ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలుగువారి మృతి | Three Indian People Died In Australia Beach | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 18 2018 1:23 PM | Last Updated on Tue, Dec 18 2018 1:47 PM

Three Indian People Died In Australia Beach - Sakshi

గౌసుద్దీన్‌, జునేద్‌, రాహత్‌

సాక్షి, నల్గొండ: ఆస్ట్రేలియాలోని మోనో బీచ్‌లో గల్లంతైన ముగ్గురు తెలుగు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు నల్గొండ జిల్లాలోని మన్యం చెల్కకు చెందిన గౌసుద్దీన్‌(45), అతని అల్లుడు జునేద్‌(28)లు కాగా, మరో వ్యక్తి హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతానికి చెందిన రాహత్‌(35)లు ఉన్నారు. వీరిలో గౌసుద్దీన్‌, రాహత్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. జునేద్‌ మృతదేహం కోసం ఆస్ట్రేలియా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విదేశాల్లో మృతి చెందడంతో మన్యం చెల్కలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌసుద్దీన్‌ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. ఆస్ట్రేలియాలో చనిపోయిన వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. వీలైనంత త్వరగా మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement