'ఫామ్‌హౌజ్‌లో పడుకుంటే తెలంగాణ వచ్చిందా?'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావుపై గులాంనబీ ఆజాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో ఎప్పుడు మాట్లాడావ్.. కేసీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఒకే ఎంపీ ఉన్నారని.. ఒక్క ఎంపీతోనే తెలంగాణ సాధించావా అంటూ ఆజాద్ ప్రశ్నించారు.
ఒక ఎంపీతోనే తెలంగాణ వచ్చిందంటే అంతకన్నా పెద్ద అబద్ధం ఉండదని ఆజాద్ ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం అందరూ ఉద్యమిస్తుంటే కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పడుకున్నారని ఆయన విమర్శించారు. నువ్వు ఫామ్‌హౌజ్‌లో పడుకుంటే తెలంగాణ వచ్చిందా? అని ఆజాద్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్రం కాంగ్రెస్ పార్టీ వల్లే ఏర్పాటైందని ఆజాద్ అన్నారు.