
లక్ష్మణ రేఖ దాటిన కోమటిరెడ్డి: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: గడ్డాలు, మీసాలు పెంచితే పార్టీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే బోగస్ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధానకార్యదర్శి దాసోజు శ్రవణ్ తదితరులు శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లం ఘించేలా మాట్లాడారని, పార్టీ లక్ష్మణ రేఖను దాటి రెండోసారి మాట్లాడారని మల్లు రవి అన్నారు. నాయకులు ఇష్టారీతిన మాట్లాడటం సరైందికాదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
రీడిజైన్ పేరుతో టీఆర్‌ఎస్ అక్రమాలు: వంశీచంద్
కాగా, ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి విలేకరుల సమావేశంలో విమర్శించారు.