రామారావు లీలలెన్నో..
► అవినీతి తహసీల్దార్‌పై మరిన్ని ఫిర్యాదులు
► ఏసీబీ డీఎస్పీని కలిసిన భీమిలి వాసులు
► కలెక్టర్ సహా అధికారులకు తెలిపినా స్పందన లేదని ఆవేదన
సీతమ్మధార (విశాఖ ఉత్తర) : ఏసీబీ దాడుల్లో అడ్డంగా పట్టుబడ్డ భీమిలి తహసీల్దార్ రామారావు చేసిన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రామారావు అరెస్టయిన విషయం తెలుసుకుని భీమిలిలో అతడు సాగించిన అక్రమాలకు సంబంధించిన సమాచారంతో పట్టణానికి చెందిన బాధితులు ముందుకు వస్తున్నారు. భీమిలి, తగరపువలస ప్రాంతాలకు చెందిన కొందరు సీతమ్మధారలోని ఏసీబీ కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం వచ్చి డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ను కలిశారు. మాజీ సైనికుడు చిన్నిపిల్లి శ్రీనివాసరెడ్డి, ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న వానపల్లి గోవింద్‌తో పాటు మొత్తం ఐదుగురు డీఎస్పీ వద్ద గోడు వినిపించుకున్నారు. భూమికి సంబంధించిన పత్రాలు చూపించి వారికి జరిగిన అన్యాయయాన్ని వివరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్, గోవింద్, మోహనరావు, గురుమూర్తి, అప్పలస్వామి మాట్లాడుతూ సైన్యం నుంచి పదవీ విరమణ పొందిన కొందరు చిట్టివలస సర్వే నెంబర్ 41/2లో లక్షలు వెచ్చించి స్థలాలు కొన్నట్టు తెలిపారు. వీటికి స్పష్టవైున హదు్దలు ఉన్నా, ఎటువంటి ఫీల్డ్ సర్వే లేకుండా ఖాళీ స్థలమని చూపి, రెవెన్యూ రికారు్డలు తారుమారు చేసి కొందరు వ్యకు్తలు తమదిగా చూపారని తెలిపారు. సుమారు 120 ఏళ్ల క్రితమే హకు్కలు లభించినట్టు చూపారన్నారు. ఈ స్థలాలకు భీమిలి పట్టణంలో చేయాల్సిన రిజిస్ట్రేషన్ ను ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారని, తహసీల్దార్ అండతో ఇది జరిగిందని తెలిపారు. ఈ అవినీతిపై కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలియజేశారు. అయితే దీనిపై ఫిర్యాదు ఇస్తే చర్యలు చేపడతామని డీఎస్పీ తెలిపారు.
బాగా జరిగింది..
తహశీల్దార్ రామారావు అవినీతిపై ఏసీబీ అధికారులు దాడులు చేసి అతడిని అరెస్టు చేయడంపై చాలామంది బాధితులు హర్షం వ్యక్తం చేశారు. రూరల్‌కు, మండలానికి సంబంధించి మరికొందరు సోమవారం ఏసీబీ కార్యాలయానికి రానున్నారని తెలిపారు.
చర్యలు ఎందుకు లేవు?
అక్రమాలకు పాల్పడ్డ రామారావుపై ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించలేదని పలువురు బాధితులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రామారావును ఎందుకు ఇంతగా ఉపేక్షించారు? మంత్రి అండదండలు ఉన్నాయా?లేక వేరెవరైనా ఉన్నారా? అని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారాలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.