telugu people died
-
ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలుగువారి మృతి
సాక్షి, నల్గొండ: ఆస్ట్రేలియాలోని మోనో బీచ్లో గల్లంతైన ముగ్గురు తెలుగు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు నల్గొండ జిల్లాలోని మన్యం చెల్కకు చెందిన గౌసుద్దీన్(45), అతని అల్లుడు జునేద్(28)లు కాగా, మరో వ్యక్తి హైదరాబాద్ బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన రాహత్(35)లు ఉన్నారు. వీరిలో గౌసుద్దీన్, రాహత్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. జునేద్ మృతదేహం కోసం ఆస్ట్రేలియా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు విదేశాల్లో మృతి చెందడంతో మన్యం చెల్కలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గౌసుద్దీన్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ఆస్ట్రేలియాలో చనిపోయిన వారికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. వీలైనంత త్వరగా మృతదేహాలను భారత్కు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. -
చెన్నైలో గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి
-
గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి
చెన్నైలో 11 అంతస్తుల భవనం కుప్పకూలి 61 మంది మృతి చెందిన ఘటన మన మనోఫలకంపై నుంచి చెరగకమందే.... తిరువళ్లూరు జిల్లాలోని పొన్నేరి సమీపంలోని ఉపరపలియమ్ లోని గోడౌన్ గోడ కూలింది. ఆ ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికిచేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద నుంచి ఒక బాలుడిని రక్షించారు. కొంత మంది కూలీలు గోడౌన్ గోడను ఆసరాగా చేసుకుని గుడిసెలు నిర్మించుకున్నారు. ఆ గుడిసెలపై ఆ గోడౌన్ గోడ కూలింది. అయితే బాధితులంతా ఉత్తరాంధ్ర, తమిళనాడు సరిహద్దులోని జిల్లాలకు చెందిన తెలుగువారిగా గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వర్షం వల్ల గోడౌన్ కు చెందిన 20 అడుగుల గోడ కూలిందని అధికారులు తెలిపారు.