Chiranjeevi Bholaa Shankar Movie Team Announced Trailer Release Date, Deets Inside - Sakshi
Sakshi News home page

Bholaa Shankar Trailer: 'భోళాశంకర్‌' ట్రైలర్‌ విడుదల ఎప్పుడంటే..

Published Mon, Jul 24 2023 5:15 AM | Last Updated on Mon, Jul 24 2023 9:09 AM

Bholaa Shankar trailer to be revealed on 27 July 2023 - Sakshi

చిరంజీవి టైటిల్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘భోళాశంకర్‌’ ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న ట్రైలర్‌ విడుదలకానుంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్‌ నటించారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

కాగా ‘భోళాశంకర్‌’ ట్రైలర్‌ను ఈ నెల 27న(గురువారం) విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ఆదివారం అధికారికంగా ప్రకటించి, చిరంజీవి లుక్‌ని రిలీజ్‌ చేసింది. చేతిలో కత్తి పట్టుకుని సీరియస్‌ లుక్‌లో నడిచి వస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, ‘వెన్నెల’ కిషోర్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: డడ్లీ, లైన్‌ ప్రొడక్షన్‌: మెహర్‌ మూవీస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement