
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం పూర్తయి వెళ్లిపోతుండడంతో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ గురించి ప్రధానమంత్రి మోదీ భావోద్వేగంతో మాట్లాడిన విషయం తెలిసిందే. మోదీ కన్నీళ్లు సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మోదీ కన్నీళ్లపై మాత్రం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఫన్నీగా స్పందించారు. మోదీది ‘కళాత్మకమైన ప్రదర్శన’గా రాజ్యసభలో అభివర్ణించారు.
రాజ్యసభలోనే మోదీ కన్నీళ్లపై స్పందించారు. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి రాసిన పుస్తకంపై చర్చ జరగ్గా దీనిలో శశిథరూర్ మాట్లాడుతూ.. ‘మోదీ భావ ప్రదర్శన కళాత్మకమైనది’ అని పేర్కొన్నారు. రైతు నేత రాకేశ్ టికాయత్ కన్నీరు పెడితే మోదీ తాను కూడా కన్నీరు పెట్టాలని నిర్ణయించుకున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. రైతుల నిరసనలపై ఘాజీపూర్ సరిహద్దులో ఇటీవల తికాయత్ కంటతడి పెట్టిన విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పరోక్షంగా సభలో శశిథరూర్ ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment