనే ఉంటారు. మరి మీ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి? అంజయ్య: జ్వరాలొస్తయ్. దగ్గు, దమ్ము ఉండనే ఉంటయి. చర్మరోగాలు ఎక్కువొస్తుంటయి. ఉత్తేజ్: అలాంటి జబ్బులొచ్చినప్పుడు మీకు ఉచితంగా వైద్యం అందుతుందా? యాదయ్య: ఎన్ని జబ్బులొచ్చినా.. డాక్టర్ కాడికి పోతే సొంతం పైసలే పెట్టుకోవాలే. సర్కార్ నుంచి ఏ సాయం ఉండదు. ఉత్తేజ్: చాలాసార్లు విన్నాను. మీ కార్మికులు పనులు చేస్తూ మ్యాన్‌హోల్‌లో పడి గాయాలపాలైనట్టు.. ప్రాణాలు కోల్పోయినట్టు..! వెంకటేష్: చిన్న చిన్న దెబ్బలు తగిలితే వెంటనే మా ఆఫీసుల మందురాసి కట్టుకట్టేటోళ్లు ఉంటరు సార్. పెద్ద దెబ్బలు తాకితే సర్కార్ దవాఖానకు పోతం. అప్పుడప్పుడూ ఊపిరాడకనో.. దెబ్బ బలంగా తాకో ప్రాణాలే పోతయ్ సార్. ఉత్తేజ్: మ్యాన్‌హోల్‌లో పడి సామాన్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వార్తలు పేపర్లో చదువుతుంటాం. దానికి కారణం ఎవరు..? మీరు కాదంటారా ? రాములు: కచ్చితంగా మేం కాదు సార్. రోడ్డుపక్కన షాపుల వాళ్లు వారి షాపు ముందు నిలిచిపోయిన నీళ్లు పోయేందుకు రాత్రి పూట అక్కడున్న మ్యాన్‌హోల్ మూత తీసి పక్కన పెడ్తరు. నీళ్లు పోయినాంక మూత పెట్టరు. మేం చూస్తే మూసేస్తాం. లేదంటే అది గట్లనే ఉంటది. ఈ విషయం తెల్వక అందరూ మమ్మల్ని అంటరు. ఉత్తేజ్: రోడ్డుపై మ్యాన్‌హోల్స్ పక్కన లోపలి నుంచి తీసిన చెత్తను కుప్పగా పెట్టి వదిలేస్తారు? దాని వల్ల దుర్వాసనతో పాటు రోడ్డంతా పాడవుతుంది కదా? వెంకటేష్: అది మా పొరపాటే సార్. దానికీ కారణం ఉంది. మా దగ్గర మ్యాన్‌హోల్స్‌లో దిగి క్లీన్ చేసే ఉద్యోగులు చానమంది ఉన్నరు. చెత్త తీస్కవోయేటోళ్లు, బండ్లు తక్కువున్నయి. మహ్మద్ చాద్మియ: అదొక్కటే కారణం కాదు సార్. గప్పట్ల ఏడపడ్తే ఆడ చెత్తకుండీలు ఉండేటియి. మేం ఎండిపోయిన చెత్తను తీస్కవోయి వాటిల్ల వేసేటోళ్లం. ఇప్పుడు కాలనీలళ్ల చెత్తకుండీలు పెట్టనిస్తలేరు. దాంతో ఎప్పటికప్పుడు చెత్తను తీసేయ్యడం కష్టమైతుంది. ఉత్తేజ్: మీకు జీతాలు ఎట్లుంటయి భయ్యా ? యాదయ్య: ఏదో ఉంటయి సార్. ఐదేళ్లు అనుభవం ఉంటే పది,పదిహేను వేల దాకా వస్తుంది. కానీ ఇప్పటి ఖర్చులకు ఏడ సరిపోతది సార్. ఈ సిటీల సంసారమంటే గీ ైపైసలు ఏడికి రావు. ఉత్తేజ్: మీకు సొంతిళ్లో, ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లో ఏమన్న ఉన్నాయా..? రాములు: అందరం అద్దె ఇళ్లల్లనే ఉంటున్నం సార్. ఉత్తేజ్: చివరి ప్రశ్న.. మీరు మందుకొట్టి ఈ పనిచేస్తారని అంటారు నిజమేనా? అంజయ్య: మామూలుగా మ్యాన్‌హోల్ దగ్గరికి వస్తేనే కళ్లు తిరుగుతయ్. గసొంటిది తాగి దాంట్లకు దిగితే మళ్లీ పైకొస్తమా సార్. ఏ మాత్రం తేడా అయినా.. లోపల పడి చస్తం. పని అయినాంక మాత్రం తాగుతం. కష్టం మరచిపోనికి తాగుతం సార్. ఉత్తేజ్: ఓ.. సారీ. నేను ఎక్కడో విని మిమ్మల్ని అడిగాను. మీరు చెప్పిన మాట నిజమే. బుర్ర సరిగా పని చేయనపుడు మ్యాన్‌హోల్ చుట్టుపక్కలకు రావొద్దు. చాలా ప్రమాదం. జగ్గయ్య: అంతేగా సార్. ఉత్తేజ్: రోడ్డుపై నుంచి వెళ్తున్నప్పుడు ఓపెన్ చేసి ఉన్న మ్యాన్‌హోల్ కనిపించగానే కారు అద్దాలు ఎత్తేసుకుంటాం. అలాంటిది అందులోకి దిగి అక్కడ జీవన పోరాటం సాగించే మిమ్మల్ని కలసి మాట్లాడినందుకు హ్యాపీగా ఉంది భయ్యా. థ్యాంక్యూ. ఉత్తేజ్: ఇక బయలుదేరుతాను.. చెయ్యి ఇవ్వండి యాదయ్య: అయ్యో వద్దుసార్. అంతా బురదవట్టింది. వాసనొస్తది. ఉత్తేజ్: నీ చెయ్యి మురికిగా ఉంది కాబట్టే మేమంతా శుభ్రంగా ఉన్నాం. ఒక్కసారికి ఏం కాదు. -
ఫైర్ ఫైటర్స్
-
ఫైర్ ఫైటర్స్
నిప్పురవ్వ తాకితేనే ఒళ్లు చురుక్కుమంటుంది. అలాంటిది ఎగిసిపడుతున్న అగ్నికీలలను ఎదురొడ్డి నిలబడతారు వాళ్లు. జలఖడ్గంతో అగ్గిబరాటాలపై విరుచుకుపడతారు. మంటల్లో చిక్కుకున్న ప్రాణాలను తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షిస్తారు. అగ్గిలో బుగ్గిపాలవుతున్న ఆస్తిని కాపాడతారు. తరచూ రెస్క్యూ ఆపరేషన్స్‌తో రిస్క్ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది అంటే మనపాలిట ఆపద్బాంధవులు. ఈ ఫైర్ ఫైటర్స్‌ను సాక్షిసిటీప్లస్ తరఫున నటుడు బ్రహ్మాజీ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. బ్రహ్మాజీ: మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పండి..? వెంకన్న: రోజు వందకుపైగా ఫేక్ కాల్స్ వస్తుంటాయి సార్. కొందరు ఆకతాయిలు పదే పదే ఫోన్ చేస్తుంటారు. బ్రహ్మాజీ: ఇంతకన్నా సిగ్గుచేటు విషయం ఇంకోటి లేదండి. ఫేక్ కాల్ చేయడానికి ఇంతకన్నా గొప్ప నంబర్ దొరకడం లేదా జనాలకి. మన ప్రాణాలతో మనమే చెలగాటం ఆడుతున్నాం. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. గురుమూర్తి: మాకు ఇంకో ఇబ్బంది ట్రాఫిక్ సార్. అంబులెన్స్‌కి ఇచ్చినంత సులువుగా మాకు దారి చూపరు. బ్రహ్మాజీ: ట్రాఫిక్ వారికి సమాచారం ఉంటుంది కదా! వారు క్లియర్ చేయొచ్చు కదా! గురుమూర్తి: అంబులెన్స్ వరకూ వారికి సమాచారం ఉంటుంది కానీ మా కోసం ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేకంగా ఏమీ చేయరు. మేం కూడా వేగంగా దూసుకుపోడానికి లేదు. బ్రహ్మాజీ: మీరు పరిగెత్తేది కూడా ప్రాణాలు కాపాడటానికే కదా.. మీకు అలాంటి వెసులుబాటు లేకపోవడం ఏంటి ? గురుమూర్తి: ట్రాఫిక్ సంగతి పక్కన పెట్టండి సార్. ప్రజల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ ఉండదు. మాదాపూర్ ప్రాంతంలో అయితే కుర్రాళ్లు మా వెహికల్స్ ముందు కట్లు కొట్టుకుంటూ వెళ్తుంటారు. బ్రహ్మాజీ: చదువుకున్న వాళ్లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరం. బ్రహ్మాజీ: నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ అంటే చాలా ఇష్టం. ఈ డిపార్ట్మెంట్లో ఫైర్ సర్వీసంటే మరింత మక్కువ. ఈ రోజు ఇలా పలకరించే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది. వి.నాగార్జునరెడ్డి: మీరు ఎంతో ఇష్టంగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మేం కూడా హ్యాపీగా ఫీలవుతున్నాం. బ్రహ్మాజీ: చిన్న డౌట్.. మీ యూనిఫాం, పోలీసుల యూనిఫాం ఒకేలా ఉంటాయి. తేడా ఎలా తెలుసుకోవాలి? వి.నాగార్జునరెడ్డి: మామూలు పోలీసులకు షోల్డర్కప్స్పై స్టార్లు ఉంటాయి. మాకు ఇంప్లాంట్స్ ఉంటాయి. బోరులో నుంచి నీళ్లు తోడేటప్పుడు పైపులో ఉండే ఇంప్లాంట్స్ సింబల్సే మా భుజాలపై కనిపిస్తాయి. బ్రహ్మాజీ: ఓ.. నాకే కాదు చాలామందికి ఈ విషయం తెలియదు. ఫైర్వ్యాన్లో మొత్తం ఎంతమంది సిబ్బంది ఉంటారు సార్? వెంకన్న: ఐదుగురు వరకూ ఉంటారు. ఒకరు లీడింగ్ ఫైర్‌మెన్ మరో ముగ్గురు ఫైర్మెన్లు, డ్రైవర్ ఉంటారు. ప్రమాద తీవ్రత ఎక్కువున్నప్పుడు రెండు మూడు వాహనాలు వెళ్తాయి. బ్రహ్మాజీ: మీరు డిపార్ట్మెంట్కి వచ్చి ఎన్నాళ్లయింది? యాదగిరి: నేను లీడింగ్ ఫైర్‌మెన్‌గా పనిచేస్తున్నాను. ఇష్టంతో వచ్చినవాళ్లే ఇక్కడ ఎక్కువ రోజులు పనిచేయగలుగుతారు. ప్రాణాలను రక్షించే అవకాశం రావడం అదృష్టంగా భావించాలి. నేను ఇప్పటి వరకూ 200 ఫైర్ ఫైటింగ్స్ చేసి ఉంటాను. బ్రహ్మాజీ: ఫీల్డ్‌లో మీకెదురైన చేదు అనుభవం గురించి చెబుతారా? యాదగిరి: కొన్నాళ్ల క్రితం జీడిమెట్లలో ఒక కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ అయింది సార్. మేం చేరుకునే సరికి చాలా నష్టం జరిగింది. ఒక గదిలో ముగ్గురు మృతిచెందారు. రియాక్టర్ సమీపంలో ఉండటంతో శరీరాలు ముక్కలు ముక్కలుగా తెగిపడ్డాయి. ఆ దృశ్యం చూడలేకపోయాను. ఆ రక్తపుముద్దలను తీసి అంబులెన్స్‌లో మార్చురీకి చేర్చాం. బ్రహ్మాజీ: ప్రాణాలు కాపాడిన సందర్భాలు.. పి.నాగభూషణమ్: మొన్నీమధ్యే మాదాపూర్ పరిధిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడికి సమయానికి చేరుకుని మా ప్రాణాలకు తెగించి పన్నెండు మందిని కాపాడాం. వి.నాగార్జునరెడ్డి: నేను జిల్లా ఫైర్ ఆఫీసర్‌గా చేస్తున్నాను. 2005లో పంజగుట్టలోని ఒక జ్యువెలరీ షాపులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. నాలుగు ఫైర్వ్యాన్లతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నాం. ఐదంతస్తుల బిల్డింగ్. ఒక వైపునే ఓపెన్ ప్లేస్ ఉంది. మిగతా మూడు వైపులా చీమ దూరే సందు కూడా లేదు. ఒకవైపు ఉన్న డోర్స్ బ్రేక్ చేసి నీళ్లు చిమ్ముతున్నాం. ఎన్ని నీళ్లు పోసినా మంటలు అదుపులోకి రావడం లేదు. తెల్లవారే వరకూ నీళ్లు పోస్తూనే ఉన్నాం. తెల్లారాక ఐదో అంతస్తులో ఐదుగురు చనిపోయి కనిపించారు. దగ్గరగా ఉండి కూడా వారి ప్రాణాలు కాపాడలేకపోయామని ఆ క్షణం చాలా బాధపడ్డాం. బ్రహ్మాజీ: అడుగుల దూరంలో మీరు ఉండి కూడా ఏమీ చేయలేకపోడానికి మొదటి కారణం? వి.నాగార్జునరెడ్డి: ఫస్ట్ థింగ్. ఆ బిల్డింగ్ చుట్టూ మా వెహికిల్ తిరిగే ప్లేస్ లేదు. కొద్ది ప్లేస్ ఉన్నా అన్ని కిటికీలు పగలగొట్టేవాళ్లం. లోపల ఉన్నవారి కేకలు వినిపించేవి. కమర్షియల్ కాంప్లెక్స్‌లు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. బ్రహ్మాజీ: పొగ వస్తుంటే మీరు లోపలికి వెళ్లి రెస్క్యూ చేసే అవకాశం ఉండదంటారా? వెంకన్న: ఏ చిన్న అవకాశం ఉన్నా.. వెనుకంజ వేసే ప్రసక్తే ఉండదు. మనిషి ప్రాణాలకు మంట వల్ల ఎంత ప్రమాదమో.. పొగ కూడా అంతే ప్రమాదకారి. బ్రహ్మాజీ: ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలో.. ఏమైనా చిట్కాలు చెప్తారా? వి.నాగార్జునరెడ్డి: ముందుగా ఇంట్లో పొగ వస్తే ఎవరూ కూడా నిలబడి ఉండకూడదు. నేలపై పడుకోవాలి. వీలైతే తడిబట్టని ముక్కు దగ్గర పెట్టుకుంటే కార ్బన్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఉంటుంది. లేదంటే ఐదు నిమిషాల్లో స్పృహ కోల్పోతారు. బ్రహ్మాజీ: అలాగా.. ఇరుకు సందుల్లోకి మీరు వెళ్లాల్సి వచ్చినపుడు.. ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు? ఆర్.ఎ.కురేష్: మామూలుగా ఉండవు సర్ మా పాట్లు. మా వెహికిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. వెళ్లే మార్గాలు నాలుగైదు అడుగుల వెడల్పు కూడా ఉండవు. అలాంటప్పుడు వాటర్ పైపులను జాయింట్ చేసుకుంటాం. బ్రహ్మాజీ: హైదరాబాద్‌లో ఎన్ని ఫైర్ స్టేషన్లు ఉన్నాయండి ? ఆర్.ఎ కురేష్: మొత్తం 20 స్టేషన్లు ఉన్నాయి. బ్రహ్మాజీ: అసలు ఎన్ని ఉండాలి? తగరం వెంకన్న: లెక్క ప్రకారం 100 ఉండాలి. నిజాం జమానాలో ఆరు స్టేషన్లు ఉండేవి. ఇప్పుడవి 15కు చేరింది. ఈ మధ్యే మరో ఐదింటిని మంజూరు చేశారు. ఇక వెహికిల్స్ 20 వరకూ ఉన్నాయి. పెద్ద వెహికిల్స్ అంటే బ్రాంటో స్కైలిఫ్ట్ వెహికిల్స్ రెండు ఉన్నాయి. వాటి ప్రత్యేకత పాతిక అంతస్తుల బిల్డింగ్‌ని మొత్తం కవర్ చేయగలవు. బ్రహ్మాజీ: నేను కూడా ఎవరో చెబితే విన్నాను. యాభైవేల మంది జనాభాకి ఒక ఫైర్‌స్టేషన్ ఉండాలట! వెంకన్న: నిజమే. బ్రహ్మాజీ: మరి ప్రమాదం జరిగినప్పుడు జనాలు ఎలా స్పందిస్తుంటారు? గురుమూర్తి: ఇదేముంది సార్, ఫైర్ యాక్సిడెంట్ అయిందని మాకు ఫోన్ చేస్తారా..! మళ్లీ మేం అడ్రస్ తెలుసుకుందామనుకుంటే.. ఆ ఫోన్ ఎంగేజ్ వస్తుంటుంది. మేం ఘటనాస్థలికి చేరుకునే సరికి కనీసం అక్కడ అడ్డంగా ఉన్న కార్లు, బైకులు అయినా తీసి కాస్త దూరంగా పెట్టరు. బ్రహ్మాజీ: నిజమే.. చాలామంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మారాలని కోరుకుందాం. మన ఫైర్ డిపార్ట్మెంట్కి ప్రజల సహకారం, ప్రభుత్వం అండ పూర్తి స్థాయిలో ఉంటుందని ఆశిద్దాం. -
స్టార్ రిపోర్టర్ - నవదీప్
-
పోలీస్ రిపోర్టర్
-
స్టార్ రిపోర్టర్ - దాసరి నారాయణ రావు
-
స్టార్ రిపోర్టర్ - కేథరీన్
-
స్టార్ రిపోర్టర్ 2nd Nov 2014
-
స్టార్ రిపోర్టర్
-
స్టార్ రిపోర్టర్@ అజయ్
-
జీవన సుధ
-
బతుకు..పూలపాట
-
స్టార్ రిపోర్టర్@ కోటి
-
నల్గొండ గద్దర్ స్టార్ రిపోర్టర్
-
ఈ వారం స్టార్ రిపోర్టర్-ఎమ్మెస్ నారాయణ
-
సాగర్‌లో వినాయకుడు
-
స్వాతిముత్యాలు
-
స్వాతిముత్యాలు
కల్మషం ఎరుగని నవ్వులు.. కుతంత్రం కనిపించని చూపులు.. కుట్రలు తెలియని ఆలోచనలు.. ఇదే వారి ప్రపంచం. లౌక్యానికి దూరంగా.. సంతోషానికి దగ్గరగా.. సంచలిస్తున్న వారి హావభావాలు.. కన్నవారికి అనుక్షణం బాధ్యతలు గుర్తు చేస్తుంటాయి. అక్కరకు రాని సానుభూతి తప్ప.. ఇంకేమీ ఇవ్వని ఈ లోకంలో నిస్వార్థానికి చిరునామాగా నిలుస్తున్నారీ అమాయక చక్రవర్తులు. మనసుకు మాలిన్యం అంటని స్వాతిముత్యాల హృదయాలను ఆవిష్కరించడానికి.. వారి తల్లిదండ్రులను హీరో సునీల్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. పసితనం దగ్గరే ఆగిపోయిన ఇంటలెక్చువల్లీ చాలెంజ్డ్ పిల్లల అంతరంగాలను మనముందుంచారు. - సునీల్ సునీల్: అమ్మా.. మీ బిడ్డ స్పెషల్ కిడ్ అని తెలియగానే చిన్నారి గురించి బాధపడ్డారా..? మీ గురించి బాధ పడ్డారా? సునీత: ఏ త ల్లయినా ఆ షాక్ నుంచి తేరుకోవడం అంత ఈజీ కాదు సార్. నా ఇద్దరు పిల్లలూ స్పెషల్ కిడ్సే. నా బిడ్డలకే ఎందుకిలా అయిందన్న బాధ నుంచి తేరుకోవడానికి నాకు చాన్నాళ్లు పట్టింది. వారి మాటల్లో, చేతల్లో ప్రత్యేకత కనిపించినపుడు మాత్రం నాకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. సునీల్: వావ్.. వారు నేర్చుకోలే క కాదు! మనం సరిగా దృష్టి పెడితే వారు ఎన్నో అద్భుతాలు చేయగలరని సంతోష్లా చాలామంది నిరూపించారు. అపర్ణ: అవును సార్ మా అబ్బాయి వరుణ్ రెండుసార్లు స్పెషల్ ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ కేటగిరీలో మెడల్స్ తీసుకొచ్చాడు. అంతేకాదు.. బుక్ బైండింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. వాడి బుక్స్‌కి బోలెడంత గిరాకీ ఉంది. సునీల్: అది మన గొప్పతనం కాదండీ.. వంద శాతం వాళ్ల ప్రత్యేకతే. మనతో పోల్చుకుంటే వీళ్లు ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తారు. ఇజ్రాయెల్ వంటి దేశాల్లో మిలటరీ సెక్షన్లో గన్స్‌లో బులెట్ లోడింగ్ స్పెషల్ చిల్డ్రన్స్‌తో చేయిస్తుంటారు. వీళ్లయితే పక్కాగా చేస్తారని. అదే మనలాంటి వారికి అప్పగిస్తే బుర్ర ఎక్కడో పెట్టి పొరపాట్లు చేస్తాం. మీ గురించి చెప్పండి సార్.. సుధాకర్: మా అమ్మాయి సుస్మిత. తనకు మూడేళ్లు వచ్చాక స్పెషల్ కిడ్ అని గుర్తించాం. మేం మానసికంగా కుంగిపోయాం. చదువులో ముందుకు వెళ్లలేకపోతుందని స్పోర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాం. స్పెషల్ ఒలింపిక్స్ వరకూ వెళ్లింది. స్విమ్మింగ్‌లో పథకాలు సాధించింది. పెళ్లి చేశాం.. ఓ పిల్లాడు కూడా. ఆడపిల్ల కదా సార్.. ఓ అయ్య చేతిలో పెట్టేవరకూ చాలా ఆందోళన పడ్డాం. ఇప్పుడు హ్యాపీ. సునీల్: గుడ్. శ్రీదేవి గారు.. నిర్వాహకులుగా మీరు చెప్పండి.. శ్రీదేవి: ‘శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్’ స్టార్ట్ చేసి 13 ఏళ్లవుతుంది. నాలుగు సెంటర్లున్నాయి. దాదాపు 300 మంది చిన్నారులను మామూలు మనుషులుగా మార్చగలిగాం. వీరిలో 30 మంది పదో తరగతి పూర్తి చేశారు. 16 మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరు స్పోర్ట్స్‌లో.. ఇంకొందరు డ్యాన్స్‌లో.. మరికొందరు రకరకాల వొకేషనల్ పనుల్లో రాణిస్తున్నారు. వెయ్యి మంది మామూలు వారిని గొప్పవాళ్లుగా తీర్చిదిద్దడంలో కంటే.. ఒక స్పెషల్ కిడ్ని ఓ పనిలో నిష్ణాతుణ్ని చే యడంలో ఉన్న తృప్తి చాలా గొప్పది. సునీల్: వీరు ఎక్కువగా ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు? శ్రీదేవి: కంప్యూటర్ సైడ్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మెకానిక్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటున్నాయి. మొన్నీమధ్యే ఇద్దరబ్బాయిలు బోయిన్‌పల్లిలోని హీరోహోండా షోరూమ్‌లో చేరారు. అలాగే మాల్స్‌లో కూడా వీళ్లు బాగా పని చేయగలరు. కానీ అవకాశాలు కల్పించేవారు కరువయ్యారు. సునీల్: అవును.. ఈ విషయంలో మనం పూర్తిగా ఫెయిల్యూర్. విదేశాల్లో అయితే వీరిని మామూలు మనుషుల్లానే ట్రీట్ చేస్తారు. ఉద్యోగ అవకాశాల్లో కూడా వీరి కోటా పెద్దది. మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి రావాలంటే ఏం చేయాలంటారు? వెంకట రమణారెడ్డి: వీళ్లు చేయగల పనులను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల్లో వీరికి కోటా కల్పించాలి. శ్రీదేవి: అంతేకాదు.. మన రాష్ట్రంలో వీరి సంఖ్యపై సర్వే చేయించి వీరి జీవనోపాధి కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి. సునీల్: మీకో విషయం చెప్పాలి.. మానవజాతిలోనే యూదులను అత్యంత తెలివైన వాళ్లుగా అభివర్ణిస్తారు. అయితే ఇంటలెక్చువల్లీ చాలెంజ్డ్ కూడా వాళ్లలోనే ఎక్కువ! అమెరికాలో ఒత్తిడితో బాధపడే గొప్ప గొప్ప వాళ్లూ.. స్పెషల్ కిడ్స్‌తో ఒకరోజు ఉండటానికి వారి తల్లిదండ్రులకు అప్లికేషన్లు పెట్టుకుంటారు తెలుసా..? వెంకట రమణారెడ్డి: వారికి కల్మషం తెలియదు.. అబద్ధం రాదు.. ఇష్టం లేని పని చేయరు.. నచ్చని వారి జోలికెళ్లరు. నచ్చితే వదలరు. అందుకే వారంటే అందరికీ ఇష్టమే. మావాడు నేను బయటకు వెళ్లి వచ్చే లోపు ఊరంతా చుట్టేసి అందరినీ పలకరించి వస్తాడు. ‘మీ అబ్బాయి చాలా మంచివాడ’ని అందరూ అంటుంటారు. వీడు మామూలుగా పుట్టి.. గొప్పగా చదివి విదేశాలకు వెళ్లినా.. ఆ మాట అనిపించుకునే వాడు కాదేమో. శ్రీలక్ష్మి: మాకు ఇద్దరు అబ్బాయిలు. చిన్నోడు స్పెషల్ కిడ్. పెద్దవాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇద్దరూ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. పెద్దోడికి కోపం వస్తే.. అంత త్వరగా చిన్నోడితో మాట్లాడడు. కానీ వీడు మాత్రం వెంటనే అన్నా అంటూ ద గ్గరికి వెళ్లి.. కలిపేసుకుంటాడు. సునీల్: నిజం చెప్పాలంటే అసలు వికలాంగులం మనమే. మన మాట ఎవరైనా వినకపోతే వెంటనే కోపం వచ్చేస్తుంది. అదే వాళ్ల బాధని ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం చేసుకోకుండా విసిగిస్తాం.. ఆ టైంలో వాళ్లకు ఎంత కోపం రావాలి ? అపర్ణ: వీరిని అర్థం చేసుకుని.. వారిలో ఉన్న ప్రత్యేకతను తెలుసుకుని ప్రోత్సహిస్తే.. ఆ పిల్లలు కూడా గొప్పస్థానాల్లో ఉంటారు. సునీత: సార్.. చిన్న ప్రశ్న.. మన సినిమాల్లో స్పెషల్ చిల్డ్రన్స్ పాత్రలు చాలా అరుదు. నిజానికి సినిమాకు మించిన ప్రచార మాధ్యమం మరొకటి లేదు కదా..! సునీల్: నిజమే. మన దగ్గర అలాంటి ప్రయత్నాలు తక్కువే. హాలీవుడ్లో చాలా చేశారు. వీరిని చూపించిన తీరు కూడా అద్భుతం. అలాంటి సినిమాలు ఇక్కడ కూడా వస్తే సమాజంలో మార్పు తప్పకుండా వస్తుంది. దానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ‘స్టార్ రిపోర్టర్’గా మిమ్మల్ని కలసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. కొన్ని సంగతులు పంచుకున్నాను. హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ!! సునీల్: నా దృష్టిలో వీళ్లు దేవుడిచ్చిన వరాలు. మాకెందుకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు భగవంతుడా అని మీరెప్పుడూ బాధపడకూడదు. ముందుగా తల్లిదండ్రులను ఎంచుకుని దేవుడు ఈ పిల్లలను ఇస్తాడు. ఎవరైతే ఓపికగా ఈ చిన్నారులను పెంచగలరో వారికే స్పెషల్ కిడ్స్ ఇస్తాడు. ఏమంటారు..? శ్రీదేవి: నిజమే సార్.. సరిగా నిలబడలేని వారు, బేసిక్ థింగ్స్ కూడా తెలియని పిల్లలు ఈ రోజు స్పెషల్ ఒలింపిక్స్‌కు వెళ్లి పతకాలు సాధించారంటే ఆ గొప్పదనం తల్లిదండ్రులదే. నీరజ: మా అబ్బాయి రాజేష్‌ను పదేళ్ల కిందట ‘శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్’కు తీసుకొచ్చాం. అప్పుడు వాడికేం తెలియదు. అలాంటిది ఈ రోజు వాడు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ పిల్లలు ఇలా ఎదగడానికి కారణం ఇలాంటి సంస్థలే. శ్రీదేవి: యస్.. స్వీడన్ వాళ్ల డేటా ఎంట్రీ ప్రాజెక్ట్‌లో సంతోష్‌ది చాలా ముఖ్యమైన పాత్ర. -
ఎగిరిపోతే....
-
అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది.
వారి లోకం ఆకలిరాజ్యం. చిరునామా అభ్యుదయుం. చరిత్ర పుటల్లో విప్లవశంఖాల్లా విరుచుకుపడిన శ్రామికులు.. ఇప్పుడు చతికిల పడుతున్నారు. పిడికిళ్లు బిగించడం మాత్రమే తెలిసిన కామ్రేడ్లు.. కష్టం ఇదని ఎలుగెత్తి నినదించలేకపోతున్నారు. గుండెలు మండించే బాధలు ఎన్నున్నా.. కండలు కరిగించడంలో వీరిది ముందడుగే. ఆర్థికంగా గరీబులైనా.. ఆత్మాభిమానంలో కుబేరులే. అసంఘటిత కార్మికలోకం.. ఏకాకై పోతోంది. హక్కులు పొందలేక దిక్కులు చూస్తోంది. పదండి ముందుకు పదండి తోసుకు అని మహాకవులు ఘోషించి దశాబ్దాలు దాటినా.. ఈ శ్రామికుల వేదన తీరడం లేదు. జగన్నాథ రథ చక్రాలు ఎన్ని వెళ్లినా.. వీరి బతుకులు బాగుపడిందీ లేదు. పచ్చడి మెతుకుల కోసం.. తలకు మించిన భారాన్ని భుజానికెత్తుకుంటూ బతుకుపోరు సాగిస్తున్న హమాలీ కార్మికులను స్టార్ రిపోర్టర్ రూపంలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పలకరించారు. హక్కుల కోసం పోరుతప్పదంటూ.. వారి అంతరంగాన్ని మన ముందుంచారు. రైతు అన్నం పెడతాడు. కార్మికుడు కష్టపడతాడు. వీరిద్దరి ఉసురు తగిలితే దేశానికి భవిష్యత్తు ఉండదు. కార్మికుడ్ని, కర్షకుడ్ని ఏ జాతి అరుుతే పూజిస్తుందో.. ఆ దేశం బాగుపడుతుంది. కార్మికుడు వీధిన పడితే పోయేది ప్రభుత్వం పరువే. నా విజ్ఞప్తి ఒక్కటే.. దేశంలో కార్మికుల ఆకలి కేకలు ఉండకూడదు. ఆర్. నారాయణమూర్తి: పట్టుర.. పట్టు హైలెస్సా..ఉడుంపట్టు హైలెస్సా.. పట్టుర పట్టు ఉడుంపట్టు హైలెస్సా.. పట్టకపోతే పొట్టే గడవదు హైలెస్సా.... వెంకన్న: మేం పనిచేసేటప్పుడు గీ పాట చెవిల పడినా.. మా నోట పలికినా మస్తు హుషారొస్తది సార్. ఆర్. నారాయణమూర్తి: అంతే కదా మరి.. హమాలీ కార్మికులు.. బరువులు భుజానికి ఎత్తకపోతే పొట్టకు ఉండదు కదా బ్రదర్. కె.రాములు: ఎత్తాలే సార్.. ఎంత బరువైనా ఎత్తాలి. అవసరమైతే ఇరవై గంటలైనా కూసోకుండ పని చేయాలి. పని లేకపోతే పస్తులే కదా. ఆర్. నారాయణమూర్తి: అసంఘటిత కార్మికుడి పరిస్థితి ఇలా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ప్రతి శ్రామికుడూ.. కార్మికుడే. సంఘటిత, అసంఘటిత పేరుతో మీపై సవతి ప్రేవు చూపకూడదు. దేశంలో పనిచేసే ఏ కార్మికుడికైనా తిండి, బట్ట, విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నా వంతు పోరాటం చేస్తున్నా.. మీరు ఇంకా పోరాడాలి. బి. రాములు: మా కష్టాలు, మా బతుకులను మీరు తీసిన సినిమాలలో చూపించి చాలా మందిని చైతన్య పరిచిండ్రు సార్. దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంత పోరాటం చేస్తే ఏంది సార్. మా బతుకు మాత్రం ఎక్కడ ఏసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఎమ్. నర్సింహ: ఒకటి రెండు కాదు.. హైదరాబాద్ సిటీల మా హమాలీ కార్మికులు లక్షా పది వేల మంది ఉన్నరు సార్. ఏ ఒక్కరికి కష్టమొచ్చినా మేం మేమే తలో చెయ్యి వేసుకుంటం కానీ, ప్రభుత్వం నుంచి గానీ, కంపెనీ యజమానుల నుంచి చిల్లి గవ్వ రాదు. ఆర్. నారాయణమూర్తి: అంటే మీరు పని చేస్తుండగా ఏదైనా ప్రమాదం జరిగితే.. యజమాని బాధ్యత తీసుకోడు.. ప్రభుత్వవుూ పట్టించుకోదు...మరి ఎలా కామ్రేడ్? కె. కిష్టయ్య: ఏం చేస్తం సార్. మొన్నామధ్య ఒకాయన రేకులు ఎత్తుతుంటే.. అతని చేతిమీద బరువైన రేకు పడి చెయ్యి కట్ అయ్యింది. మేమే ఆస్పత్రికి తోల్కవోయి.. తలా ఇన్ని పైసలేస్కొని వైద్యం చేరుుంచినం. లక్ష రూపాయులైంది. షాపాయున ను అడిగితే నాకేం సంబంధం అన్నడు. లారీ ఓనర్దీ అదే వూట. ఆర్. నారాయణమూర్తి: కూరగాయులు, బట్టలు, ఇనుప వస్తువులు, స్టీలు సామాన్లు, మోటార్లు, బస్తాలు ఒకటేమిటి.. ఏది వూర్కెట్లోకి రావాలన్నా.. మీరు భుజానికెత్తాల్సిందే. మీ పని చాలా గొప్పది, వుుఖ్యమైనది. వురి మీకు గుర్తింపు కార్డులున్నాయూ ? సంగయ్య: నేను 20 ఏళ్ల నుంచి ఒకటే కంపెనీల పని చేస్తున్న సార్. ఇప్పటికీ గుర్తింపు కార్డు లేదు. ఏందంటే...హమాలోళ్లకి ఐడెంటిటీ ఎవరిస్తర్రా అంటరు. ఆఫీస్ బాయ్‌లకు కూడా కార్డులుంటరుు. వూకు వూత్రం ఇవ్వరు. ఆర్. నారాయణమూర్తి: మీరంతా ఎక్కడ పని చేస్తున్నారు? ఉండేదెక్కడ? మధు: రాణిగంజ్ దగ్గర పని చేస్తం. అక్కడ మోటార్లు, పెద్ద పెద్ద మిషన్లను లారీలకు ఎక్కిస్తం. మా ప్రాంతంలో 400 మంది హమాలీ కార్మికులు ఉన్నారు. ఇక మేము ఉండేదంటారా.. ఒకరు ఉప్పల్‌లో, ఒకరు నాచారంలో, ఒకరు బోయిన్‌పల్లిలో.. నగరంలో నాలుగు దిక్కుల నుంచి వస్తుంటం. ఆర్. నారాయణమూర్తి: పెట్రోలు, ఇతర ఖర్చులు బాగా పెరిగిపోయాయి.. ఖర్చులెట్లా తట్టుకుంటున్నారు బ్రదర్. కె. కొమరయ్య: పెట్రోలుకు మాకు సంబంధమేంది సార్. నూటికి తొంభై మంది సైకిళ్ల మీదనే వస్తరు. అవి తొక్కే సరికే పెయ్యి మొత్తం పుండవుతుంది. వెంకయ్య: ఇప్పుడు రేట్లు వింటుంటే గుండె బరువెక్కిపోతోంది. యూభై రూపాయూల్లేనిది బియ్యుం వస్తలేవు. ఇంటి కిరారుుకే సగం జీతం పోతుంది. పిల్లల చదువులు, వైద్యం అంటే పేదోళ్ల ఒంటి మీద కొరడా దెబ్బలే. మధు: వూ జవూనాల పదేళ్లు రాంగనె పనికి పంపేటోళ్లు. మేవుట్ల చెయ్యులేం సార్. ఎంత కష్టమైనా పిల్లల్ని చదివించాలనుకుంటున్నం. ఆర్. నారాయణమూర్తి: నిజం బ్రదర్. నేటి బాలలే...రేపటి పౌరులు. పిల్లలకు అక్షరం నేర్పించాలి. ఈ స్వతంత్ర దేశంలో అన్నీ తానై నడించాల్సిన ప్రభుత్వం సర్వం ప్రైవేటీకరణ చేసి.. ప్రజలను రోడ్డు మీద నిలబెడుతోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, చివరికి బస్సు, రైలు అన్నింటినీ ప్రైవే ట్ పరం చేసి చోద్యం చూడాలనుకుంటోంది. ఫలితం.. పేదవాడి ఆకలి కేకలు. బి. రాములు: అంతే కదా సార్. ఎన్నికల ముందు మాత్రం మా దగ్గరకొచ్చి మీకు గుర్తింపు కార్డులిస్తం, మీకు ఈఎస్ఐ కార్డులిస్తమంటూ ఓట్లడుగుతరు. ఆర్. నారాయణమూర్తి: మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయుకుల దగ్గరికి వెళ్లి మీ సమస్యల గురించి చెప్పారా? శ్రీశైలం: ఏడ సార్.. పోలేదు. ఆర్. నారాయణమూర్తి: వెళ్లి అడగాలి కదా. అవసరమైతే పోరాడాలి. మీ హక్కుల కోసం మీరు పోరాడకపోతే ఇంకెవరు ముందుకొస్తారు. సంఘటిత కార్మికుడికి మీరేం తీసిపోరు. మీరు చేసే కష్టం ప్రజల కోసమే.. వాళ్లు చేసేది ప్రజల కోసమే. ఎన్. భాస్కర్‌రెడ్డి: మేం ఎక్కువ కోరికలు ఏమీ కోరడం లేదు సార్. మాకు గుర్తింపు కార్డులివ్వాలి. కనీసం వైద్య సదుపాయం కల్పించాలి. సొంతిల్లు ఇవ్వకపోయినా కనీసం అద్దె కట్టుకునే స్తోమత కల్పించాలి. ఆర్. నారాయణమూర్తి: పని లేని రోజున మీ పరిస్థితి ఏంటి? బి. రాములు: వూలో కొందరి ఇంటోళ్లు పూలు, కూరగాయులు అవుు్మతరు. నాలుగు ఇళ్లలో పని చేసి ఇంత సంపాదిస్తున్నరు. అందుకే పని లేని రోజు.. నాలుగు పచ్చడి మెతుకులైనా పుడుతున్నరుు. ఎమ్. నర్సింహ: సిటీల మా సంపాదనతో ఇల్లు నడపడం కష్టమనుకున్నోళ్లు భార్యాబిడ్డల్ని ఊళ్లనే ఉంచి ఇక్కడ ఒక్కరే పని చేసుకుంటున్నారు. మధు: సార్.. మీరు తీసే సినిమాలు మమ్మల్ని చానా ఆలోచింపజేసినయి. అప్పుడు మాత్రం మా పని మీద వూకు గౌరవం కలుగుతుంది. హక్కుల కోసం పోరుసాగిస్తాం సార్.. ఆర్. నారాయణమూర్తి: ఒకే.. లాల్‌సలాం!