పుష్కర సేవలకు ‘రెడ్‌క్రాస్’ సిద్ధం
Published Wed, Aug 10 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
గుంటూరు ఈస్ట్ : కృష్ణా పుష్కరాల్లో సేవలు అందించేందుకు రెడ్‌క్రాస్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ గౌరవ చైర్మన్, విశ్రాంత జస్టిస్ అంబటి లక్ష్మణరావు తెలిపారు. హిందూ కళాశాల ఏడీ హాల్‌లో రెడ్ క్రాస్ కార్యకర్తలకు పుష్కర సేవా కార్యక్రమాల సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలో అమరావతి, సీతానగరంలలో క్యాంపులు నిర్వహించి 24 గంటలు సేవలందిస్తారని చెప్పారు. పెనుమూడి వారధి, విజయపురి సౌత్‌లలోను పుష్కర సేవలు అందిస్తారన్నారు. జిల్లా కార్యదర్శి జీవీఎన్ బాబు మాట్లాడుతూ కార్యకర్తలు పుష్కర యాత్రికులతో సేవాభావంతో మెలగాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 1,500 మంది కార్యకర్తలు 12 రోజులు 24 గంటలు సేవలందిస్తారని చెప్పారు. తొలుత కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర సభ్యులు ఎంవీ ఉదయ్‌కుమార్, జిల్లా చైర్మన్ వడ్లమాను రవి, హిందూ కళాశాల ప్రిన్సిపాల్ కనకదుర్గ పాల్గొన్నారు.
Advertisement
Advertisement