సాక్షి, తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో భాగంగా బుధవారం ఉదయం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో తన మనవడు పుట్టు వెంట్రుకలు సమర్పించి మెక్కు చెల్లించుకొన్నారు. ఇక, ఆలయం ముందు మనవడిని భుజంపై ఎత్తుకొని ఫోటోలు దిగారు సీఎం రేవంత్.
దర్శనానంతరం ఆలయం ముందు సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీ సీఎంతో కలిసి సమస్యలు పరిష్కరించుకుని కలసికట్టుగా నడుస్తామన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికి ఒకరు సహకరించుకోవాలని ఆకాంక్షించారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కూడా తీసుకోవాలని ఏపీ సీఎంకు విజ్ఞప్తి చేస్తామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పారు. రైతాంగాన్ని ఆదుకుని దేశ సంపదను పెంచాలని తమ ఆలోచన అని తెలియజేశారు.
#WATCH | Tirupati: Telangana CM Revanth Reddy alongwith his family members visits Tirumala Venkateswara Temple to offer prayers to Lord Balaji. pic.twitter.com/byzWZxL3EB
— ANI (@ANI) May 22, 2024
Comments
Please login to add a commentAdd a comment