ఇస్లాం గురించి చెప్పలేదని.. భారతీయుడి కాల్చివేత | Nairobi killings: Indian shot when he couldn't answer query on Islam | Sakshi
Sakshi News home page

ఇస్లాం గురించి చెప్పలేదని.. భారతీయుడి కాల్చివేత

Published Mon, Sep 23 2013 10:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

Nairobi killings: Indian shot when he couldn't answer query on Islam

ఇస్లాం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేనందుకు నైరోబీలోని ఓ మాల్లో భారతీయుడిని కాల్చి చంపారు. జోషువా హకీమ్ అనే వ్యక్తి మాల్కు వెళ్లగా, అక్కడకు కొందరు టీనేజర్లు, మరికొందరు ఆయుధాలు ధరించి వచ్చారు. వారివద్ద ఏకే-47 అసాల్ట్ రైఫిళ్లున్నాయి. వారు ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపినట్లు ద గార్డియన్ వెబ్సైట్ పేర్కొంది.

ముస్లింలు ఎవరో గుర్తించడానికి సాయుధులు స్వాహిలి భాషలో మాట్లాడి, సమాధానాలు ఇచ్చినవారిని అక్కడినుంచి వెళ్లిపొమ్మన్నారు. హకీమ్ తన ఐడీ కార్డు మీద పేరులో ఉన్న క్రిస్టియన్ పదాన్ని వేలితో మూసేసి.. సాయుధుల్లో ఒకరి వద్దకు వెళ్లాడు. వాళ్లు తనను వెళ్లిపొమ్మని చెప్పారని, కానీ ఒక భారతీయుడు వచ్చినప్పుడు మాత్రం మహ్మద్ తల్లి పేరేంటని అడిగారని, అతడు సమాధానం చెప్పలేకపోవడంతో వెంటనే కాల్చి చంపేశాడని హకీమ్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement