suspicous death
-
వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు.. అసలేం జరిగింది!
ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నుదురు, ముఖంపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నైలోని ఆమె ఇంటిని స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పని మనిషి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె ఇంటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరీశీలిస్తున్నారు. ఆమెది సాధారణ మృతి కాదని, ఎవరో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కాలింగ్ బెల్ కొట్టినా తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి లోపలికి వెళ్లినట్లు పనిమనిషి పోలీసులకు తెలిపింది. ఇటీవలే ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. -
సమాచార హక్కు కన్వీనర్ అనుమానాస్పద మృతి
నెల్లూరు: సమాచార హక్కు నెల్లూరు కన్వీనర్ భద్రయ్య(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన భద్రయ్య.. పలువురిచే రక్త దానం చేయించారు. రెడ్ క్రాస్ రక్తనిధి విభాగంలో అక్రమాలపై ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా దానిపై విచారణ జరుగుతోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన భద్రయ్య తిరిగి రాలేదు. అర్ధరాత్రి దాటాక నెల్లూరు-మాగుంట రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహం పడి ఉంది. గొంతు కోసినట్లు కనిపిస్తుండగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఉస్మాన్ సాహెబ్పేటలో నివసించే ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భద్రయ్య మృతిపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొందరు వ్యక్తులు ఈయనను తరుముకుంటూ వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.