సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం ఆయన జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని ఇటుకలపాడులో పర్యటించారు. అయితే..
ఈ పర్యటనలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని హాజరైన కోమటిరెడ్డి ప్రసంగించారు. రోడ్లు బాగోలేవని, ఇటుకలపాడుకు రావడానికి మూడు గంటలకు పైగా సమయం పట్టిందని.. సీఎం కేసీఆర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. అయితే..
ఆ వ్యాఖ్యలు అక్కడే ఉన్న కొందరు బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. బొడ్రాయి ప్రతిష్టాపనకు వచ్చి రాజకీయం మాట్లాడుతున్నారంటూ అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనపై కుర్చీలు, కర్రలు విసిరి దాడి చేసేందుకు యత్నించారు బీఆర్‌ఎస్ కార్యకర్తలు. అయితే దాడి నుంచి ఆయన తప్పించున్నారు. ఈ క్రమంలో..
పోటీగా రంగంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్‌ఎస్ కార్యకర్తలతో తోపులాటకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment