సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్ సహా కశ్మీర్ పరిణామాలపై ఇతర పిటిషన్లను సుప్రీం కోర్టు సోమవారం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గంగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఆజాద్ పిటిషన్‌తో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్ సహా ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్‌లను విచారణకు చేపట్టనుంది. తమ సహచర నేత, చట్టసభ సభ్యుడు మహ్మద్ యూసుఫ్ తరిగామి నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఏచూరి సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా, తాను వ్యక్తిగత హోదాలో ఈ పిటిషన్ దాఖలు చేశానని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు జమ్ము కశ్మీర్ ప్రజల బాగోగులను తాను తెలుసుకోగోరుతున్నానని ఆయన చెప్పారు. తాను మానవతా దృక్పథంతోనే పిటిషన్ దాఖలు చేశానని, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆజాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment