
'కాంగ్రెస్ అవినీతిపై పోరాడింది'
రూ.500, రూ. వెయ్యి నోట్ల రద్దుపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు.
రూ.500, రూ. వెయ్యి నోట్ల రద్దుపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. ఇప్పటికిప్పుడు పెద్ద నోట్లను రద్దు చేయడం ఎందుకో తనకు అంతుబట్టడం లేదని అన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడిందని గుర్తు చేశారు.
కానీ, ప్రభుత్వ నిర్ణయంతో పెళ్లిళ్ల వ్యవస్ధ, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇది ఎన్డీయే ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. గత రెండేళ్లుగా సాగుతున్న రాక్షస పాలనకు తాజాగా నోట్లను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులే సాక్ష్యమని చెప్పారు.