సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకులు పెదవి విరిచారు. బడ్జెట్ తమను నిరుత్సాహ పరిచిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తాము భావించడం లేదని తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దగా కేటాయింపులు జరగలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ పెంపు సామాన్యులపై భారంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల ఆదాయం రెండింతలు చేస్తామనడం తప్ప అందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సొంత డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నం చేశారని కోమటిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment