యువతకు వైఎస్ జగన్ స్ఫూర్తి
నాయకత్వ లక్షణాల్లో నేటి యువతకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తి అని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి చెప్పారు.
కర్నూలు(హాస్పిటల్): నాయకత్వ లక్షణాల్లో నేటి యువతకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తి అని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 21న వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. నగరంలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధిలో సొసైటీ చైర్మన్ జి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం 50 మందికి పైగా యువకులు రక్తనిధికి చేరి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని కళాశాల విద్యార్థి వినోద్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రహదారులపై ఉన్న అనాథలకు దుప్పట్ల పంపిణీ, అనాథాశ్రమంలో అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఓర్చుకునే సహనం, నాయకత్వ లక్షణాలు, పేదలను పలకరించే తీరు వైఎస్ జగన్‌కే సొంతమన్నారు. నేటి యూత్ ఐకాన్ జగన్ అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటయ్య, కో ఆర్డినేటర్ పద్మారెడ్డి, వైఎస్ జగన్ యూత్ నాయకులు వినోద్‌కుమార్‌రెడ్డి, విద్యార్థులు షాహిద్, షేక్‌షావలి, మహేష్‌గౌడ్, విజయసింహారెడ్డి పాల్గొన్నారు.