యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ | KCR Family To Visit Yadadri Friday | Sakshi
Sakshi News home page

కిలో బంగారం కానుకగా సమర్పించనున్న సీఎం దంపతులు

Published Fri, Sep 30 2022 3:39 AM | Last Updated on Fri, Sep 30 2022 3:39 AM

KCR Family To Visit Yadadri Friday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయా న్ని సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరి 11.30 గంటలకు యాదాద్రి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కుటుంబసమేతంగా ప్రత్యే క పూజలు నిర్వహించడంతోపాటు కిలో బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కు తీర్చు కోనున్నారు.

ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధి పనులపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులతో సమీక్షిస్తారు. కేసీఆర్‌ అక్కడే భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌కు తిరిగి చేరుకోనున్నారు.

రేపు వరంగల్‌కు...: సీఎం కేసీఆర్‌ శనివారం వరంగల్‌ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ వరంగల్‌లో నిర్మించిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆయన వరంగల్‌ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించే అవకాశముంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement