
సాగర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న కోమటిరెడ్డి
బయ్యారం: నిరుద్యోగులందరికీ భృతి కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా బాకీ పడ్డారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్ కుటుంబాన్ని శుక్రవారం రాత్రి ఆయన పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.
అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే అందరి బతుకులు బాగుపడుతాయని, ఆనాడు మంత్రి పదవికి రాజీనామా చేసి.. సొంత పార్టీతో తగువు పెట్టుకొని తెలంగాణను సాధించామన్నారు. కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తున్నారన్నారు. సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ శశాంకను ఫోన్‌లో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment