ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల స్థాయి సదస్సు చివరి రోజు శుక్రవారం సుదీర్ఘంగా సాగిన చర్చల్లో..
నైరోబి: ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల స్థాయి సదస్సు చివరి రోజు శుక్రవారం సుదీర్ఘంగా సాగిన చర్చల్లో.. వ్యవసాయానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కరవైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు భద్రత కల్పించకుండా.. వ్యవసాయ ఎగుమతుల రాయితీలను తొలగించే ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. అమెరికా సహా సంపన్న దేశాల అభిప్రాయాలతో భారత్, చైనాల సారథ్యంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు విభేదించటంతో.. నాలుగు రోజుల సదస్సులో ఎటువంటి ఫలితమూ రాలేదు.
ముందుగా.. దాదాపు 14 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న దోహా అజెండాను పూర్తిచేయాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు పట్టుపట్టడంతో నైరోబీలో జరుగుతున్న సమావేశాన్ని మరో రోజు పొడిగించారు.