
శ్రీనగర్: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీని మట్టి కరిపించడానికి విపక్షాలు ఏకమవుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపు మేరకు జూన్ 23న విపక్షాలన్నీ సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ ఈ కూటమి వలన ఏ ప్రయోజనం లేదని వ్యాఖ్యలు చేశారు. తమకు ఏమాత్రం లాభం లేకున్నా ఏ విపక్షమైన ఎందుకు మద్దతిస్తుందని అన్నారు.
ఏమి తీసుకుంటారు? ఏమి ఇస్తారు?
శ్రీనగర్లో జరిగిన ఓ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత పొత్తుల వలన ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందేమో కానీ ఎన్నికలకు ముందు ఈ పొత్తుల వలన ఏ ప్రయోజనం ఉండదు. ఉదాహరణకి బెంగాల్ రాష్ట్రాన్నే తీసుకోండి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గానీ సిపిఐ(ఎం) పార్టీకి గానీ ఒక్క సీట్ కూడా లేదు. అలాంటప్పుడు వారు బెంగాల్లో ఏమి ఆశిస్తారు.. బదులుగా మమతా బెనర్జీకి రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏమివ్వగలరు.
అబ్బే పనవ్వదు..
వీరంతా అధికార బీజేపీ పార్టీని ఓడించడానికి మాత్రమే సంకల్పించుకుని ఏకమైతే పర్వాలేదు గానీ పరస్పర ప్రయోజనాల కోసం కలిస్తే మాత్రం ఏ ఉపయోగం ఉండదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే నేను గతంలోనే చెప్పాను కాంగ్రెస్ పార్టీ రాష్టాల్లో కంటే కేంద్రంలోనే ఎక్కువ నష్టపోయిందని. లాభమో నష్టమో ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉన్న రాష్ట్రాల్లో మాత్రం మళ్ళీ పుంజుకుంటోంది. ఈ ఘనత ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకే దక్కుతుంది.
ఇది కూడా చదవండి: దేశంలో ముందస్తు ఎన్నికలు రావచ్చు: సీఎం నితీశ్
Comments
Please login to add a commentAdd a comment