తిబిలిసీ (జార్జియా రాజధాని) లోని ఫ్లీ మార్కెట్‌కు (పాత వస్తువులు, పురాతన వస్తువులు, సెకండ్‌హ్యాండ్ వస్తువులు దొరికే ప్రాంతం) వెళ్లారు ప్రభాస్. అక్కడ ఓ గొడవ జరిగింది. విలన్స్‌ను రఫ్ఫాడించారు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఓ డియర్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా జార్జియా షెడ్యూల్ ముగిసింది. అక్కడి ఫ్లీ మార్కెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ ఫైట్‌ను చిత్రీకరించారని సమాచారం. ఈ ఉగాదికి ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. జార్జియా షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ అండ్ టీమ్ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. కరోనా కారణంగా ఎవరికివారు ఇంట్లోనే ఉంటున్నారు. ప్రభాస్ కూడా స్వీయ గృహనిర్భందంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment