prime minister chance
-
ప్రాంతీయ పార్టీలకు ప్రధాని పదవి
సిమ్లా/న్యూఢిల్లీ: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లు వచ్చినా సరే, ప్రాంతీయపార్టీల నుంచి ఎవరినైనా ప్రధాని చేయాలంటే అందుకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గురువారం సిమ్లాలో తెలిపారు. బుధవారం పట్నాలో ఆయన మాట్లాడుతూ పీఎం పదవికి కాంగ్రెస్‌కు దక్కకపోయినా ఇబ్బంది లేదన్నారు. పీఎం పదవి తమకే కావాలనే సంకేతాలను గతంలో కాంగ్రెస్ ఇవ్వడంతో కొన్ని ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌కు దూరం జరిగాయి. అయితే ఆజాద్ ప్రకటనతో కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యధిక స్థానాలు తమ పార్టీనే గెలుస్తుందని తాము విశ్వసిస్తున్నామనీ, సాధారణంగా ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకే నాయకత్వ పదవి దక్కుతుందని ఆయన తెలిపారు. -
‘ప్రధాని పదవి దక్కకున్నా బాధ లేదు’
పట్నా : దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని తెర మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. మోదీని గద్దే దించడమే తమ లక్ష్యమని ఈ కూటమి చెప్పుకుంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రానీ పక్షంలో.. విపక్షాలన్ని కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నాయకులంతా ప్రధాని పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి దక్కకపోయినా ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. బుధవారం పట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆజాద్.. ‘మా స్టాండ్ ఏంటో ఇప్పటికే స్పష్టం చేశాం. కాంగ్రెస్‌కు మద్దతుగా అన్ని పార్టీలు కలిసి ఓ కూటమిగా ఏర్పాడితే.. ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అప్పుడు ప్రధాని పదవి కాంగ్రెస్ పార్టీకి దక్కకపోయినా పెద్దగా బాధ పడం. ఎందుకంటే బీజేపీని గద్దే దించడమే మా ప్రధాన ధ్యేయం. అందుకోసం అందరిని కలుపుకొని ముందుకు వెళ్తాం. మిగతా పార్టీలు తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుంది. ఈ అంశంలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూస్తాం’ అని ఆజాద్ తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బదులుగా ఆజాద్ ఇలా వివరణ ఇచ్చారు. -
మీడియాతో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
మీడియాతో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
లోకేష్ చెప్పడంతో ప్రధాని అయ్యే అవకాశం వదులుకున్నా ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది నేనే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసేందుకు చాలా కష్టపడ్డా 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రయత్నించా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వదిలేసుకున్నానని ఆయన అన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తూ ఈ విషయం చెప్పారు. ముఖ్యమంత్రి పదవి అయితే శాశ్వతంగా ఉంటుందని.. ప్రధానమంత్రి పదవి తాత్కాలికమేనని అప్పట్లో తన కుమారుడు లోకేష్ బాబు చెప్పడంతో.. ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకున్నానని ఆయన అన్నారు. అంతేకాదు.. 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి తాను ప్రయత్నించానని కూడా చంద్రబాబు అన్నారు. (వాస్తవానికి ఏపీలో మండలి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అందులోకి ప్రవేశించడానికి కనీస వయసు 30 ఏళ్లు అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి చెప్పారు). 28 ఏళ్లకే తాను మంత్రిని అయ్యానని, అసలు రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఎన్టీ రామారావుకు చెప్పింది కూడా తానేనని ఆయన అన్నారు. (ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అవసరమైతే మామపై పోటీ చేసేందుకు సిద్ధమని నాటి కాంగ్రెస్ నాయకుడిగా చంద్రబాబు ప్రకటించారు). ఇక అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసేందుకు తాను చాలా కష్టపడ్డానని కూడా ఆయన తెలిపారు. చివరకు నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయిని అందుకు ఒప్పించానన్నారు.