
‘అచ్చ తెలుగు పచ్చి మిర్చి మగాడు వీడే.. బొంబాటు ఘాటు హాటు హాటుగున్నాడే.. కల్లోకి వచ్చేసి కన్నెగుండెల్లో సూది గుచ్చి పిల్లా నీ ముచ్చటేంది అన్నాడే...’ అంటూ రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు హీరోయిన్ తమన్నా. చిరంజీవి టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్, సంజన కల్మంజేతో కలసి ఈ చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్ ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment