సాక్షి, తిరుమల: గత రెండున్నర సంవత్సరాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని కుదిపేసి, ప్రాణాలను బలిగొన్న రోగాలు మళ్లీ రాకుండా ప్రజలను కాపాడాలని శ్రీవారిని ప్రార్థించానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నాను. ఈ రోజు విడుదలైన గుజరాత్ ఎన్నికల ఫలితాలు నేను చూడలేదు. దేవుని సన్నిధిలో రాజకీయాలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కోవిడ్ కారణంగా ఆర్ధిక పరిస్ధితి చిన్నాభిన్నమైంది. స్వామి వారి ఆశీస్సులతో ప్రజల కష్టాలు అన్ని తొలగిపోవాలి. ఏ పార్టి అధికారంలో ఉన్నా, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కష్టపడి ప్రజల కష్టాలను తొలగించాలి.
షర్మిలను త్రోయింగ్ చేసి తీసుకెళ్లడాన్ని ఖండిస్తున్నాం. షర్మిలకు నచ్చజెప్పి తీసుకెళ్లి ఉండాల్సింది. ప్రస్తుతం రాజకీయాలను నేను దూరంగా ఉన్నాను. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్‌లో అందరి ఎంపీల కంటే ఎక్కువ నిధులు తెచ్చుకున్నది నేనే. ప్రస్తుతానికి నా నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి పెట్టాను' అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
చదవండి: ('ఆ కుటుంబం వద్ద రూ.5కోట్లు తీసుకున్న ఘనుడు దామచర్ల జనార్ధన్')
Comments
Please login to add a commentAdd a comment