‘మండల వ్యవస్థ తెచ్చి ఎన్టీఆర్ ఓడిపోలేదా?’
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినందుకే తాము గెలుస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంబరపడిపోతున్నారనీ, అప్పట్లో మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన ఎన్టీరామారావు ఓడిపోయిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆయన అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ఇతరపార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినవారితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో గెలవాలని సవాల్ చేశారు.
ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే 2019 ఎన్నికల్లో పోటీచేయబోనని కోమటిరెడ్డి సవాల్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే కేవలం మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లు మాత్రమే గెలుస్తారని చెప్పారు