కరోన వైరస్ నివారణపై రాష్ట్రపతి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గవర్నర్ హరిచందన్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ సర్వే నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు.
రెడ్‌క్రాస్ కీలక పాత్ర పోషించాలి
కరోనా మహమ్మారిని నివారించడంలో రెడ్‌క్రాస్ సొసైటీ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూ షణ్ హరిచందన్ అన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులతో గవర్నర్ రాజ్‌భవన్‌లో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్‌ను కట్టడి చేయడంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిం చాలన్నారు. ప్రజలు చేయాల్సినవి, చేయకూడనివి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. పేదలు, నిరాశ్రయులకు ఆహారం సరఫరా చేయాలని గవర్నర్ చెప్పారు. రాష్ట్ర రెడ్‌క్రాస్ చైర్మన్ డా.శ్రీధర్‌రెడ్డి రెడ్‌క్రాస్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలను గవర్నర్‌కు వివరించారు. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చామన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ టోల్ ఫ్రీ నంబరు: 18004251234
Comments
Please login to add a commentAdd a comment