నైరోబి: ఓ బస్సును హైజాక్ చేసిన తీవ్రవాదులు 28 మంది ప్రయాణికల్ని హతమార్చిన ఘటన కెన్యాలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం సోమాలియాకు చెందిన ఆల్ షబాబ్ తీవ్రవాదులు వంద మంది గ్రూపు గా ఏర్పడి నైరోబీ బస్సును హైజాక్ చేశారు. బస్సును కొంత దూరం తీసుకువెళ్లిన అనంతరం ప్రయాణికుల దింపి ఏ ప్రాంతానికి చెందిన వారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 'మీలో సోమాలియా ప్రాంతానికి చెందిన వారేవరు? సోమాలియేతర ప్రాంతానికి చెందిన వారెవరు?' అంటూ నిలదీశారు. ఆ ప్రయాణికుల్ని రెండు గ్రూపులుగా విడగొట్టి మరీ దారుణానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో 28 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, అధిక సంఖ్యలో గాయపడ్డారు. అయితే ఆ ప్రాంతానికి ఇంకా తమ రక్షణ దళాలు చేరుకోలేదని పోలీస్ కమాండర్ స్పష్టం చేశారు.