సమాచార హక్కు కన్వీనర్ అనుమానాస్పద మృతి
Published Sun, Feb 19 2017 1:46 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు: సమాచార హక్కు నెల్లూరు కన్వీనర్ భద్రయ్య(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన భద్రయ్య.. పలువురిచే రక్త దానం చేయించారు. రెడ్ క్రాస్ రక్తనిధి విభాగంలో అక్రమాలపై ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా దానిపై విచారణ జరుగుతోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన భద్రయ్య తిరిగి రాలేదు.
అర్ధరాత్రి దాటాక నెల్లూరు-మాగుంట రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహం పడి ఉంది. గొంతు కోసినట్లు కనిపిస్తుండగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఉస్మాన్ సాహెబ్‌పేటలో నివసించే ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భద్రయ్య మృతిపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొందరు వ్యక్తులు ఈయనను తరుముకుంటూ వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
Advertisement
Advertisement