వాస్తు పేరుతో కేసీఆర్ వేలకోట్లు వృథా
యాదాద్రి: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. యాదాద్రిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాధనంతో కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతోందని ఆరోపించారు. వాస్తు పేరుతో కేసీఆర్ వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేఖ పాలనపై త్వరలో పోరాటం ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి తెలిపారు.