రైతు కుటుంబానికి రూ.75వేల సాయం | mekapati rajamohanreddy, ramarao donates rs 75000 for farmer suicide family | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబానికి రూ.75వేల సాయం

Published Wed, Oct 7 2015 9:09 PM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

mekapati rajamohanreddy, ramarao donates rs 75000 for farmer suicide family

గుడ్లూరు(ప్రకాశం): ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చించురెడ్డిపాలెం గ్రామంలో వారం క్రితం బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే పోతుల రామారావు రూ.75వేల సాయం అందజేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రైతు బోయిన ఎలీషా ఈ నెల 2వ తేదీన అప్పుల బాధతో ప్రాణాలు తీసుకున్నాడు.

బుధవారం రాత్రి ఆ కుటుంబాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఎంపీ మేకపాటి రూ.50 వేలు, ఎమ్మెల్యే రామారావు రూ.25వేలను సాయంగా అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement