తెలుగులో స్పానిష్‌ నటి... ఆశ్చర్యపోతున్న నెటిజన్లు | Netflix Money Heist Star Nairobi Telugu Video Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

‘ఏంటీ.. నైరోబీకి తెలుగు వచ్చా?!’

Published Thu, May 21 2020 4:46 PM | Last Updated on Thu, May 21 2020 5:17 PM

Netflix Money Heist Star Nairobi Telugu Video Goes Viral In Social Media - Sakshi

స్పానిష్‌ టీవీ షో ‘మనీహీస్ట్‌‌’ వెబ్‌సీరిస్ 2017 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ వెబ్‌సీరిస్‌లో నైరోబీ పాత్రతో అలరిస్తున్న స్పెయిన్‌ నటి అల్భాఫ్లోర్‌ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె భారతీయ మహిళగా చీర, బొట్టుతో తెలుగులో ఆనర్గళంగా మాట్లాడుతున్న ఓ సన్నివేశం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. స్పానిష్‌ నటి అయిన అల్భా తెలుగులో స్పష్టంగా మట్లాడటం చూసి నైరోబీకి తెలుగు వచ్చా అని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ సన్నివేశం 2013లో ఆమె నటించిన స్పానిష్‌ చిత్రం ‘విసెంటే ఫెర్రర్‌’లోనిది. ఇందులో అల్భా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో నివసించే సమీరా అనే స్పానిష్‌‌ యువతి పాత్రలో కనిపించారు. (రూట్‌ మార్చిన ‘కుమారి’)

కాగా ఈ సినిమా జెస్యూట్ మిషనరీలో భాగంగా ఇండియాలో మతప్రచారం చేసే అంశంపై  తెరకెక్కింది. ఇందులో స్పానిష్ భాషను తెలుగులోకి అనువాదించే పాత్రలో  అల్భా కనిపిస్తుంది. ఎప్పుడూ మోడ్రన్ దుస్తుల్లో కనిపించే నైరోబీని ఒక్కసారిగా చీరలో చూసేసరికి ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఆమె తెలుగులో మాట్లాడటం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంటూ నెటిజన్లు కామెం‍ట్స్‌ పెడుతున్నారు. అంతేగాక ఈ వీడియోను ఆదివారం యూట్యూబ్‌లో షేర్‌ చేయడంతో ఇప్పటి వరకు 7.8 లక్షల పైగా వ్యూస్‌, 8 వేల లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌‌‌ అవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement