
సోనియాను విస్మరించిన టీపీసీసీ నేతలు
నల్లగొండ: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీని టీపీసీసీ నాయకత్వం విస్మరించిందని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారని, అయితే ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చిన సోనియా కటౌట్‌లు నగరంలో ఎక్కడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల పనితీరుకు ఇది నిదర్శమని విమర్శించారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తులు పార్టీలో ఉన్నంత కాలం పరిస్థితి ఇదే విధంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో టీఆర్‌ఎస్‌కు తమ వంతు సహకారం అందిస్తామని, అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.