హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీలో వలసలు నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో కలకలం రేపింది. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన మదర్ డైయిరీ చైర్మన్గా కూడా ఉన్నారు. గుత్తా జితేందర్ రెడ్డితో పాటు పలువురు మదర్ డైయిరీ డైరెక్టర్లు కూడా పార్టీలో చేరారు. వారందరికీ కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు డీసీసీబీ ఛైర్మన్ పాండురంగారావుతో పాటు ఇతర ముఖ్యనేతలు గులాబీ కండువా కప్పుకోనున్నారు. వీరంతా ఈనెల 8వ తేదీన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజ్గోపాల్ ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. కాగా సమావేశం అనంతరం తమ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎంపీ సోదరుడు
Published Sat, Jun 6 2015 1:14 PM | Last Updated on Fri, Oct 19 2018 7:57 PM
Advertisement
Advertisement