Nirudyogabhrti
-
నిరుద్యోగ భృతిపై మాట తప్పిన కేసీఆర్
బయ్యారం: నిరుద్యోగులందరికీ భృతి కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా బాకీ పడ్డారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్ కుటుంబాన్ని శుక్రవారం రాత్రి ఆయన పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే అందరి బతుకులు బాగుపడుతాయని, ఆనాడు మంత్రి పదవికి రాజీనామా చేసి.. సొంత పార్టీతో తగువు పెట్టుకొని తెలంగాణను సాధించామన్నారు. కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తున్నారన్నారు. సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ శశాంకను ఫోన్లో కోరారు. -
డేంజర్లో హలీవుడ్
అంతరిక్ష జీవులు దాడి చేస్తాయి. హాలీవుడ్ కాపాడుతుంది. యుగాంతం వచ్చి భూమి బద్దలవుతుంది. హాలీవుడ్ కాపాడుతుంది. సునామీ వచ్చి కెరటాలు ఆకాశానికి ఎగుస్తాయి. హాలీవుడ్ కాపాడుతుంది. ప్రపంచానికి ముప్పు వచ్చిన ప్రతిసారీ హాలీవుడ్ హీరో ఒకడు నిలబడతాడు. ఇప్పుడు కరోనా వచ్చింది. కాని– హాలీవుడ్ తనను రక్షించేది ఎవరా అని పిపిఇ ధరించి ఎదురు చూస్తూ ఉంది. ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లో నంబర్ వన్ హాలీవుడ్. ఏడాదికి దాదాపు 9 లక్షల కోట్లు దాని టర్నోవర్. 120 సంవత్సరాల ఘన చరిత్ర, ఇంత వ్యాపారం ఉన్న హాలీవుడ్ కరోనా వల్ల ఏం కాబోతున్నది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే అది కరోనా వల్ల 9 బిలియన్ల డాలర్లను నష్టపోయిందని ఒక అంచనా. నిజానికి చిన్న అవాంతరాలకే కుప్పకూలే వ్యవస్థ ఇది. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 57 వేల మంది హాలీవుడ్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. అదే సమయంలో తమ పారితోషికం పెంచమని 12 వేల మంది హాలీవుడ్, టెలివిజన్ రంగ రచయితలు సమ్మె చేశారు. వీటన్నింటి వల్ల 380 మిలియన్ డాలర్లు నష్టపోయింది హాలీవుడ్. ఆ సమయానికి ఇప్పటిలా డిజిటల్ స్ట్రీమింగ్ లేదు. జనం థియేటర్లలోనే సినిమాలు చూడాల్సిన పరిస్థితి. కాని జనం దగ్గర డబ్బు లేదు. ఆ సమయంలోనే హైవైగల్ అనే ఒక సినీ విశ్లేషకుడు ‘కరువు కాలంలో ఆల్కహాల్ అయినా కొంటారు కాని సినిమా టికెట్ కొనరు’ అని వ్యాఖ్యానించారు. అది అక్షరాలా నిజమైంది. దాదాపు రెండేళ్లపాటు పోరాడి ఆ గడ్డుకాలాన్ని దాటేసింది హాలీవుడ్. కరోనా సమయం హాలీవుడ్‌ని ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’ అని కూడా అంటారు. కరోనా దెబ్బకు ఆ కలల వ్యాపారం కుప్పకూలి పోయింది. హాలీవుడ్లో పని చేసే వారందరూ ధనవంతులు కారు. హాలీవుడ్ మీద ఆధారపడి దాదాపు 9 లక్షల మంది పని చేస్తున్నారు. వీరిలో సుమారు రెండు లక్షల మంది మాత్రమే బాగా గడిచే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. మిగిలినవాళ్లంతా రెక్కాడితేగాని డొక్కాడని వారే. వీళ్లలో చాలామంది కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయారు. డిస్నీలాండ్ తన పార్క్‌లో పని చేసే లక్ష మంది ఉద్యోగాలని తొలగించింది. అలాగే థియేటర్లలో పని చేసే వాళ్లల్లో లక్షా యాభై వేల మందిని తీసేశారు. వాళ్లని పనిలో నుంచి తీసేస్తున్న యజమానులు ఇందుకు వేదన అనుభవిస్తున్నారు. జూన్, జూలై నుంచి సినిమా కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంతమందికి ఉపాధి కల్పించడం కష్టం కావచ్చు. ‘ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం’ అని సినిమాటోగ్రాఫర్లు అంటున్నారు. ‘కేవలం డోమినోలో మాత్రం ఉద్యోగాలున్నాయి. అక్కడ పని వెతుక్కుంటున్నాం’ అని ప్రొడక్షన్ కో ఆర్డినేటర్లు అంటున్నారు. ‘కింగ్డమ్’ సీరియల్లో పాపులర్ అయిన నటుడు మాక్ బ్రిండెట్ తన రెగ్యులర్ ఈఎంఐలు కట్టలేక నిరుద్యోగ భృతికి అప్లై చేశాడు. రానున్న పోటీ రాబోయే రోజుల్లో ఎలా పని చేయాలి అనే విషయం మీద హాలీవుడ్ కసరత్తు చేస్తోంది. ఎలా చేసినా గతంలాంటి స్థితి తిరిగి రాదని అందరికీ తెలుసు. స్టూడియోలు, యూనియన్ల మధ్య చర్చలు ఏ నిర్ణయాలకు వస్తాయో తెలియదు. కాని తక్కువ మందితోనే షూటింగ్ చేయాలి. అవకాశాలు కొద్దిమందికే ఉంటాయి. వాటి కోసం అందరూ దారుణమైన పోటీ పడతారు. వేతనాలు తగ్గిస్తారనే వార్త కార్మికులను కలవర పరుస్తోంది. ప్రపంచాన్ని కాపాడే హీరో హాలీవుడ్లో ఉండొచ్చు. కాని ఆ హీరోను కూడా కాపాడే సూపర్ హీరో ప్రేక్షకుడే. ఆ ప్రేక్షకుడు థియేటర్లకు వచ్చి కూచునే వరకు హాలీవుడ్డే కాదు ఏ సినిమా రంగమైనా డేంజర్లో ఉన్నట్టే. రక్షించేవాడు క్రిస్టఫర్ నోలన్? ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ హాలీవుడ్‌ను కాపాడనున్నాడా? కాపాడాలనే సమస్త హాలీవుడ్ భావిస్తోంది. క్రిస్టఫర్ తీసిన తాజా భారీ సినిమా ‘టెనెట్’ జూలై 17న విడుదల కానుంది. లాక్డౌన్ తర్వాత కరోనాతో ‘సహజీవనం’ దాదాపు స్థిరపడ్డాక హాలీవుడ్ ప్రపంచం మీదకు ప్రేక్షకుల స్పందన కోసం వదలనున్న సినిమా ఇదే. ఈ సినిమా ప్రేక్షకులను రప్పించగలిగితే మిగిలిన సినిమాలన్నీ గాడిలో పడతాయని భావిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఓ సీక్రెట్ ఏజెంట్ ఎలా అడ్డుకున్నాడనేదే ‘టెనెట్’ కథ. మన డింపుల్ కపాడియా ఇందులో ముఖ్యపాత్ర పోషించింది. దీని తర్వాత బాండ్ ఫిల్మ్ ‘నో టైమ్ టు డై’ విడుదలవుతుంది.ఎలాగైనా అనుకున్న డేట్‌కే సినిమా విడుదల చేయాలని నోలన్ పట్టు పట్టి ఉన్నాడట. ఇదిలా ఉండగా ఏప్రిల్ 10న థియేటర్లతోపాటు కరోనా వల్ల డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కూడా విడుదలైన ‘ట్రోల్స్ వరల్డ్ టూర్’ వివాదం రేపింది. థియేటర్ల కంటే డిజిటల్‌గా ఇది బాగా కలెక్ట్ చేయడంతో అమెరికాలోని థియేటర్స్ వ్యవస్థ భగ్గుమంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన యూనివర్సల్ స్టూడియో వారి ఏ సినిమాలనూ విడుదల చేయబోమని అల్టిమేటం జారి చేసింది. దాంతో ఆ స్టూడియో నుంచి రాబోతున్న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’, ‘జూరాసిక్ వరల్డ్: డొమినియన్’ తదితర సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. స్పానిష్ ఫ్లూ– హాలీవుడ్ సరిగ్గా వందేళ్ల క్రితం 1919 నవంబర్‌లో స్పానిష్ ఫ్లూ ప్రారంభమైంది. 1921 ఫిబ్రవరి వరకూ ఉధృతంగా తన ప్రభావం చూపి వెళ్లిపోయింది. అప్పటికి హాలీవుడ్ పసిపాప. న్యూజెర్సీ నుంచి 1912లో వలస వచ్చి ప్రస్తుతం హాలీవుడ్ ఉన్న చోట స్థిరపడుతూ ఉంది. అప్పటికి అమెరికా వ్యాప్తంగా 20 వేల థియేటర్లలో మూకీ సినిమాలు ఆడుతున్నాయి. అటువంటి సమయంలో స్పానిష్ ఫ్లూ దెబ్బతో హాలీవుడ్లో భయానక వాతావరణం నెలకొంది. ఎవర్ని కదిపినా అప్పుడే ఫ్లూ వ్యాధి బారిన పడ్డ వ్యక్తో లేదా ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న వ్యక్తో. మొదట్లో స్పానిష్ ఫ్లూని తేలిగ్గా తీసుకున్నాయి చాలా స్టూడియోలు, థియేటర్లు. అప్పుడే షూటింగ్ లో పాల్గొన్న ప్రముఖ తారలు బ్రియాంట్ వాష్‌బర్న్, అన్నా క్యూ నీల్సన్లకు ఫ్లూ వచ్చింది. దాంతో హాలీవుడ్ కలవరపడిపోయింది. షూటింగ్స్ ఆపేశారు. స్పానిష్ ఫ్లూ సమయంలో తీసిన మూకీ సినిమా ‘డాడీ లాంగ్ లెగ్స్’లో జనం ముఖాలకు మాస్క్‌లు హాలీవుడ్ స్టార్స్ తమ నెల జీతాలు తగ్గించుకుని ఆ మొత్తంతో స్టూడియోల్లోకి ఇతర సిబ్బందికి డబ్బులిచ్చారు. మాట్నీ ఐడియల్గా పేరొందిన హెరాల్డ్ లాక్వుడ్ స్పానిష్ ఫ్లూతో చనిపోయాడు. అయితే స్టూడియోలు నెలల తరబడి మూసి ఉంచడానికి మొరాయించాయి. స్టూడియోల్లో వర్క్ చేసుకుంటామని, అందుకు అనుమతి ఇవ్వమని విన్నపాలు ప్రారంభించాయి. దాంతో షూటింగ్స్‌కు పర్మిషన్ వచ్చింది. పోలీసులు చాలా నిబంధనలు పెట్టారు. సినిమాల్లో గుంపులు ఉండే సీన్స్ ఉండకూడదు. కేవలం ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టుల మీదే సీన్స్ తీయాలి. అయితే దీనివల్ల మరికొందరు స్పానిష్ ఫ్లూ బారిన పడ్డారు. అప్పట్లో స్టూడియోలకి వచ్చేవాళ్ల మీద క్రిమి సంహారక మందులు జల్లేవాళ్లు. రెడ్‌క్రాస్‌కి చెందిన నర్స్ షూటింగ్‌కి వచ్చినవాళ్ల మీద పౌడర్ చల్లుతుండేది. 1921 ఫిబ్రవరి వరకూ ఈ అవస్థ తప్పలేదు. ప్రేక్షకుల మీద ప్రయోగాలు అమెరికాలో దాదాపు ఆరు వేల థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్లలో 40 వేల స్క్రీన్స్ ఉన్నాయి. వాటిలో అధిక శాతం రీగల్, ఎ.ఎమ్.సి, సినీమార్క్ అనే మూడు ప్రధాన సంస్థలవి. అమెరికాలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప మిగిలిన నిర్ణయాధికారాలు స్టేట్ గవర్నర్స్కే ఉంటాయి. థియేటర్లు ఓపెన్ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మొదటగా టెక్సాస్‌లో మే 8న కొన్ని థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే థియేటర్లలో సీటింగ్ కెపాసిటీ 25 శాతానికి తగ్గించేశారు. టికెట్ రేట్లలో బాగా డిస్కౌంట్ ఇచ్చారు. హాలీవుడ్‌ని ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’డిస్నీలాండ్ టెనెట్’ ఎయిర్ పోర్ట్‌లో ఎలా సెక్యూరిటీ చెక్ ఉంటుందో అంతకు మించి తనిఖీలు చేసి పంపిస్తున్నారు. అయితే పాత సినిమాలే ప్రదర్శిస్తున్నారు. ఒక్లహామా రాష్ట్రంలో థియేటర్లకి గ్లాస్ స్క్రీన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. జార్జియా రాష్ట్ర గవర్నర్ థియేటర్లను ఓపెన్ చేయమని ఆదేశాలిచ్చినా అక్కడ కొందరు థియేటర్ల యజమానులు అంగీకరించడం లేదు. అట్లాంటాలోని ప్లాజా థియేటర్ ఓనర్ కరోనా ఇంకా ఉండగా ఇలాంటి ప్రాణాంతకమైన పనులు చేయలేను అని తేల్చి చెప్పాడు. ‘ఈ పరిస్థితుల్లో ఆదాయం లేకపోగా శానిటైజేషన్ కోసం కొత్త పెట్టుబడి పెట్టాలి. పైగా సీటింగ్ కెపాసిటీ తగ్గించాలి. ఖర్చెక్కువ, రాబడి తక్కువ ఉండే ఇలాంటి పరిస్థితిలో థియేటర్లని మరికొంత కాలం మూసి ఉంచడం బెటర్’ అని మరో థియేటర్ ఓనర్ చెప్పాడు. కొందరు థియేటర్ల ఓనర్ల డిమాండ్ ఏమిటంటే కరోనా ఉండటం వల్ల ప్రేక్షకుల ఇళ్లకు నేరుగా క్యూబ్ సిస్టమ్ ద్వారా సినిమాలను విడుదల చేయాలి అయితే వచ్చిన దానిలో థియేటర్లకు కొంత వాటా ఇవ్వాలి అనేది. ఏమైనా జూలై నుంచి థియేటర్లు సంపూర్ణంగా తెరుచుకుంటాయని అక్కడి ప్రదర్శనారంగ దిగ్గజాలు భావిస్తున్నాయి. – తోట ప్రసాద్ (సినీ రచయిత) -
నిరుద్యోగులను వంచించిన బాబు సర్కార్
‘‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు.ప్రభుత్వ ఉద్యోగాల జాతర అన్నారు. ఏడాదికో డీఎస్సీ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారు. తీరా చూస్తే ఉద్యోగాల్లేవ్..ఇక రెండో రాగం నిరుద్యోగ భృతిని చంద్రబాబు నాలుగున్నరేళ్ల అనంతరం అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు ఆంక్షలతో కంటితుడుపుగా తెరపైకి తెచ్చారు. ఇలా మాయమాటలతో నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘనత సీఎం చంద్రబాబుది." సాక్షి, కాకినాడ సిటీ: 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ప్రకటించిన నిరుద్యోగ భృతి, అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్ల తర్వాత కార్యాచరణలోకి వచ్చింది. అదీ కూడా ప్రకటించిన మేరకు రూ.రెండు వేలు కాకుండా రూ. వెయ్యికే కుదించారు. రాష్ట్రంలో కోట్లలో నిరుద్యోగులుంటే సవాలక్ష ఆంక్షలు విధించి కేవలం పది లక్షల మందికే దానిని పరిమితం చేశారు. అదీ ప్రజాసాధికార సర్వేలో నమోదైతేనే అంటూ మరో మెలిక పెట్టారు. అడ్డంకులు సృష్టించి నిరుద్యోగ యువతను నిలువునా ముంచేశాడు. ఇదంతా చూడబోతే రైతు, డ్వాక్రా రుణమాఫీలను మించిన మాయగా ఉందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువనేస్తం పేరుతో నిరుద్యోగ యువతకు రిక్తహస్తం చూపారంటున్నారు. రూ.వెయ్యి చొప్పున ఇచ్చే భృతికి సవాలక్ష ఆంక్షలు పెట్టి అర్హుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపట్టారని మండిపడుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో ప్రజాసాధికార సర్వేలో నమోదైన నిరుద్యోగుల 3.79 లక్షల మంది ఉంటే కేవలం 17,085 మందికే నిరుద్యోగ భృతి ఇవ్వడంపై చంద్రబాబు ప్రభుత్వ తీరుపై యువత మండిపడుతోంది. నిరుద్యోగ యువత నిన్ను నమ్మంబాబూ అంటూ నినదిస్తుంది.. నాలుగేళ్లుగా నిరాశే టీడీపీ ప్రభుత్వంలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి నిరాశ చెందాం. ఆ ఎదురు చూపులకు ఫలితం లేకుండా పోయింది. నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు రాలేదు. దీనికి భిన్నంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా భర్తీ చేస్తామనడం అభినందనీయం. -అడ్డూరి అవ్యక్త, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు, జగన్నాథపురం కాకినాడ ఉద్యోగ విప్లవం రావాలి 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీ నమ్మి నిరుద్యోగులంతా మోసపోయాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఐదేళ్లుగా ఎదురు చూశాం. కానీ ఉద్యోగావకాశాలు కల్పించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగాల విప్లవం వైఎస్ జగన్‌తోనే సాధ్యం అని మేము నమ్ముతున్నాం. జె.రవితేజ, కాకినాడ నిలువునా ముంచిన ప్రభుత్వం నిరుద్యోగులను ప్రభుత్వం నిలువునా ముంచింది. 2014 ఎన్నికల్లో నిరుద్యోగులను అందలం ఎక్కిస్తాం అన్నట్టుగా ప్రచార ఆర్భాటాలు చేసి గెలిచిన తరువాత వారిని విస్మరించింది. కొందరికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులందరినీ ఆదుకున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. గీసాల వీరబాబు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు, కాకినాడ ఉద్యోగావకాశాలు కల్పించలేదు ఇంటికో ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న మా లాంటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించ లేదు. కనీసం నిరుద్యోగ భృతి కూడా మంజూరు చేయలేదు. నిరుద్యోగులకు ప్రభుత్వం చేసింది శూన్యం. కనీసం ఇప్పుడైనా యువతకు ఉపాధి అవకాశాలు చూపించే ప్రభుత్వం రావాలి. బి. లక్ష్మీప్రసన్న, కాకినాడ ఆశ నిరాశైంది నేను డిగ్రీ వరకు చదివాను. చదివిన చదువుకు బయట ఎలాంటి ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగి పోయాను. దీంతో ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి అందుతుందని ఆశలు పెట్టుకున్నా. కానీ ప్రభుత్వం పెట్టిన షరతుల కారణంగా భృతి అందలేదు. జే.పృథ్వీ, కాకినాడ బాబూ నిన్ను నమ్మం 2014 ఎన్నికల్లో రైతులను, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరిట ఏమార్చిన చంద్రబాబు నిరుద్యోగ యువతను నిరుద్యోగ భృతి పేరిట నిలువునా ముంచారు. డిగ్రీలు పూర్తి చేసిన నిరుద్యోగులు ఎంతో మంది ఐదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూశారు. వారందరికీ రిక్తహస్తమే చూపారు. దీనికి తోడు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులు ఇక బాబును నమ్మే ప్రసక్తే లేదు. – కొత్తపల్లి గిరీష్, కాకినాడ బురిడీ కొట్టించారు నిరుద్యోగ భృతి పేరిట చంద్రబాబు అందరినీ బురిడీ కొట్టించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీతో పాటు లక్షా యాభైవేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇది నిరుద్యోగులకు మేలు చేసే అంశం. – జువ్వల కర్నేష్, కరప ఎన్నికల కోసమే తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వక, మరోపక్క ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసింది. ఎన్నికలు వస్తుండడంతో ఆర్నెళ్ల నుంచి ఇస్తోంది. నిరుద్యోగ భృతికి సవాలక్ష నిబంధనలు పెట్టింది. ఎన్నో కొర్రీలు, మొదట రూ.1000 ఇచ్చి, ఇప్పుడు రూ.రెండు వేలు ఇస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసం చంద్రబాబు ఆడుతున్న డ్రామా. – కర్రి జగన్, కాకినాడ అంతా మోసం నేను బీటెక్ చదివాను. ఉద్యోగాలు కల్పిస్తానని చంద్రబాబు మాటిచ్చారు. ఒక వేళ ఉద్యోగం ఇవ్వకపోతే రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామంటే యువత అంతా చంద్రబాబుకు ఓటు వేశారు. కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయని నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అదీ కూడా కొందరికే ఇస్తున్నారు. ఇంజనీర్లు, పీజీలు, డిగ్రీలు చేసిన వారంతా కూలి పనులు చేసుకుంటున్నారు. ఇక చంద్రబాబును మ్మరు. బి.విజయ్, కాకినాడ -
మాయ మాటలు మాంత్రికుడు.. చంద్రాలు సారు....
సాక్షి, గుంటూరు: ‘నమ్మకం ఎరుగని నాయకుడు.. మాయ మాటలు చెప్పే మాంత్రికుడు. కుట్రలు చేసే కుతంత్రికుడు. ప్రశ్నిస్తే బెదిరించే పాలకుడు. అభివృద్ధికి మారుపేరు నేనంటూ చెప్పుకునే ఢాంబికుడు.. వెనుకబడిన వర్గాలను విస్మరించిన వంచకుడు’ అంటూ అలవికాని హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ నిన్నెలా నమ్మేదంటూ నిట్టూరుస్తున్నారు. హామీలు మరిచారు గత ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రచారానికి మిమ్మల్ని రానివ్వకుంటే మాదిగజాతి మీకు అండగా ఉండి స్వాగతించింది. మీ పాదయాత్రలో మాలమహానాడు కార్యకర్తలు రాళ్లురువ్వితే మాజాతి ముందుండి నడింపించింది. అదిలాబాద్ జిల్లా భైంసా ప్రాంతంలో జరిగిన ఉద్రిక్తతలో మా బిడ్డలు నలుగురు ప్రాణాలను అర్పించారు. ఆ సమయంలో చనిపోయిన వారికి ఒక్కక్కరికీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ‘నాకోసం ప్రాణాలర్పించిన ఆ నలుగురి సాక్షిగా చెబుతున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు అండగా నిలుస్తాను’ అని అన్నారు. గతంలో వర్గీకరణ చేసిందినేనే.. మళ్లీ అధికారంలోకి వచ్చాకా చేసేది కూడా నేనే అంటూ ఇచ్చిన హామీ ఏమైంది. నిన్ను నమ్మి ఏపీ రాష్ట్రంలోనూ పూర్తిగా మీకు సహకరించాం. విశాఖలో ముగిసిన పాదయాత్రలోనూ అవే మాటాలు చెప్పారు. ఐదేళ్ల పాలన ముగిసినా నేటికీ మీరిచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేదు...ఇంక నిన్ను నమ్మం బాబూ. – కోట సుబ్బుమాదిగ, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జీ, ఎమ్మార్పీస్ రుణమాఫీకి శఠగోపం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని నమ్మి డ్వాక్రా మహిళలు మోసపోయారు. మహిళా స్వయంసహాయక సంఘాలకు రుణమాఫీ హామీని నమ్మిన మహిళలు బ్యాంకులకు రుణాలు కట్టక డిఫాల్టర్లుగా మారారు. కొన్ని సంఘాల నిర్వీర్యమయ్యాయి. డ్వాక్రా మహిళలు బ్యాంకు అప్పులు తీర్చేందుకు నానా అవస్థలు పడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాకా రుణమాఫీ కాదు ప్రోత్సహకంగా ఒక్కొ సభ్యురాలికి రూ.10వేలు అందజేస్తామని మాటమార్చింది. 2015, 2016 సంవత్సరాల్లో రెండు విడతలుగా రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకొంది. తీరా ఎన్నికలు సమీపించడంతో అక్కచెల్లెమ్మలకు పసుపు కుంకుమ కింద ఇస్తున్నానంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి అవికూడా మూడు దఫాలుగా ఇస్తానంటూ ముందుస్తు చెక్కుల్ని పంపిణీ చేశారు. కేవలం ఎన్నికల సమయంలో ఆ డబ్బుల్ని తీసుకున్న మహిళల ఓట్లును కాజేసేందుకు ఇచ్చిన విషయం అంతా గ్రహించారు. అందుకే మహిళలెవ్వరు నిన్ను నమ్మరు బాబూ! – పిడతల ఝాన్సీ, ఎంపీటీసీ సభ్యురాలు యడ్లపాడు నిరుద్యోగ భృతి ఏదీ ? సీఆర్డీఏ పరిధిలో ఉన్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు కచ్చితంగా ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మంత్రులు హామీ ఇచ్చారు. అక్షరాస్యత తక్కువగా ఉన్న వారికి వారికిష్టమైన రంగాలేవో గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆయా విభాగాల్లోనే ఉపాధిని కల్పిస్తామంటే సంతోషించాం. ఎస్టీ కుటుంబానికి చెందిన మా ఇంట్లో నా అన్న శేఖర్‌నాయక్ డిగ్రీపూర్తి చేసి ఐదేళ్లు, నేను డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు గడిచాయి.నిబంధనల పేరిట అనర్హులగా ప్రకటించి భృతి ఇవ్వడం లేదు. నా తండ్రి మతనాయక్ నా చిన్నతనంలోనే మృతి చెందితే అమ్మ రమణిబాయి నిరక్ష్యరాస్యురాలైనా క్వారీల్లో కంకకొట్టి, వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ మా ఇద్దరిని చదివించింది. మాకు ఎలాంటి ఆసరా లేదు. దశాబ్దాల కిందట ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు కూలిపోయింది. కనీసం ఇంటి రుణమిచ్చి ప్రొత్సహించిన పాపాన పోలేదు. కనీసం నిరుద్యోగ భృతి వస్తే కుటుంబానికి కాస్తంత ఆసరా అవుతుందంటే దాన్ని ఇవ్వలేదు. అర్హత ఉండి భతి పొందలేని నిరుద్యోగులు నిన్ను ఎందుకు నమ్మాలి బాబూ? – వి వెంకటేశ్వరనాయక్, బోయపాలెం, యడ్లపాడు మండలం -
నిరుద్యోగ భృతి..ఒక ప్రచార ఆర్భాటం
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట..వచ్చిన తర్వాత మరో మాట చెబుతూ ముందుకు వెళుతోంది. నిరుద్యోగ భృతి విషయంలోనూ నాలుగున్నరేళ్లు గడిచే వరకు మొద్దునిద్రలో ఉన్న టీడీపీ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో మేలుకుంది. అదీ కూడా ఇంటింటికి ఉద్యోగం...లేకుంటే ప్రతి నిరుద్యోగికి రూ. 2 వేలు భృతి అంటూ దండోరా వేసిన టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం రూ. 1000కే పరిమితం చేసింది. అదీ కూడా ఆగస్టు నుంచి ఇచ్చేందుకు సన్నద్ధమని, తర్వాత అక్టోబరు 2కు కథ మారింది. ఎంత మారినా మళ్లీ సవాలక్ష ఆంక్షలతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. అక్టోబరు నుంచి అమలు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో జిల్లాలో వేల మంది దరఖాస్తు చేస్తే రకరకాల నిబంధనల పేరుతో అధికశాతం మందికి నిరాకరించి కొంతమందికే భృతి ఇస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. ఓట్లే లక్ష్యంగా... జిల్లాలో నిరుద్యోగ భృతికి సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నాలుగున్నరేళ్ల తర్వాత చివరి అంకంలో ఓట్లే లక్ష్యంగా అడుగులు వేసింది. ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్లో దాదాపు 7.15 లక్షల పైచిలుకు నమోదైనా ఓటీపీ జనరేట్ చేసిన వారు 5.73 లక్షల మంది ఉన్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తుకు ప్రయత్నించారు. అయితే నిబంధనల సాకుతో కోత వేశారు. కొందరికి ఓటీపీ రిజెక్ట్ అయితే, మరికొందరికి సక్సెస్ అయినా కూడా సమస్యలు వేధించాయి. సర్టిఫికెట్లు సమర్పించలేదనో లేదా వయస్సు దాటిపోయిందనో సాకులు చూపుతూ యువతకు భృతిని దూరం చేస్తున్నారు. జిల్లాలో 23 వేల మందికి భృతి ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభాన్ని అట్టహాసం చేసినా పరిస్థితి చూస్తే మాత్రం ఆర్భాటం మాత్రమే కనిపిస్తోంది. ఊహకు అందని స్థాయిలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించారు. వీరిని సమస్యలు వెంటాడాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 23 వేల మందిని మాత్రమే అర్హులుగా తేల్చి కేవలం ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున అందిస్తున్నారు. అదీ కూడా మే నెలలో కేబినెట్ సమావేశం జరిగినా.... జూన్ వరకు స్పష్టత ఇవ్వకపోవడం...తర్వాత మరికొన్ని రోజులకు జీఓ విడుదల చేసి....ఆగస్టు అనుకున్నా అప్పుడు కూడా అందించకుండా అక్టోబరు 2న అట్టహాసంగా ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇంటింటికి ఉద్యోగం...లేకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్నా తీరా చివరలో రూ. 1000 పేరుతో అందిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భృతి..భ్రాంతే!
నిరుద్యోగులను ప్రభుత్వం నిలువునా ముంచేసింది. నాలుగేళ్ల నుంచి భృతి ఇస్తామంటూ మోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం దగా చేస్తూనే ఉంది. ఎన్నికల సమయాన ఇచ్చిన హామీని తుంగలో తొక్కేసింది. నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన టీడీపీ ఇప్పుడు మాట మార్చింది. కేవలం రూ.1,000 మాత్రమే ఇస్తానని ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సవాలక్ష నిబంధనలు పెట్టి నిరుద్యోగులను మోసం చేస్తోంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉద్యోగానికి అర్హత వయసు 42 ఉంటే ఇప్పుడేమో 35 ఏళ్లలోపు వారికే భృతి ఇస్తామనడం దారుణమని జిల్లాలోని యువత ఆగ్రహం వ్య క్తం చేస్తోంది. నెల్లూరు(సెంట్రల్),(మినీబైపాస్): ఎన్నికల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగులకు వరాల జల్లులు కురిపించి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన విషయం తెలిసిందే. నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదు. యువతలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం, యువత ఓట్లు ఎన్నికల్లో కీలకం కావడంతో ఎన్నికల్ స్టంట్‌ను చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించింది. నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగ భృతి రూ.1,000 ఇస్తామని ప్రకటించడంతో యువతలోనే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా ఊసెత్తని వైనం 2014 ఎన్నికల్లో యువత ఓట్లు దండుకునేందుకు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి రూ.2 వేలు అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. అధికారం వచ్చిన వెంటనే ఎటువంటి షరతులు లేకుండా అమలు చేస్తానని చంద్రబాబు ప్రకటనలు గుప్పించారు. నాలుగేళ్లు గడిచాయి, నిరుద్యోగ భృతిపై నోరెత్తని ప్రభుత్వం, తాజాగా నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం గమనార్హం. భృతి పొందాలంటే డిగ్రీ, పాలిటెక్నిక్ చదివి ఉండాలని మెలిక పెట్టడం విశేషం. అది కూడా 22 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని షరతులు కూడా విధించింది. అధికారికంగా 2.74 లక్షల మంది నైపుణ్యాభివృద్ధి సంస్థ లెక్కల ప్రకారం డిగ్రీ చదివిన వారు ఈ ఏడాది 11,307 మంది, బీఈడీ చేసిన వారు 4,258 మంది, డిప్లొమా చేసిన వారు 4,859, ఐటీఐ చేసిన వారు 3,216, డీఈడీ చదివిన వారు 1,297 మంది మొత్తం ఏడాదికి 24,937 మంది ఉన్నారు. ఏడాదికి వీరు ఉంటే 35 ఏళ్ల లోపు వారంటే దాదాపుగా 11 సంత్సరాల క్రితం ఈ చదువు పూర్తి చేసి ఉండాలి. అంటే మొత్తం 2,74,307 మంది అధికారికంగా ఉన్నారు. ఇక పోతే ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోని వారు మరో రెండు లక్షల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 4,74,307 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఇంట్లో పరిస్థితులు అనుకూలించక పోవడంతో పదోతరగతి, లేక ఇంటర్‌లోనూ చదువుకు దూరంగా ఉండి 22 నుంచి 35 ఏళ్ల లోపు వారు నిరుద్యోగులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో అటువంటి యువకులు వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్లు కూడా గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతిని నమ్మి ఓట్లు వేశారు. కాని డిగ్రీ, పాలిటెక్నిక్ అంటూ మెలిక పెట్టడంతో వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓట్లు మాత్రం తమవి కావాలని, నిరుద్యోగ భృతి వచ్చే సమయానికి నిబంధనలు పెట్టటడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చదువుకోవాలంటే నాలుగుసంవత్సరాలుగా స్కాలర్షిప్పులు అందక పోవడంతో చదువుకు దూరం అయిన వారికి నిరుద్యోగ భృతి కోల్పోతున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగ భృతి తగ్గింపు నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.2 వేలు ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం రూ.వెయ్యి మాత్రమే చెల్లిస్తామని చెప్పడం గమనార్హం. నాలుగు సంవత్సరాలు మిన్నకుండిన చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఇచ్చే భృతి కూడా రూ.వెయ్యికి కుదించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్ ఇచ్చే విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం విశేషం . వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న యువత నిరుద్యోగ భృతి గురించి నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగిస్తుందో కూడా నమ్మలేకుండా ఉన్నామని పలువురు యువత అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇంత కాలం మౌనంగా ఉన్న సర్కార్ ఇంకెంత కాలం పెడుతుంతో అని అనుమానాలు కూడా యువతలో రాకపోలేదు. ఓట్లు దండుకునేందుకే ఈ విధంగా యువతకు గాలం వేస్తున్నారనే విమర్శలు రాక మానడం లేదు. జిల్లాలో అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇవ్వాల్సిన పింఛన్లు కూడా 70 శాతం ఇవ్వలేదు. కాని నిరుద్యోగ భృతి ఎంత మేర ఇస్తారనే అనుమానాలు యువతలో వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతోనే ఎన్నికలు వస్తుండటంతో యువత ఓట్లు కోసం ఈ విధంగా నిరుద్యోగ భృతి అంటూ ప్రకటన ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత కాలం మౌనంగా ఉండి ఇప్పుడు భృతి అంటే నమ్మేవారు లేరు. రాజకీయాల కోసం యువతకు గాలం వేస్తున్నట్లు అర్థం అవుతోంది. –నవీన్, ఎంబీఏ -
నిరుద్యోగుల చెవిలో పూలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): భృతి విషయంలో నిరుద్యోగుల చెవిలో సీఎం చంద్రబాబునాయుడు పూలు పెట్టారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నెలకు రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని..ఇప్పుడు ఒక్క వేలు చూపుతూ రూ.1000 ఇస్తానని, దానికి ముఖ్యమంత్రి యువనేస్తం అని పేరు పెట్టుకోవడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో దాచుకున్న వేలు నిరుద్యోగులు కట్ చేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో 1.70 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే 12 లక్షల మందికే భృతి వచ్చేలా మంత్రి నారా లోకేష్‌బాబు 600 గంటలు కష్టపడి నిబంధనలను రూపొందించారన్నారు. చంద్రబాబునాయుడు..లోకేష్‌కు మాత్రమే మంత్రి పదవి ఉద్యోగాన్ని ఇచ్చారని, యువతీ, యువకులను మాత్రం మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి నిబంధనలు సడలించకపోతే రాష్ట్రవ్యాప్తంగా యువతీయువకులతో కలసి పోరాటాలకు పిలుపునిస్తామన్నారు. ఆ నిధులు ఎప్పుడిస్తారు? రైతు రుణమాఫీకి రూ.11,500 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, అక్క చెల్లెమ్మలకు రూ. 4 వేల కోట్ల నిధులను జమ చేయాల్సి ఉందని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మరో ఐదారు నెలల్లో ప్రభుత్వ సమయం ముగుస్తున్న నేపథ్యంలో ఆ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారికి పింఛన్ ఇస్తామంటే టీడీపీ నాయకులు అవహేళన చేశారని, అయితే సీఎం చంద్రబాబునాయుడు మాత్రం డప్పు కళాకారులకు, చెప్పులు కుట్టుకునే వారికి 40 ఏళ్లకే రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పడం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలో పయనించడం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీరు–చెట్టు పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి 1.49 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో 720 భారీ పరిశ్రమలు, 2.27 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పడం దారుణమన్నారు. ఇలా గొప్పలు చెప్పుకుంటే పోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక హోదాను ఇస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, టీడీపీ నాయకులకు అవినీతి సొమ్ముతో పొట్టలు వచ్చాయన్నారు. కాపులను మోసగించిన చంద్రబాబు కాపులను బీసీల్లోకి చేరుస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని ఎద్దేశా చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసే పనులనే చెబుతారని, ఆయన మాటే గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పారు. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం నుంచి తిరిగి వచ్చినా చంద్రబాబు స్పందించడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎన్నికలంటే టీడీపీకి భయం ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ..తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్నికలంటే భయం అని తేలిపోయిందన్నారు. అందులో భాగంగానే సర్పంచ్ల స్థానంలో ప్రత్యేకాధికారులను నియమించిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల్లో అడ్డగోలుగా గెలిచేందుకు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను టీడీపీ తీసివేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల ఓటర్లను తొలగించడం దారుణమన్నారు. ప్రతి ఒక్క పౌరుడు తమ ఒటు హక్కును పొందాలని సూచించారు. కార్యక్రమంలో కోడుమూరు, కర్నూలు సమన్వకర్తలు మురళీకృష్ణ, హఫీజ్‌ఖాన్, నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, అబ్దుల్ రెహమాన్, పర్ల శ్రీధర్‌రెడ్డి, సత్యంయాదవ్, తోట కృష్ణారెడ్డి, ఆది మోహన్‌రెడ్డి, కరుణాకరరెడ్డి, భాస్కరరెడ్డి, ఆసిఫ్, మహేశ్వరరెడ్డి, శీను తదితరులు పాల్గొన్నారు. -
భృతి.. భ్రమే..!
టీడీపీ సర్కార్ నిరుద్యోగభృతిని గాలికొదిలేసింది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటి. ఈ ఏడాది చివర్లో.. లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో టీడీపీ కొత్త నాటకానికి తెరతీసింది. నిరుద్యోగ భృతి హామీ అమలుకు అడుగులు వేసింది. అయితే కొర్రీలు పెట్టడం గమనార్హం ఎర్రగుంట్ల (వైఎస్సార్ కడప): ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించింది. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేనివి. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టీడీపీ సర్కారు కొత్త డ్రామాకు తెరలేపుతోంది. 2014 ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ ఉద్యోగం, లేని పక్షంలో రూ.2వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఆశతో టీడీపీకి ఓటేశారు. అధికారం చేపట్టాక మొండిచేయి చూపింది. అదే హామీని మళ్లీ అమలు చేస్తామని చెబుతుండటంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రూ.2వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు సవాలక్ష కొర్రీలు పెట్టడమే కాకుండా రూ.1000కి కుదించడం.. 35 ఏళ్లలోపు వారికి మాత్రమే ఇస్తామని చెబుతుండడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. గ్రామాల్లో ప్రజాసాధికార సర్వేల్లో పేర్లు నమోదై ఉండాలని షరతులు విధించడంతో యువత నుంచి నిరాశ వ్యక్తమవుతోంది. ఆశ..అడియాస.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు 25 వేల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన వారు సుమారు 15 వేల మందిపైనే ఉన్నారు. వీరంతా భృతి అందుతుందని ఆశించి భంగపడినవారే. భర్తీకానీ పోస్టులు... వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా... వాటిని భర్తీ చేయడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు డీఎస్సీ పేరిట రెండు సార్లు టెట్ నిర్వహించింది. అయితే ఇప్పుడు బీఈడి అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హులని చెప్పడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఉద్యోగావకాశాలు కల్పించకుండా అబద్ధాలతో కాలం వెళ్లబుచ్చుతున్న సీఎం చంద్రబాబు నయవంచనకు గురి చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు సబ్సిడీ రుణాలు, పథకాలను కూడా తమ అనుచరలకే ఇప్పించుకుంటూ వేలమంది నిరుద్యోగులు పొట్టకొడుతున్నారని అంటున్నారు. భృతిని జన్మభూమి కమిటీ సభ్యులు, అధికార పార్టీ నాయకుల సమక్షంలో కొందరికే ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. నాలుగున్నరేళ్లకు గుర్తొచ్చిందా..? అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి కింద రూ.2వేలు ఇస్తామన్నారు. నాలుగున్నరేళ్లు ఏమీ పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీడీపీకి భయం పుట్టింది. అందుకే ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. అది చెప్పి కూడా రెండు నెలలు అయింది. ఇంత వరకు ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ 600 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. – మూలె హర్షవర్థన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత, ఎర్రగుంట్ల మండలం -
చంద్రబాబు పాలనలో నిరుద్యోగులకు మొండిచెయ్యి
ఎంవీపీకాలనీ: హామీలు, అంకెల గారడీలు తప్పితే ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగుల సం క్షేమం కోసం చేసిందేమిలేదని ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మర్రివేముల శ్రీనివాస్ ఆరోపించారు. నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపిస్తున్న టీడీపీ తీరును బుధవారం ఎంవీపీలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఖండించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఎన్నో వరాలు కురిపించాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించగా, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఎన్నికల్లో లబ్ధి పొందాయన్నారు. అయితే నేటికి ఆ హామీలు నిరుద్యోగులకు అందని దాక్షగానే మిగిలిపోయాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. టీడీపీ తన పబ్బం గడుపుకోవడానికి నిరుద్యోగభృతి అంశాన్ని తెరపైకి తెచ్చిందని.. నాలుగున్నరేళ్లు అవుతున్నా ఈ హామీని అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–4 ఉద్యోగాల భర్తీతోపాటు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. పీహెచ్డీ ప్రవేశాల కోసం ఏయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్ష దరఖాస్తు రుసుం పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. సమితి శ్రీకాకుళం, విజయనగరం జిల్లా అధ్యక్షులు టి.సూర్యం, గౌరీశంకర్, గుంటూరు జిల్లా నాయకులు దాసు, కోటి పాల్గొన్నారు. -
ఉద్యోగాలు భర్తీ చేయకపోతే అసెంబ్లీ ముట్టడి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పన్నెండు వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని విజయవాడలో నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన జాబు లేదని ఐక్యవేదిక నేతలు విమర్శించారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు భృతి కూడా చెల్లిందలేదన్నారు. గ్రూప్ 1, 2 ఉద్యోగాలకు పాత పద్దతిలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని, డీఎస్సీ పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని ఐక్యవేదిక నేతలు ప్రకటించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు యువత ఓట్లను దండుకున్నారని పేర్కొన్నారు. ఖాళీలను ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
రూ. 3000 నిరుద్యోగ భృతి : ఉత్తమ్
సాక్షి, మణుగూరు : తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతినిస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీయిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. వరి మొక్క జొన్నలు, సజ్జలు, రెండువేల రూపాయల మద్ధతు ధర ఇస్తామన్నారు. పత్తికి రూ. 6000, మిర్చికి రూ. 10 వేలకు పైగా మద్దతు ధరను కల్పిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీయిచ్చారు. -
హామీల మాఫీపై మహాగ్రహం
(సాక్షి ప్రతినిధి, ఏలూరు): చంద్రబాబు రుణవంచనపై రైతన్న తిరగబడ్డాడు. నారా వారి నయామోసంపై మహిళాలోకం గర్జించింది. ఉద్యోగాలిప్పిస్తామని, నిరుద్యోగభృతి కల్పిస్తామని చెప్పిన మాయమాటలపై యువత నిప్పులు చెరిగింది. ఎడాపెడా పింఛన్ల కోతపై వృద్ధులు, వికలాంగులు కదం తొక్కారు. అధికారం దన్నుతో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడుతున్న వేధింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కన్నెర్ర చేశాయి. వెరసి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాకు వేలాదిగా ప్రజ పోటెత్తింది. ఆరునెలల తెలుగుదేశం ప్రభుత్వ విధానాలకు, రుణమాఫీపై రోజుకో మాట-పూటకో ప్రకటనతో రైతులను మోసం చేస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా విజయవంతమైంది. శుక్రవారం ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ధర్నా చేపట్టాలని పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. ఆ మేరకు సరిగ్గా పదిగంటలకే కలెక్టరేట్ వద్ద ధర్నా మొదలు పెట్టగా, మధ్యాహ్నం రెండుగంటల వరకు ప్రజాందోళన ఏకబిగిన కొనసాగింది. ధర్నా ప్రారంభానికి ముందే చుట్టుపక్కల ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు ధర్నా జరిగే ప్రాంతానికి నలువైపులా బ్యారికేడ్లు, ఇనుపముళ్ల కంచెలు ఏర్పాటు చేసినా, ఇవేమీ జనం రాకకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. చివరికి ధర్నా ముగిసే సమయం మధ్యాహ్నానికి కూడా నరసాపురం నుంచి పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు నాయకత్వంలో ఏలూరు తరలివచ్చిన వేలాదిమంది ఫైర్‌స్టేషన్ సెంటర్లోని మహానేత వైఎస్ విగ్రహం మొదలుకుని ధర్నా స్థలి వరకు జగన్నినాదాలు చేస్తూ నడుచుకుంటూ వచ్చారు. అంచనాలకు మించి.. స్వచ్ఛందంగా పార్టీ సీనియర్ నేతలు, పోలీసు అధికారుల అంచనాలను మించి జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది జనం కదలివచ్చారు. మెట్టలో ఆకుమడులు, డెల్టాలో కోతలతో జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత నేపథ్యంలో రైతులు ఏ మేరకు ఏలూరు తరలివస్తారోనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ రైతన్నలు పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా కదలివచ్చారు. తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నరసాపురం, పోలవరం.. ఇలా ప్రాంతాలకు అతీతంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన కర్షకులు, మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారు. బాబు ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, ఆళ్ల నాని, కొత్తపల్లి సుబ్బారాయుడు, తెర్లాం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వంకా రవీంద్ర, కారుమూరి నాగేశ్వరరావు, బి.వి.ఆర్,చౌదరి, జిఎస్.రావు, ముదునూరి ప్రసాదరాజు తదితర నేతలు విరుచుకుపడినప్పుడు జనం చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు. ఇప్పటి వరకు జై జగన్ నినాదాలు ఎక్కువగా యువత నుంచే వినిపించేవి..ఇప్పుడు రైతాంగం నుంచి కూడా జగన్నినాదాలు మిన్నంటడం... ఆ వర్గానికి వైఎస్ జగన్ పట్ల నమ్మకాన్ని తెలియజేస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. పశ్చిమ నుంచే మొదలైన తిరుగుబాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను టీడీపీ, మిత్రపక్ష బీజేపీ గెలుచుకోవడంతో అధికార పక్షానికి పెట్టని కోటగా భావిస్తున్న పశ్చిమ జిల్లా నుంచే ప్రజల నుంచి బాబు సర్కారుపై తిరుగుబాటు తీవ్రస్థాయిలో మొదలైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మహాధర్నా వంటి భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆళ్ల నాని తన పట్టు నిరూపించుకున్నారు. ఇక జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ కన్వీనర్లు, పార్టీ సీనియర్ నాయకులు రావడంతో పాటు ఒకే వేదికపై కూర్చొని సంఘీభావం ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వ ఆగడాలపై రాజీలేని పోరాటంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతర ఉద్యమాలకు శ్రీకారం చుడతామని సభా వేదిక నుంచి పిలుపునివ్వడం పార్టీ శ్రేణులకు కొత్త ఊపునిచ్చింది. మొత్తంగా మహాధర్నా విజయవంతం జిల్లాలో పార్టీ సంస్థాగతంగా బలోపేతమవుతోందన్న విషయాన్ని స్పష్టం చేసిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.