సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ వరించింది. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) అధ్యక్షుడు బిశ్వభూషణ్ హరిచందన్ ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఏపీలోని విజయనగరం జిల్లా కురుపం గ్రామంలో మెడికల్ క్యాంపులో కావాల్సిన వనరులను సమకూర్చినందుకు, అలాగే చిత్తూరులో బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టినందుకు గాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు లభించింది. కాగా, పవర్‌గ్రిడ్ ఈ రెడ్‌క్రాస్ గోల్డ్ మెడల్‌ను అందుకోవడం ఇది మూడోసారి. పవర్‌గ్రిడ్ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అవార్డును అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment