
రాయల తెలంగాణపై సోనియాతో ఆజాద్ చర్చలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తుండగా, మరోవైపు రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఢిల్లీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాష్ట్ర వ్యవహరాల మాజీ ఇంచార్జి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ శనివారం భేటి అయ్యారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనపై సోనియాతో ఆజాద్ చర్చించినట్టు సమాచారం. ఇదే విషయంపై కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాయలసీమకు చెందిన నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. అంతకుముందు సోనియాతో సమావేశమైన కేంద్రమంత్రి చిరంజీవి రాయల తెలంగాణ గురించి మాట్లాడుతూ.. ఈ అంశంతో తనకు సంబంధంలేదన్నారు. ఇది రాయలసీమ నేతల ఇష్టమని చిరంజీవి చెప్పారు. రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు కూడా రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తమకు సమాచారం లేదని పేర్కొన్నారు.