
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి దేవాలయ శిలలపై కేసీఆర్, కారు గుర్తు చిత్రాలను చెక్కించుకోవడం సిగ్గుచేటంటూ భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నాడు దేశాన్ని పరిపాలించిన రాజులు కూడా తమ చిత్రాలను ఎక్కడా చెక్కించుకోలేదని విమర్శించారు. ప్రజలు, భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బతీశారన్నారు. చెక్కిన గుర్తులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఈ చర్యను ధార్మిక సంస్థల అధిపతులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment