తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి ఆజాద్
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై అనేక పార్టీలు, వ్యక్తులు తప్పుడు హామీలు ఇవ్వడం వల్లే గందరగోళం చెలరేగిందని కేంద్రమంత్రి ఆజాద్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇచ్చిన హామీపై వెనక్కి తగ్గిన పార్టీలు, వ్యక్తులదే తప్పంతా అని చెప్పుకొచ్చారు. తెలంగాణ అంశంపై పార్టీలు, ఎంపీలు ఇచ్చిన మాటపై వెనక్కి వెళ్లడం దురదృష్టకరమని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఆజాద్ శుక్రవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
కొత్త రాష్ట్ర ఏర్పాటుకు మొదట అనేక పార్టీలు, ఎంపీలు అంగీకారం తెలిపారని, అయితే చివరి దశకు వచ్చే సరికి వీరంతా వ్యతిరేకించారని, ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు. ‘‘మా పార్టీ ఎంపీలతో నేను చర్చలు జరిపాను. అప్పుడు వారంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి సస్పెన్షన్‌కు గురయ్యారు. వారి అంగీకారాన్ని అనుసరించే మేం ముందుకు వెళ్లాం. కానీ ఒకసారి మేం నిర్ణయం తీసుకున్నాక అందరూ వెనక్కి వెళ్లారు’’ అని చెప్పారు. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని ఆజాద్ స్పష్టం చేశారు.
తప్పుడు హామీల వల్లే గందరగోళం
Published Sat, Feb 22 2014 12:45 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement