ఆయన రెడీ అంటే నేను సై: కోమటిరెడ్డి | congress mla Komatireddy venkat reddy respond on gutta sukhendar reddy challenge | Sakshi
Sakshi News home page

ఆయన రెడీ అంటే నేను సై: కోమటిరెడ్డి

Published Mon, Oct 17 2016 2:19 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఆయన రెడీ అంటే నేను సై: కోమటిరెడ్డి - Sakshi

ఆయన రెడీ అంటే నేను సై: కోమటిరెడ్డి

నల్లగొండ : ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధంతో పాటు సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి విసిరిన సవాల్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.  దమ్ముంటే గుత్తా ఎంపీ పదవికి రాజీనామా చేసి తనపై గెలవాలని కోమటిరెడ్డి సవాల్ చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డిలా పూటకో పార్టీ మారే అలవాటు తనకు లేదని ఆయన ఎద్దేవా చేశారు.

ఎంపీ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తే పోటీ చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అలాగే పార్టీ మారిన మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించాలన్నారు. అప్పుడు ఎవరి బలం ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 2014లో ఓడిపోయి...పైగా తనపై సవాల్ విసరడం హాస్యాస్పదమన్నారు. కాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే.. తాను కూడా  ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement