Rich countries
-
ఇన్ఫ్రా, పెట్టుబడులపై ఫోకస్
వాషింగ్టన్: 2047 నాటికి భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి పెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఇన్ఫ్రా, పెట్టుబడులు, నవకల్పనలు, సమ్మిళితత్వం ఉన్నట్లు పెన్సిల్వేనియా యూనివర్సిటీ విద్యార్థులకు వివరించారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల కోసం అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆమె వర్సిటీని సందర్శించారు. ‘2047లో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అప్పటికల్లా సంపన్న దేశంగా ఎదగాలన్నది భారత్ ఆకాంక్ష. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నాలుగు అంశాలపై దృష్టి పెడుతోంది‘ అని సీతారామన్ పేర్కొన్నారు. వంతెనలు, పోర్టులు, డిజిటల్ తదితర మౌలిక సదుపాయాల కల్పన కీలకమని, అలాగే వాటిపై పెట్టుబడులు పెట్టడం కూడా ముఖ్యమని ఆమె తెలిపారు. భారత్‌కే పరిమితమైన సమస్యల పరిష్కారానికి వినూత్న ఆవిష్కరణలు అవసరమన్నారు. ఇక ప్రతి విషయంలోనూ అందరూ భాగస్వాములయ్యేలా సమ్మిళితత్వాన్ని సాధించడం కూడా కీలకమని మంత్రి పేర్కొన్నారు. -
రూపాయిలో వాణిజ్యానికి పలు దేశాల ఆసక్తి
న్యూఢిల్లీ: పలు వర్ధమాన దేశాలు, సంపన్న దేశాలు భారత్‌తో రూపాయి మారకంలో వాణిజ్యం చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ విధానంలో లావాదేవీల వ్యయాలు తగ్గే అవకాశాలు ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘ఈ విధానాన్ని సత్వరం ప్రారంభించేలా బంగ్లాదేశ్, శ్రీలంక ఇప్పటికే మనతో చర్చలు జరుపుతున్నాయి. పలు గల్ఫ్ దేశాలు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నాయి. దీని వల్ల ఒనగూరే ప్రయోజనాలు తెలిసే కొద్దీ మరిన్ని దేశాలు కూడా ఇందులో చేరొచ్చు. సింగపూర్ ఇప్పటికే కొంత మేర లావాదేవీలు జరుపుతోంది‘ అని మంత్రి వివరించారు. ఈ పరిణామం భారత అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఇప్పటికే నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాలతో రూపాయి మారకంలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తోంది. యూఏఈ నుంచి కొనుగోలు చేసిన క్రూడాయిల్‌కి తొలిసారిగా రూపాయల్లో చెల్లింపులు జరిపింది. -
Global Warming: భూమిని వేడెక్కిస్తున్న పాపం... పెద్ద దేశాలదే!
గ్లోబల్ వార్మింగ్. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. దీని దెబ్బకు భూగోళపు సగటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అవి ఇంకో అర డిగ్రీ మేరకు పెరిగినా సర్వ వినాశనం జరిగే పరిస్థితి! ప్రాణికోటి మనుగడకే పెను ముప్పు! ఈ ప్రమాదం ఎంతో దూరం కూడా లేదని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా పరిస్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. ముఖ్యంగా గ్లోబల్ వార్మంగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అంతర్జాతీయ పర్యావరణ సదస్సుల్లో దీనిపై ఎంతగా ఆందోళన వ్యక్తమవుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. ఉద్గారాలకు ముకుతాడు వేస్తామన్న సంపన్న దేశాల వాగ్దానాలు నీటిమూటలే అవుతున్నాయి. తరచి చూస్తే, గ్రీన్‌హౌస్‌వాయు ఉద్గారాల్లో సింహ భాగం పెద్ద దేశాలదే. మాటలే తప్ప చేతల్లేవు 2022లో ప్రపంచ దేశాలన్నీ కలిపి విడుదల చేసిన గ్రీన్హౌస్ వాయువుల పరిమాణమెంతో తెలుసా? ఏకంగా 5,000 కోట్ల మెట్రిక్ టన్నులు! పర్యావరణ కాలుష్య కారకాల్లో అతి ముఖ్యమైనవి గ్రీన్హౌస్ ఉద్గారాలే. భూగోళాన్ని వేడెక్కించడంలో కూడా వీటిదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రమాదకరమైన సమస్య విషయంలో మన నిర్లిప్త వైఖరికి ఏత ఏడాది గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల పరిమాణం మరో తాజా ఉదాహరణ మాత్రమే. ఈ పాపంలో సంపన్న దేశాల పాత్రే ఎక్కువ. చైనా విషయమే తీసుకుంటే, గతేడాది ప్రపంచ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో ఆ ఒక్క దేశం వాటాయే ఏకంగా 30 శాతం! 2022లో అది 1,440 కోట్ల టన్నుల మేరకు కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. కొన్ని దశాబ్దాలుగా చైనా పారిశ్రామిక వ్యవస్థ ప్రధానంగా బొగ్గుపై ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక 639 కోట్ల టన్నులతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 343 కోట్ల టన్నులతో యూరోపియన్ యూనియన్(ఈయూ) నాలుగో స్థానంలో ఉంది. గణాంకాలపరంగా 352 కోట్ల టన్నులతో ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు కనిపించినా జనాభాను బట్టి చూస్తే కర్బన ఉద్గారాల పాపంలో మన వాటా నిజానికి చాలా తక్కువ. మన తలసరి వార్షిక కర్బన ఉద్గారాలు కేవలం 2.5 టన్నులు! ప్రపంచ వేదికలపై పెద్ద మాటలు చెప్పే అమెరికాదే ఈ పాపంలో అగ్ర స్థానం! ఒక్కో అమెరికన్ ఏటా సగటున 19 టన్నుల సీఓటూ ఉద్గారాలకు కారకుడవుతున్నాడు. కేవలం 2.5 కోట్ల జనాభా ఉన్న ఆ్రస్టేలియాలో తలసరి కర్బన ఉద్గారాలు 20 టన్నులు, 3.8 కోట్ల జనాభా ఉన్న కెనడాలో 18 టన్నులు, 14 కోట్ల జనాభా ఉన్న రష్యాలో 14 టన్నులు! 20.7 టన్నుల తలసరి ఉద్గారాలతో సౌదీ అరేబియా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండటం విశేషం. మొత్తమ్మీద ప్రపంచ కర్బన ఉద్గారాల్లో చైనా, అమెరికా, ఈయూ వాటాయే దాదాపు సగం! వీటిలోనూ చారిత్రకంగా చూసుకుంటే అమెరికా, ఈయూ రెండే ప్రపంచ కాలుష్యానికి ప్రధాన కారకులుగా ఉంటూ వస్తున్నాయి. వేడెక్కుతున్న భూమి భూగోళపు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు నాటితో గత 150 ఏళ్లలో 1.5 డిగ్రీలకు మించి పెరిగిపోయింది! ఇటీవల ఒకానొక దశలో అది 2 డిగ్రీలకు మించి కలవరపరిచింది కూడా. దాన్ని 1.5 డిగ్రీలకు మించకుండా కట్టడి చేయాలన్న పారిస్ ఒప్పందానికి ప్రపంచ దేశాలన్నీ పేరుకు అంగీకరించాయే తప్ప ఆచరణలో చేస్తున్నది పెద్దగా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ఏ క్షణమైనా పేలనున్న మందుపాతర మీద ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా ఆందోళన వెలిబుచి్చంది. కర్బన ఉద్గారాల ప్రవాహం ఇలాగే కొనసాగి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతే ప్రపంచ దేశాలన్నీ ఎలాగోలా ప్రస్తుత పర్యావరణ లక్ష్యాలను చేరుకున్నా భూమి 2 డిగ్రీలను మించి వేడెక్కడం ఖాయమని హెచ్చరించింది. అప్పుడు కనీవినీ ఎరగని ఉత్పాతాలను, ఘోరాలను నిత్యం కళ్లజూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్–28 జరుగుతోంది. అందులోనైనా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేసి భూగోళాన్ని కాపాడుకునే దిశగా ఏమైనా నిర్ణయాత్మకమైన అడుగులు పడతాయేమో చూడాలి. ఏమిటీ కర్బన ఉద్గారాలు? బొగ్గు, చమురు, గ్యాస్‌ను మండించినప్పుడు అవి వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అది కొన్ని వందల ఏళ్లపాటు వాతావరణంలోనే ఉండిపోయి భూమిని వేడెక్కిస్తూ ఉంటుంది. ‘‘ఆ లెక్కన భూమికి ముప్పు కేవలం 2022 తాలూకు కర్బన ఉద్గారాలు మాత్రమే కాదు. పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక గత 150 ఏళ్లలో విడుదలైన కర్బన ఉద్గారాలన్నీ ఇప్పటికీ భూమిని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ఆ లెక్కన ఈ 150 ఏళ్లలో అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికాదే గ్లోబల్ వార్మింగ్‌లో ప్రధాన పాత్ర అని చెప్పాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్‌లోని ఎక్స్టర్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త పియరీ ఫ్రెడ్లింగ్‌స్టెయిన్ కుండబద్దలు కొట్టారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాపం మీది.. పరిహారమివ్వండి.. పేద దేశాల డిమాండ్
షెర్మ్–ఎల్–షేక్: భూతాపం, ప్రకృతి విపత్తులు, ఉత్పాతాలు.. వీటికి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగించడం, పర్యావరణాన్ని నాశనం చేయడమే కారణం. ఈ పాపం సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలదేనని పేద దేశాలు ఘోషిస్తున్నాయి. శిలాజ ఇంధనాలను అధికంగా ఉపయోగించే దేశాల కారణంగా తాము బాధితులుగా మారాల్సి వస్తోందని వాపోతున్నాయి. బడా దేశాలు, కార్పొరేట్ సంస్థలు నష్ట పరిహారం చెల్లించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్‌లో జరుగుతున్న కాప్–27లో పలుదేశాల నాయకులు ఈ డిమాండ్‌కు మద్దతుగా గళం విప్పుతున్నారు. విపత్తుల్లో నష్టపోతున్న పేద దేశాలకు న్యాయం చేయాలని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్‌వెరియా అన్నారు. శిలాజ ఇంధన కంపెనీలు నిత్యం 3 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జిస్తున్నాయని ఆంటిగ్వా బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌనీ చెప్పారు. అందులో కొంత సొమ్మును పేద దేశాలకు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూగోళాన్ని మండించి, సొమ్ము చేసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన కంపెనీలు తమ లాభాల నుంచి గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ చెల్లించాలన్నారు. మానవ నాగరికతను బలిపెట్టి లాభాలు పిండుకోవడం సరైంది కాదన్నారు. నష్టపరిహారం కోసం అవసరమైతే అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు. పెద్ద దేశాల నేతలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రతిఏటా కాప్‌కు సదస్సుకు హాజరై, ఘనంగా ప్రకటనలు ఇచ్చి వెళ్లిపోతున్నారని తప్పు ఆచరణలో ఏమీ చేయడం లేదని గాస్టన్ బ్రౌనీ ఆరోపించారు. వాతావరణ లక్ష్యాలను సాధించాలంటే చిన్న దేశాలపై విధించిన చట్టవిరుద్ధమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మాంగాగ్వే పేర్కొన్నారు. మడ అడవుల సంరక్షణలో సహకరిస్తాం మడ అడవుల పునరుద్ధరణలో భారత్ నైపుణ్యం సాధించిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు. పర్యావరణానికి అత్యంత కీలకమైన మడ అడవుల సంరక్షణ కోసం గత ఐదు దశాబ్దాలుగా కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. ఈ విషయంలో ఇతర దేశాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. కాప్–27 సందర్భంగా యూఏఈ, ఇండోనేషియా ఆధ్వర్యంలో మాంగ్రూవ్ అలయెన్స్ ఫర్ క్లైమేట్(ఎంఏసీ)ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, కాపాడుకోవడం ఈ కూటమి లక్ష్యం. ఈ సందర్భంగా భూపేంద్ర మాట్లాడారు. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించడానికి మడ అడవుల సంరక్షణ అత్యంత కీలకమని సూచించారు. కర్బన ఉద్గారాల నిర్మూలన ఇలాంటి అడవులతో సాధ్యమవుతుందన్నారు. అండమాన్, సుందర్బన్స్, గుజరాత్ తీర ప్రాంతంలో మడ అడువుల విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు. చదవండి: షాకింగ్ రిపోర్ట్: కరోనాను మించిన వైరస్ తయారీలో పాక్-చైనా! -
స్వేచ్ఛా వాణిజ్యానికి చెల్లుచీటీ
ఇంతకాలం స్వేచ్ఛా వాణిజ్యం, గ్లోబలైజేషన్ అంటూ ఊదరగొట్టడమే గాక ప్రపంచ దేశాలన్నింటినీ అందుకు నయానో భయానో ఒప్పించిన సంపన్న పారిశ్రామిక దేశాలు ఇప్పుడు రూటు మారుస్తున్నాయి. ‘మిత్ర’ దేశాలతో మాత్రమే వ్యాపార బంధాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా ముందుంది. దీన్ని ఫ్రెండ్ షోరింగ్, రీ షోరింగ్ (వ్యాపారాల తరలింపు), నియర్ షోరింగ్ (పొరుగు దేశాల్లోనే పరిశ్రమలు నెలకొల్పడం) వంటి పేర్లతో పిలుస్తున్నారు. ‘‘అన్ని వస్తువులనూ అమెరికానే తయారు చేయడం అసాధ్యం గనుక కాబట్టి నిరంతర సరఫరా కోసం నమ్మకమైన మిత్రదేశాలతో కలిసి అడుగులు వేయాల్సిన టైమొచ్చింది’’ అని అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల స్పష్టం చేశారు. అంతర్జాతీయ విపణిలో ఈ సరికొత్త మార్పు విపరిణామాలకే దారి తీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా, చైనా మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్ధానికి తెర లేచింది. ఇరు దేశాలూ పరస్పరం ఆంక్షలు విధించుకుంటూ వచ్చాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలన్నింటికీ వస్తూత్పత్తి కేంద్రమైన చైనాతో విభేదాలతో అమెరికా, మిత్ర దేశాలకు సరుకుల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీన్నుంచి కోలుకోకముందే వచ్చి పడ్డ కరోనా అంతర్జాతీయ వాణిజ్యాన్ని రెండేళ్లపాటు అతలాకుతలం చేసింది. ఆ వెంటనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ..అలా మొదలైంది ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చైనా, రష్యా వంటి ప్రత్యర్థి దేశాలపై ఇక ఏ విషయానికీ ఆధార పడకూడదని అమెరికా, మిత్ర దేశాలు నిశ్చయానికి వచ్చాయి. దాంతో వాటిమధ్య ఫ్రెండ్ షోరింగ్ విస్తరిస్తూ వస్తోంది. నిర్నిరోధంగా సరుకుల ఉత్పత్తి, సరఫరా కోసం కలిసి పని చేయాలని అమెరికా, జపాన్, భారత్, యూరప్‌తో కలిసి 17 దేశాలు నిశ్చయించుకున్నాయి. పారదర్శకత, వైవిధ్యం, భద్రత, స్థిరత్వం అన్న నాలుగు సూత్రాల ఆధారంగా పని చేయాలని ఒప్పందం చేసుకున్నాయి. చైనాను దూరం పెట్టేందుకు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ పేరిట మిత్ర దేశాలతోకలిసి అమెరికా మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. సెమీ కండక్టర్ల తయారీకి ఐరోపాలో ఏకంగా 4,300 కోట్ల పౌండ్ల పెట్టుబడులకూ సిద్ధపడింది. జీ7 దేశాలు కూడా వ్యూహాత్మక, అత్యవసర పరిశ్రమల తరలింపు కోసం ఏకంగా 60 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఇవన్నీ 150 దేశాల్లో పట్టు సాధించే లక్ష్యంతో చైనా తెర తీసిన బెల్ట్ అండ్ రోడ్ విధానానికి విరుగుడు యత్నాలే. - దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి అభివృద్ధికి విఘాతమే: రాజన్ ధనిక దేశాల ఫ్రెండ్లీ షోరింగ్ ధోరణి పేద, వర్ధమాన దేశాలకు గొడ్డలిపెట్టుగా మారగలదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరిస్తున్నారు. ‘‘స్వేచ్ఛా వాణిజ్యం వల్ల భారీగా వచ్చిపడ్డ పెట్టుబడులతో ఈ దేశాలు బాగా లాభపడ్డాయి. సంపన్న దేశాల తిరోగమన విధానంతో ఇది తలకిందులవుతుంది’’ అన్నది ఆయన అభిప్రాయం. మనకు లాభమే! ఫ్రెండ్లీ షోరింగ్ విధానంతో ఇండొనేసియా, మలేసియా, వియత్నాం, భారత్, బల్గేరియా, రొమేనియా వంటి దేశాలు లాభపడతాయని అంచనా. భారత్‌లో 300 కోట్ల డాలర్లతో ఇజ్రాయెల్ మైక్రో చిప్ ప్లాంట్ పెట్టనుంది. ఆస్ట్రేలియా కూడా ఖనిజాల సరఫరా ఒప్పందం చేసుకుంది. విధానాలను మరింత సరళతరం చేస్తే ఇలాంటి పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడతాయన్నది ఆర్థికవేత్తల అంచనా. 75 ఏళ్ల గ్లోబలైజేషన్ రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛా వాణిజ్యానికి పునాదులు వేస్తూ భారత్ సహా 23 దేశాలు 1947 అక్టోబర్‌లో గాట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1995 నాటికి 125 దేశాలు ఇందులో చేరాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు ద్వారా దీనికి సంస్థాగత రూపం ఏర్పడింది. చౌకగా శ్రమ శక్తి, ముడి సరుకులు లభించే ప్రాంతాలు, వస్తూత్పత్తి సామర్థ్యమున్న దేశాలకు బడా పరిశ్రమలు తరలి వెళ్లేందుకు ఇది ఉపయోగపడింది. ఇదీ చదవండి: క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్ చేంజర్ -
ఆ దేశాలతోనే పర్యావరణానికి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు, భారీగా కర్బన ఉద్గారాల విడుదలకు సంపన్న దేశాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. భూమిపైనున్న సహజ వనరుల్ని విపరీతంగా దోపిడీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు ఆ దేశాల నుంచే విడుదల అవుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల్లో భారత్ ప్రమేయాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ , నమామి గంగ, ఒకే సూర్యుడు–ఒకే ఇంథన వ్యవస్థ వంటి పథకాలతో బహుహుఖంగా పర్యావరణ పరిరక్షణకు భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన మట్టిని కాపాడుకుందాం ఉద్యమంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సారవంతమైన మట్టిపై భారత్ రైతుల్లో అవగాహన అంతగా లేదన్న ప్రధాని సాయిల్ హెల్త్ కార్డుల్ని ఇవ్వడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని మోదీ తెలిపారు. ముందుగానే లక్ష్యాలను చేరుకున్నాం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను మనం ముందే సాధించామని ప్రధాని చెప్పారు. పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని గడువు కంటే అయిదు నెలల ముందే సాధించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తిని డెడ్‌లైన్ కంటే తొమ్మిదేళ్లు ముందే సాధించామని తెలిపారు. ‘సేవ్ సాయిల్ మూవ్మెంట్’ ద్వారా నేలలో సారం క్షీణించడంపై అవగాహన పెంచడానికి, సారాన్ని మెరుగుపరచడానికి ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ప్రపంచ వ్యాప్త ఉద్యమాన్ని ప్రధాని అభినందించారు. మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ: జగ్గీ వాసుదేవ్ మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ సాధ్యమని ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం మట్టిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. లైఫ్‌స్టైల్ ఉద్యమం ప్రారంభం పర్యావరణహితంగా మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఉద్దేశించిన లైఫ్‌స్తైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ (లైఫ్) ఉద్యమాన్ని ప్రధాని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడానికి తమ వంతుగా లైఫ్‌స్టైల్ మార్చుకుంటే వారిని ప్రోప్లానెట్ పీపుల్ అని పిలుస్తారని అన్నారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారత్ చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. వాతావరణ మార్పుల నివారణతోపాటు వాతావరణ లక్ష్యాల సాధనలో భారత్ పాత్ర, నాయకత్వం చాలా కీలకమైందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. -
కరోనా : 2022 వరకు వారికి టీకా అందదు
లండన్: కరోనా వైరస్ కట్టడి కోసం ప్రపంచదేశాలన్ని వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రెండు, మూడు వ్యాక్సిన్లు అత్యవసర అనుమతి కూడా పొందాయి. ఈ నేపథ్యంలో బీఎంజే మెడికల్ జర్నల్ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దాని ప్రకారం 2022 వరకు ప్రపంచంలో ఐదొందుతల జనాభాకు వ్యాక్సిన్ అందదని తెలిపింది. ధనిక దేశాలు ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయని.. ఫలితంగా పేద దేశాల ప్రజలకు వ్యాక్సిన్ ఇప్పట్లో అందుబాటులోకి రాదని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న డజన్ల కొద్దీ వ్యాక్సిన్లలో కనీసం ఒకదానిని అయినా పొందే అవకాశాలను పెంచుకోవాలనే ఆత్రుతతో, అనేక దేశాలు అనేక రకాల ఔషధాల కేటాయింపులను తగ్గించాయి. ఇక ప్రపంచ జనాభాలో కేవలం 14 శాతం మాత్రమే ఉన్న సంపన్న దేశాలు ఇప్పటికే వచ్చే ఏడాది వరకు అందుబాటులోకి రానున్న 13 ప్రముఖ కంపెనీలు అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ డోసుల్లో సగానికి పైగా ముందే ఆర్డర్ చేసినట్లు జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. (చదవండి: వైద్యుడు కాదని వ్యాక్సిన్‌ను నమ్మలేదు.. కానీ) ఇక కరోనా కట్టడి కోసం 100 శాతం సామార్థ్యం గల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దాన్ని ప్రపంచ జనాభా అందరికి సరిపోయే మొత్తంలో ఉత్పత్తి చేసినప్పటికి 2022 వరకు ఐదొంతుల ప్రపంచ జనాభాకి వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని స్టడీ తెలిపింది. బీఎంజే మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఈ నివేదిక నవంబర్ మధ్య వరకు లభించిన డాటా ఆధారంగా రూపొందించారు. ఇప్పటికే ఈ దేశాలు 7.48బిలియన్ల డోసులను రిజర్వ్ చేసుకున్నాయని నివేదిక తెలిపింది. ఎందుకంటే ప్రస్తుతం అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్లను రెండు డోసులు తీసుకోవాల్సి ఉండటంతో భారీగా వ్యాక్సిన్లను రిజర్వ్ చేసుకున్నాయి. ఇక 2021 చివరి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5.96 బిలియన్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి కానున్నాయి. -
సంపన్న దేశాల్లోనే తగినంత ఆక్సిజన్
కోనాక్రి(గినియా) : కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన ఆక్సిజన్ కొరత ప్రపంచవ్యాప్తంగా కఠోర వాస్తవాలను వెలికితెస్తోంది. సంపన్న దేశాలైన యూరప్, ఉత్తర అమెరికాల్లోని ఆసుపత్రుల్లో నీరు, విద్యుత్ మాదిరిగా ఆక్సిజన్‌ను ప్రాథమిక అవసరంగా గుర్తిస్తారు. ఇక్కడ ద్రవరూపంలో పైప్‌ల ద్వారా నేరుగా ఆసుపత్రిలోని కోవిడ్ రోగుల బెడ్స్‌కి ఆక్సిజన్ చేరుతుంది. అయితే పెరు నుంచి బంగ్లాదేశ్ వరకు పేద దేశాల్లో ఆక్సిజన్ కొరత ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ప్రపంచ జనాభాలో కనీసం సగం మందికి ఆక్సిజన్ అందుబాటులో లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంగోలో కేవలం 2 శాతం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉంది. టాంజానియాలో 8 శాతం, బంగ్లాదేశ్‌లో 7 శాతం ఉన్నట్టు ఒక సర్వేని బట్టి తెలుస్తోంది. గినియాలో ఏ ఆసుపత్రలో ఒక్క బెడ్‌కి నేరుగా ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేదు. (ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు) -
సంపదలో భారత్‌కు ఆరో స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచంలోని సంపన్న దేశాల్లో భారత్ 8,230 బిలియన్ డాలర్ల సంపదతో ఆరో స్థానంలో నిలిచింది. అమెరికా 62,584 బిలియన్ డాలర్లతో అత్యంత సంపన్న దేశంగా మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు ఏఎఫ్ఆర్ ఆసియా బ్యాంకు ‘గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ’ నివేదిక విడుదలైంది. చైనా 24,803 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జపాన్ 19,522 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నాయి. ఆయా దేశాల్లోని అందరు వ్యక్తుల ఉమ్మడి సంపద విలువ ప్రకారం వేసిన అంచనాలు ఇవి. వ్యక్తుల సంపద అంటే ఆస్తులు, నగదు, షేర్లు, వ్యాపార ప్రయోజనాలు అన్నీ కలిసినవి (అప్పులు మినహాయించగా). భారత్‌లో సంపద సృష్టికి తోడ్పడిన అంశాల్లో భారీ సంఖ్యలో వ్యాపారవేత్తలు, మంచి విద్యా విధానం, ఐటీ, బీపీవో, రియల్ఎస్టేట్, హెల్త్‌కేర్, మీడియా రంగాలు బలంగా ఉండటమేనని నివేదిక తెలిపింది. వీటి కారణంగా పదేళ్లలో సంపద 200 శాతం వరకు పెరగడానికి తోడ్పడినట్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు (వ్యక్తుల) సంపద 215 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. ఇది 2027 నాటికి 321 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్రపంచంలో 2,252 మంది బిలియనీర్లు (100 కోట్ల డాలర్లకంటే ఎక్కువ ఉన్నవారు) ఉన్నారని, 5,84,000 మల్టీ మిలియనీర్లు (కోటి డాలర్ల కంటే ఎక్కువ) ఉన్నారని, అదే సమయంలో 1.52 కోట్ల ధనవంతులు ఉన్నారని వివరించింది. -
దేశం ధనికం.. వ్యక్తులు పేదలు!
♦ టాప్ టెన్ సంపన్న దేశాల్లో ♦ భారత్‌కు 7వ ర్యాంక్ ♦ న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో భారత్ స్థానం పొందింది. ఏడవ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఇండియాలో మొత్తం సంపద 5,200 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ అధిక జనాభా వల్లే జాబితాలో స్థానం సంపాదించుకుందని నివేదిక పేర్కొంటోంది. ఇక తలసరి ఆదాయం పరంగా చూస్తే భారతీయులు చాలా పేదరికంలో ఉన్నారు. న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం.. ♦ ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో అగ్రస్థానంలో అమెరికా ఉంది. ఈ దేశంలోని మొత్తం వ్యక్తుల సంపద 48,700 బిలియన్ డాలర్లు. ♦ అమెరికా తర్వాత వరుసగా చైనా (2వ స్థానం-17,300 బి.డాలర్లు), జపాన్ (3వ స్థానం-15,200 బి.డాలర్లు), జర్మనీ (4వ స్థానం-9,400 బి.డాలర్లు), యూకే (5వ స్థానం-9,200 బి.డాలర్లు) ఉన్నాయి. ♦ వీటి తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్ (6వ స్థానం-7,600 బి. డాలర్లు), ఇటలీ (8వ స్థానం-5,000 బి.డాలర్లు), కెనడా (9వ స్థానం-4,800 బి. డాలర్లు), ఆస్ట్రేలియా (10వ స్థానం-4,500 బి. డాలర్లు) నిలిచాయి. ♦ భారత్‌లో సంపద భారీగా వున్నా, అధిక జనాభాకావడం వల్ల తలసరి సంపద 4,000 డాలర్లకే (రూ. 2.68 లక్షలు) పరిమితమయ్యింది. ఆస్ట్రేలియాలో తలసరి సంపద 2.05 లక్షల డాలర్లు. భారత్‌లో 2015 గణాంకాల ప్రకారం వార్షిక తలసరి ఆదాయం 1,313 డాలర్లే (రూ. 88,000). సంపన్న దేశాల జాబితాలో భారత్‌కు ముందు, వెనుక వున్న ఫ్రాన్స్ (35,600 డాలర్లు), ఇటలీ (23,000 డాలర్లు)ల్లో తలసరి ఆదాయం భారత్‌కంటే బాగా ఎక్కువ. అమెరికాలో ఇది 38,000 డాలర్లు కాగా, చైనాలో 3,865 డాలర్లు. -
డబ్ల్యూటీఓ సదస్సులో ఏకాభిప్రాయం కరవు
నైరోబి: ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల స్థాయి సదస్సు చివరి రోజు శుక్రవారం సుదీర్ఘంగా సాగిన చర్చల్లో.. వ్యవసాయానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కరవైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు భద్రత కల్పించకుండా.. వ్యవసాయ ఎగుమతుల రాయితీలను తొలగించే ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. అమెరికా సహా సంపన్న దేశాల అభిప్రాయాలతో భారత్, చైనాల సారథ్యంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు విభేదించటంతో.. నాలుగు రోజుల సదస్సులో ఎటువంటి ఫలితమూ రాలేదు. ముందుగా.. దాదాపు 14 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న దోహా అజెండాను పూర్తిచేయాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు పట్టుపట్టడంతో నైరోబీలో జరుగుతున్న సమావేశాన్ని మరో రోజు పొడిగించారు.